Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు క్రిందకు చూశాడు. దూరంగా ఒంటినిండా ప్రకృతి కోకని ధరించి, గాలికి కదలాడుతోన్న సాగర తరంగాల కుచ్చిళ్ళను సవరించుకొంటూ, తల నిండా మేఘాల మేలిముసుగును కప్పుకొన్న ధరిత్రి తనదారిని తాను తలవంచుకు వెళ్తోంది.
ఓహ్! ఏమందం?... కళ్ళు చెదిరే అందం!... ఎవరు సృష్టించారో గానీ, విశ్వ సౌందర్యమంతా ఒకేఒక్కచోట, ఆమెలోనే కేంద్రీకృతమైనట్లుగా ఉంది!
ఓ క్షణకాలం తన చూపుల్ని మరల్చుకోలేకపోయాడు.
ఆ సూరీడు తన వైపే గ్రుచ్చి, గ్రుచ్చి చూస్తున్నాడన్నది గ్రహించిన ఆ ధరిత్రి సిగ్గుల మొగ్గయింది! కానీ, తల ఎత్తనూ లేదు! పెదవి విప్పనూ లేదు!
తన దృష్టిని మరింత కేంద్రీకరించాడు. అక్కడే, ఆ భూమీదే ఓ ఆకారం, దానిచుట్టూ మరిన్ని ఆకారాలు మసక మసకగా కనిపించాయి!
క్రింద ఆ ధరిత్రి మీదే కుశాసనంపై పద్మాసనం వేసుక్కూచున్న దశరథ మహారాజు ఒక వైశ్వానరునిలా, హోమకుండాల ముందు కూర్చొని, యజ్ఞం గావిస్తున్నాడు సంతుకోసం. విశ్వకళ్యాణం కోసం! నక్షత్రాల ప్రోవుల్లా వెలిగిపోతున్నాయా కుండాలు! ఎంతో నియమనిష్ఠలతో శ్రద్ధాసక్తులతో, వేదమంత్రాలతో, హోమంగావిస్తున్నాడు! ఆ హవిస్సే విశ్వంనిండా వ్యాపిస్తోంది! తనని చేరుకుంటోంది! తనని మహేంద్రునిలా అనంత శక్తిమంతునిగావిస్తోంది! ఎంతటి ఆశ్చర్యం!
ఈసారి తన కుడివైపుకి చూశాడు. అక్కడ మరో వ్యక్తి, మరో మహాక్రతువుని చేస్తున్నాడు. తక్షణమైనా తీరిక లేకుండా! ఎవరాతడు?...తన కళ్ళని భూతద్దాలుగామార్చి మళ్ళీమళ్ళీ చూశాడు. సందేహం లేదు. విశ్వ కళ్యణార్థం యజ్ఞంగావిస్తున్నాడు.! కుండలతో కాదు బానలతో నేతినీ హోమద్రవ్యాలనీ గ్రుమ్మరిస్తున్నాడు! సంచులతో కర్పూర గుళికల్ని సమర్పిస్తున్నాడు! ఆతడుచ్చరించే ‘స్వాహా!’ నాదాలు తన చెవుల్లో గింగురుమంటున్నాయి! విశ్వం నిండా ప్రణవనాదం సుళ్ళు తిరుగుతోంది!
ఆపై తన ఎడమ వంక చూశాడు. అక్కడా ఓ యజ్ఞమే! లెక్కలేనన్ని యజ్ఞవాటికలే!... ఎవరు వారు? మళ్ళీ నిశితంగా చూశాడు!... ఆయన సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్ర మహర్షి!... ఆయనా ఒక నిరంతర యజ్ఞాన్ని తలపెట్టినట్లుగా ఉంది!... ఆయన చుట్టూరా ఎవరు?... మునులే!... నక్షత్రాల్లా కుశాసనాలపై పద్మాసనాలు వేసుక్కూచున్నారు! హోమద్రవ్యాల్ని గ్రుమ్మరిస్తూ, కృత్రిమ మేఘాల్ని సృష్టిస్తున్నారు! ఒక పాలపుంతలా ఉంది ఆతని ఆశ్రమం!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087