Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ శవమును దీసికొంచు- ఆ వృద్ధుల కడకేగెను
వౌనముగా రోదించుచు- శుశ్రూషల జేసెను

విషయమరసి వారలపుడు గొల్లుమంచు నేడ్చిరి
వెక్కివెక్కి వారితోడ దిక్కులు రోదించెను

‘‘గడ్డిపోచ నోట గఱచి- నీట నీదుచుంటిమి
గడ్డిపోచ లాగికొంచు కన్నీటను ముంచితి

గ్రుడ్డి దీపముల పోలిక ‘రెపరెప’మనుచుంటిమి
పెనుతుఫానువై వీచితి- ఇంకెక్కడి వెలుగు’’?

అనుచు వారు రోదించిరి
గుండె బాదుకొనిరి

‘‘అయ్యయ్యో! నేనుంటిని! అటులనకుడి మీరు!
నా పాపము కడిగికొందు- మీ సేవల జేయుదు.

గుండె తీసి కుప్పవోతు- మీ పాదములందు
మీ సుఖమే నా సుఖమని- మిమ్ముల పూజించు’’

అనుచు వారి నూరడింప
యత్నించెను రాజు

‘‘మా చావును కళ్లజూచి మాతో పరిహాసమా?
కత్తికి రక్తమై రుచించు కరుణించగ బోదు

రాజు రాజె! కొడుకు కొడుకె! రాజెట్టుల కొడుకగు?
మా రక్తం పంచుకొన్న మా పాపడె కొడుకగు!

అడవిలోని మృగములట్లు-
ఆకునలము తినుచుంటిమి
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087