Others

మహిమలకూ ధ్యానమే మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9849560014

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
ఇటీవలి కాలంలో కొంత మంది సాధకులు చేసిన ప్రార్థనలను పదరిశీలిద్దాం. శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతిముని (నాయనగా ప్రసిద్ధులు) శ్రీ మహాగణపతినిట్లు ప్రార్థించారు.
శ్లో॥ హస్తిముఖ యాచే గాఢరసభక్త్యా
ఆ విశ విభో మాం దివ్య నిజశక్త్యా
ఓ గజవదనా! నిన్ను గాఢ భక్తితో ప్రార్థిస్తున్నాను నీ దివ్య శక్తితో నన్నావహంచు ప్రభు!
అట్లాగే ఇంద్రాణి దేనిని కీర్తిస్తూ ఆమె దివ్య తేజస్సును తనలో ప్రవేశపెట్టమని చేసిన ప్రార్థన చూడండి.
శ్లో॥ నిర్జితశోకా! భూతతమా, సంస్కృత చిత్తా శుద్ధతమా
వాసవశక్తే వ్యోమజుష కాచ వినిచిర్మాం విశడు
భావము: చీకటిని శోకమును పోగొట్టి చిత్త సంస్కారాన్ని కలిగించి పరిశుద్ధమైన వాసవశక్తి యొక్క తరంగములు ఆకాశమునుండి నాలో ప్రవేశించు గాక! అట్లాగే
శ్లో॥ ఉద్గతకీలం మూలచిత్తమిదం భిన్నకపాలం శీర్షమిదం
ఉద్ధత మోహంచిత్తమిదం వాసవశక్తిః ర్మాంవిశతు
భావం: మూలాధార చక్రమందు అగ్నిలేస్తున్నది. శిరస్సున కపాల భేదనమైనది చిత్తము నమోహమణగినది, జగన్మాతయైన ఇంద్రాణి నాలో ప్రవేశించుగాక.
మహాయోగ్యులైన రమణమహర్షి, అరవిందుడు మొదలైన వారెందరో దివ్య శక్త్యావేశమున చేసిన ప్రయత్నములు, ప్రార్థనలు ఇట్టివే. వాల్మీకి మహర్షి నోటినుండి చందోబద్ధమైన వాక్కులు శ్లోక రూపమున మొదటగా వెలువడినపుడు బ్రహ్మ, సరస్వతి అతని వాక్కున ప్రవేశించునట్లు చేయుటవలన శ్లోక రూపములో ఛందోబద్ధమైన వాక్కులు వెలువడినట్లు చెప్పారు. ఇప్పటివరకు పైన చెప్పిన విధంగా సనాతన ధర్మంలో లేక మార్గంలో భారతీయ మహర్షులు, యోగులు, ఆచరించిన ధ్యానయోగమార్గం, మానవ జీవిత సార్థకతకెంతయు ననుసరణీయమైయున్నది. అట్టి మహనీయులకీ జాతి ఎంతయో ఋణపడియున్నదనుటలో సందియము లేదు. భారతీయ యోగ మరియు ధ్యానంలోని పరిజ్ఞానం ఇరవై వేల సంవత్సరాలకు పైగా పరిరక్షించుకొనబడింది. రిఈ పరిణితిలో యెందరో మహానుభావులు, యోగులు దీని ఫలితాల్ని చాలా స్పష్టంగా పొంది ప్రదర్శించారు. వారు అసంఖ్యాకులైనప్పటికి కొద్దిమందిని మనమిక్కడ గుర్తుకు తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి (1560-1750) సిద్ధపురుషులు తమ యిచ్చ వచ్చినంతకాలం బ్రతికి స్వచ్ఛందంగా దేహత్యాగం చేశారు. త్రైలింగస్వామి 280 సం.లు జీవించి సిద్ధిపొందారు. సొరకాయల స్వామి 202 ఏండ్లు బ్రతికినారు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి 190 ఏండ్లు జీవించి సజీవసమాధి పొందారు. వీరు సదా బ్రహ్మనిష్టులై యుండెడివారు.
వారు చూపిన మహిమలన్నిటిని చెప్పవలెనన్న వొక గ్రంథమేయగును. వారి సమాధి (ఆత్మనిష్టులైన) స్థితికి సంబంధించిన ఒకటి రెండు సంఘటనలు యిక్కడ ప్రస్తావిస్తారు.
1. సదాశివ బ్రహ్మేంద్రులొకసారి గ్రామాల పొలిమేరల్లో తిరుగుతూ పొలంగట్టుపై తలపెట్టి నిద్రిస్తుంటే ఆ పొలం యజమాని గమనించి ‘‘సర్వసంగ పరిత్యాగియైన సన్యాసికి కూడా తలగడ కావలసి వచ్చిందే’’ అన్నాడట. అది విన్న స్వామి తన యోగ శక్తి ప్రదర్శించే వుద్దేశంతో అక్కడే గాలిలో తేలుతూ నిదురించారట. ఆ దృశ్యం చూసిన పొలం యజమాని ‘‘ఒక్కొక్కడు యోగియైనా అహంకారం పోదుగదా’’ అన్నాడట. ఆ మాటలు విన్న సదాశివ బ్రహ్మేంద్రులు సాక్షాత్తు భగవంతుడే ఆ పొలం యజమాని రూపంలో వచ్చి తన అహంకారం తొలగించి అనుగ్రహించాడని గ్రహించి కృతజ్ఞతలు తెలిపారట.
2. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి, వొకసారి కావేరీ నది వొడ్డున ‘‘కోడుమూడి’’ అను ప్రదేశములో సమాధి (ధ్యాన) స్థితిలో వున్నారు. అప్పుడు కావేరీ నది వరదలతో వుప్పొంగింది. అప్పడు స్వామి వరదలో మునిగి ఇసుకలో పూడుకపోయిరి. మూడు మాసముల తరువాత రైతుల ఇసుక మేటలు తవ్వుతుండగా అందులో నుండి స్వామివారు బయటపడి ఏమీ జరగనట్లు వెళ్ళిపోయినారట.
3. జీవన్ముక్తులైన అవధూత స్థితిలో సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారొకసారి తిరుచిరాపల్లిలో నవాబు గుడారంలో ప్రవేశించి ఘోషాస్ర్తిలు వుండేవైపు పోతుంటే కోపోద్రిక్తుడైన నవాబు కత్తితో స్వామివారి భుజం నరికివేశాడు. భుజం తెగి వ్రేలాడుతోంది.
- ఇంకాఉంది