Others

పాశురాలు..జ్ఞానమార్గ సోపానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
......... వెలుగురేఖలు విచ్చుకోకముందే కోడికూతలు రాకపూర్వమే, అలనాడు మాలదాసరి నిన్ను కొలవడానికి వచ్చినపుడు నీవేవిధంగా ఆదుకొన్నావో అటులనే నేడు నా స్నేహితులతో కలసి నిన్ను సేవించడానికి తూర్పున భానుడు మేలుకొనక ముందే... వడివడిగా నిన్ను చేరి నీ దర్శనమునకై వేయి కనులతో ఎదురుచూస్తున్నాం స్వామీ మా మొర ఆలకించి మమ్మాదుకో గోపాల బాల అంటూ ప్రతిరోజు ప్రతివైష్ణవాలయంలో అనుసంధానించే పాశురాల వెనుక ఓ పరమాద్భు తమైన కథ ఉంది. పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖ స్థానంలో ఉన్నఆళ్వారు గోదాదేవి. గోదాదేవి ఆ విల్లిపుత్తూరు లో వెలసిన వటపత్ర శాయికి పరమభక్తుడైన విష్ణుచిత్తులకు తులసీవనంలోతోటపని చేస్తుండగా చిన్నారి శిశువుగా లభించింది. శ్రీహరి వాహనమైన గరుడుడు, తన స్వామిని అల్లునిగా చూడాలని , భూదేవి తన పతికి ఇష్టమైన పుష్పకైంకర్యం చేసి తరించాలని కోరుకున్నారు. వారిద్దరి కోరికను ఈ యుగంలో శ్రీవిల్లిపుత్తూరులో ఫలింపచేశాడా శ్రీహరి.
విష్ణుచిత్తుడు తనకు లభించిన ఆ చిన్నారికి కోదై అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. తండ్రిలాగానే హరిభక్తిని పెంచుకున్న కోదై గోదాగా మారి ప్రతిరోజు తన తండ్రి చేత తులసి, పూమాలలను తానే తయారు చేసి తానుధరించి చూసి మురిసి తన నాథుడుగా ఇంకెంతగా ఆనందిస్తాడో అని భావిస్తూ స్వామి కైంకర్యానికి పంపేది. ఒకనాడు విష్ణుచిత్తుడుస్వామికి మాలాకైంకర్యం చేస్తుండగా పొడవాటి కేశం కనిపించింది. దానితో మాల అపవిత్రం అయిందని ఎంతో బాధపడ్డాడు. ఇంత అపచారం చేశానని భావించి దుఃఖించే ఆ విష్ణుచిత్తునికి స్వామి మాలను ధరించి బావిలో నీడను చూసుకొని మురిసే గోదా దేవి కనిపించింది.
వేదన చెంది ఇలా చేయడంతప్పు అని చిరు కోపంతో తన తనయకు చెప్పాడు. తన తనయ తెలియక తప్పు చేసింది మన్నించమని శ్రీహరిని పదేపదే వేడుకున్నాడు. ఆ బాధలో ఆయనకు నిద్ర పట్టింది. విష్ణుచిత్తులకు కలలో పెరుమాళ్ దర్శనమిచ్చి గోదా ధరించిన మాలనే తనకెంతో ఇష్టమని చెప్పడంతోనే నిద్రలోనే గోదాను, ‘‘శ్రీదేవియో, భూదేవియో, నీళాదేవియో ఈ ఇంట అవతరించిందని’’అంటూ పరవశించాడు విష్ణుచిత్తులు. తన్మయ త్వంతో శూడికొడుత్తనాచియార్ అని అమ్మను కీర్తిస్తూ పాటలు పాడాడు. ద్వాపరంలో గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతం విశేషాలను తన తండ్రినుండి ఆండాళ్ తెలుసుకొంది. గోపాలదేవుని పొందడానికి అనువైన కాత్యాయినీ వ్రత విధానాన్ని తెలుసుకొన్న గోదాదేవి మార్గశిరమాసంలో ధనుస్సంక్రమణ దినాన కాత్యాయినీ వ్రతానికి సమాన ప్రతి పత్తిగల ‘మార్గళి’ వ్రతాన్ని గోదాదేవి చేపట్టింది. విల్లిపుత్తూరునే రేపల్లెగా భావించింది. వటపత్రశాయిని నందగోపునిగా, గోపభామలను తన చెలికత్తెలను గా వారిలో తానొకతెగా ఊహించుకొని వ్రతమాచరించింది. ఆ వ్రతమే శ్రీ వ్రతం. ముప్పదిరోజులు సాగే ఈ వ్రతంలో నాడు గోపికల చిత్తవృత్తులను వారి హాస, హాస్య, లాస్యాలను ప్రకృతి సౌందర్యాలను, చివరగా శ్రీకృష్ణుని యందు తమకు గల ప్రేమానురక్తిని, శరణాగతిని వర్ణిస్తూ రోజుకొక పాశురంగా పాడింది. ఈ ముప్పైరోజుల పాశురాలే నేడు మనం అనుసంధానించుకునే తిరుప్పావై. కాత్యాయనీ వ్రతసమాప్తిరోజు స్వామినే తన కోరిక మేరకు వివాహం చేసుకొంది ఆ తల్లి. ఆ స్వామిలోనే తాను ఐక్యమైంది.
ఆమె రచించి పాడిన పాశురాలే దివ్యప్రబోధాలు, బ్రహ్మానంద సాగర తరంగాలు, మోక్షసౌధాన్ని చేరడానికి సోపానాలు అని ఎంచిన కోమాండూరి అరుంధతి కొత్తపేటలోని శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీవేంకటేశ్వ ఠాలయంలో నిత్యమూ సాయంసంధ్యా సమయంలో గోదాదేవి పాడిన పాశురాలను అనుసంధానిస్తూ వాటి అర్థతాత్పర్యాలను వివరిస్తూ ఆ కృష్ణుని లీలావిలాస వైభోగాలను చెవులకు ఇంపుగా చెపుతున్నారు. ఈ అరుంధతీయే గోదాగా మారి వేంకటేశ్వరుని సన్నిధి లో తిరుప్పావైను అనుసంధానిస్తుంటే ఇతర భక్తులం తా రేపల్లెలోని గోపభామలై వింటూ తమ జన్మ తన్మయమైనట్టుగాను, తామూ గోదాదేవివలె చెలులవలె మార్గళీ వ్రతాచరణను చేస్తున్నట్టు భావిస్తున్నారు.

- చరణ శ్రీ