Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదియయోధ్యయని వింటిమి!
యోధుల నెలవని వింటిమి!
కోసల రాజేంద్రుడిచట దశరథుడని వింటిమి!

వారిని దర్శించుకొనగ నిచట విడిచి చేసితిమి
అదిగో! ఆ మ్రాని క్రింద రాత్రి కునుకు దీసితిమి.

అర్థరాత్రి దాహమంచు అలమటించినారు వారు
అంత నేను ముంతగొంచు అరుదెంచితి నిటకు

ముంచినానొ లేదొ ముంత! వచ్చెనొక్క శరమ్మంత!
వచ్చెనొ లేదో గుండెను జొచ్చెను నొప్పించెనంత!

ఇటుల యముని కంటనుబడి-
మిత్తియొడిని నుంటిని!
నీవింటి నంటి వెడలిన శరమంటి మడియనుంటిని!

అనుచు వగచె శ్రవణుండు
ఊపిరి బిగబట్టుకొనుచు

పెగలదు నృపునకు నోరే! పెల్లుబికెను కన్నీరే!
గుండెలోని ‘దడదడ’లను సూచించెను పెదవులే!

ఒడిలోనికి దీసి వాని తొడపై నిడుకొనెను
తల్లివోలె కరిగిపోయె! తండ్రివోలె పలికెను!

‘‘ఆ దశరథ రాజును నేనే- ఆ పాపిని నేనే!
వేటకంచు వచ్చి నిన్ను- వ్రేటు వేసినాను!

తెలియునంచు ‘శబ్ద్భేది’ తెగువ చూపినాను నేను
బ్రహ్మహత్య పాతకమ్ము మూటగట్టుకొనినాను
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087