Others

సలేశ్వరం .. మహాక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ మహాక్షేత్రం కొలువై వున్నది. ఉగాది పర్వదినం గడిచాక వచ్చే మొదటి చైత్ర పౌర్ణమిరోజుకు ముందు రెండు రోజులు, తర్వాతి రెండు రోజులు మొత్తం ఐదురోజులపాటు జరిగే ఈ మహోత్సవం ఎంతో కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి కారణంగా అటవీ శాఖ అధికారులు మరియు అడవులలో నివాసముండే చెంచుల సహకారంతో ఏర్పాట్లను చేస్తారు. జన సంచారం లేని అడవి అయినందున ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. ఈ మహాక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే భక్తులకు పలు మార్గాలు కలవు. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి గల ప్రధాన రహదారి వెంట 150 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఫరహాబాద్ గేటు నుండి అడవిలోకి 32 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వున్నది. వాహనాలు దేవుని ఆలయందాకా వెళ్లని పరిస్థితి. దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు నడవక తప్పదు. ప్రకృతి రమణీయతతో, ఎతె్తైన కొండలనుండి పాలనురుగులా జాలువారే జలపాతం, కొండల అడుగుభాగంలో లింగమయ్య గుడి, ఆ గుడి ముందర వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు కన్పిస్తాయి. ఇరుకైన దారులు, రాళ్ళు రప్పలు, భయాన్ని కల్గించే దారులున్నాకూడా ఇష్టంతో కష్టాలను సైతం లెక్కచేయకుండా సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటున్నారంటే అక్కడి మహత్మ్యం ఎలా వుంటుందో తెలియకనే తెలుస్తుంది. ప్రమాదకరమైన దారులున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదంటే కారణం దేవుని మహత్మ్యానికి నిదర్శనమనిభక్తుల నమ్మకం. సలేశ్వరానికి ఇరుగుపొరుగు ప్రాంతాలనుండి భక్తులు అనేకమంది పాదయాత్రతో రావడం జరుగుతుంది. ఇక్కడికి పాదచారులు చేరుకోవడానికి మూడు దారులున్నాయి. అందులో మున్ననూర్ నుండి అటవీ దారినుండి ఈ మహాక్షేత్రానికి చేరుకుంటారు. మరోప్రక్క బలమూరు మండలంలోని దావాగు నుండి ఇంకొంతమంది ఈ క్షేత్రాన్ని చేరుకుంటారు. మరికొంతమంది లింగాలనండి అడవి మార్గం ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఇంకో ప్రత్యేకతేమిటంటే, శ్రీశైలం మల్లికార్జునస్వామి, సలేశ్వర లింగమయ్య స్వామి, లుండిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. ఇంకో ఐదవ లింగం నల్లమల్ల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సలేశ్వర మహాక్షేత్రం గురించి కొన్ని చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలు, పాల్కురి సోమనాథుడు వివరించారు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుంది. ఇంత చారిత్రక నేపథ్యం కలిగిన సలేశ్వరంలో ఏప్రిల్ 17న ఈ ఏడాదికిగాను, పలువురి భక్తులతో లింగమయ్య పూజలు స్వీకరించబోతున్నాడు.
ప్రభుత్వ అధికారులు సైతం చెంచు జాతి సహాయ సహకారాలు తీసుకుంటూ, పకడ్బందీగా అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేస్తూ, భక్తులకు చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక, ఈ క్షేత్రానికి పునరుద్ధణ కార్యక్రమాలు చేపడుతున్నారు. . ప్రకృతి ప్రేమికులకు కూడా ఇక్కడ ప్రకృతిని ఆకట్టుకోవచ్చు. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి. అందులో సలేశ్వరం, లొద్ది, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, పిల్లలమర్రి, మన్యంకొండ తదితర ప్రాంతాలలో ఆలయాలను అభివృద్ధి పరిచి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం సత్వరంగా పూనుకుంటే మరో తరానికి సంస్కృతీ సంప్రదాయాలను, కంటికి రెప్పలాగా కాపాడే దైవాన్ని చూడగలిగే మార్గాన్ని అందించినవారమవుతాము. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశమూ రావచ్చు. పర్యాటకాభివృద్ధికితోడ్పడినట్టూ అవుతుంది. ఇట్లా చేస్తే దేశాదాయం మెరుగు కావచ్చు. కేవలం ప్రభుత్వమే కాకుండా భక్తులు కూడా ఈ పునరుద్ధణ సేవాకార్యక్రమంలో స్వచ్ఛంధంగా పాల్గొంటే బాగుంటుంది.

- డా.పోలం సైదులు