Others

అమర ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర పుటలు తిరగేస్తే
అన్నీ అబద్ధాలే!

ఆత్మ‘హత్య’
పాఠాలున్నవి
ప్రేమ పుస్తకాలు
ఎలా అవుతాయి?

లేని ‘అమర ప్రేమికులకు’
పెద్ద పీట వేసి
భావితరాలను
పెడదోవ పట్టించింది!

‘ఒకటి’ అవ్వలేకపోతున్న
ఇద్దరి నడుమ
చివరి క్షణం వరకూ ఎక్కడున్నా
ఒకరి క్షేమాన్ని ఇంకొకరు
నిరంతరం ఆకాంక్షించడమే
అమర‘ప్రేమ’!

ఒకరి ప్రోద్భలంతో ఇంకొకరు
‘కలిసి’ తనువు చాలించి
జీవితాలు ముగించుకున్న చోట
ఒకరు అంటే ఇంకొకరికి
‘ప్రేమ’ ఎక్కడుంది?

ప్రేమే లేని అక్కడ
‘వారు’ అమర ప్రేమికులు
ఎలా అవుతారు?

ప్రేమికులారా రండి..
‘ప్రేమే’
అమరం
‘అమర ప్రేమికులు’
సుద్ధ అబద్ధం అని
ఇక రాయబోయే చరిత్రలో నైనా
ఓ ప్రేమాక్షరంగా
కలకాలం జీవిద్దాం!

- తిప్పాన హరిరెడ్డి 94938 32412