Others

పెరిగిపోతున్న ‘మగోన్మాదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటా బయటనే కాదు గగనతలంలో కూడా ఆడజాతిపై అకృత్యాలకు, వేధింపులకు కొదవ లేకుండా పోయిందని వార్తా మాధ్యమాలు, అంతర్జాల ప్రసారాలు గమనిస్తున్న సగటు సామాజిక జనం, సభ్య సమాజం, విజ్ఞుల సమాజంలో రోజురోజుకూ మానవత్వం మసకబారి మృగతత్వం, అంతకుమించిన మృగోన్మాద తత్వం పెచ్చుపెరిగిపోతుందేమిటా అని ఆశ్చర్యచకితులవుతున్నారు. మానవారణ్యంలో అదను, అవకాశము, పరస్పర పరిచయాలను వేదికగా చేసుకొని, గొప్ప ప్రేమలను వెలగబెట్టి అలవోకగా అమాయకులైన ఆడవారితో ఆడుకొని తుదకు కడతేర్చడమో, యాసిడ్ దాడులతో అంగవికలురను చేయడమో జరుగుతోంది.
దుష్ట సంకల్పం, మహిళ తిరస్కరిస్తే అమానుష దాడులు, యాసిడ్ వెదజల్లడం, కుహనా ప్రేమని ప్రకటించడం, ముఖం చాటేయడం, నయా మృగోన్మాదుల నయవంచన, విద్యాలయాలకు పట్టణాలకు వెళ్లి చదువుకొంటున్న అమ్మాయిలతో చనువు పెంచుకుని అదనుచూసి అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆటోడ్రైవర్లు, పాఠశాలలు అయిపోగానే మరే ఇతర వాహనాల సదుపాయం లేక పల్లెదారంట నడిచి వెళుతున్న అమ్మాయిని పలకరించి దారి తప్పించి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వీరందరికంటే మహా అమానుషమేమిటంటే, మురికివాడలలో అమ్మా నాన్నలు కూలికి వెళితే, అప్పటికే ఆ పిల్లలను నిత్యం పలకరిస్తూ, నయా ప్రేమతో అక్కున చేర్చుకొని తాయిలాలందిస్తున్న వయసుమీరిన వృద్ధ మృగోన్మాదులు పసిమొగ్గలను దారుణంగా హింసించడం వింతైన మదోన్మాదం.
సామాజిక అమానుష వికృత చర్యల్ని పరికిస్తే అమానవీయ చర్యల్ని కూలంకషంగా గమనిస్తే మానవత్వం సన్నబారి, చిద్రదశకు చేరి పతనవౌతున్న వైనం కళ్ళకు కడుతోంది. కామాతురాణం న భయం న లజ్జ.. అన్న వాక్యం నిత్యమై, నిఖిల జగతికి రుగ్మతగా మారుతుందేమోననిపిస్తోంది.
పట్టించుకోని విచ్చలవిడితనం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినతరమైన నిర్భయ, అభయ చట్టాల్ని అమలుచేస్తున్నా చట్టాలను సమాజంలో దుర్గతికి, నిందలపాలవుతున్న ఈ నర మృగోన్మాదులు చట్టాన్ని కానీ అందువల్ల వచ్చే సామాజికపు నిందల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా క్షణికానందాలే పరమావధిగా వ్యవహరిస్తుంటారు. ఏ మాత్రం విజ్ఞత, విచక్షణ లేకుండా కోరికలే పరమావధిగా అకృత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతుంటారు. ఉక్కు చట్రంలో చట్టంలోని శిక్షస్మృతి ఉన్నా, చట్టాన్ని భవిష్యత్ సంఘటనలు ఈ మృగోన్మాదులు పట్టించుకోవడం లేదు. తర్వాత చట్టపరంగా జరిగే పరిణామాలకు తామే కాకుండా ఆయా కుటుంబాలవారు పడే ఆవేదన అంతా ఇంతా కాదనే ఇంగితజ్ఞానం కొరవడింది.
కోరలు చాస్తున్న నేరాలు
మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులలో 98 శాతానికిపైగా పరిచయస్తులే. మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచురించడం, అసభ్య, అశ్లీల సంభాషణలు, అసహ్యకరమైన ఎస్‌ఎంఎస్‌లు పంపడం ఈ కేటుగాళ్లకు నిత్యకృత్యమైపోయింది. ఇక దేశవ్యాప్తంగా 2016లో 29,75,711 నేర సంఘటనలు జరగ్గా, అందులో 7.3 శాతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లు గణాంకాలు విశదం చేస్తున్నాయి. 2015తో పోల్చితే ఐపిసి నేరాలలో తెలంగాణ 2.55 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 3.54 శాతం తగ్గాయి. మరోవంక అమాయకత్వాన్ని, అవిద్య, దారిద్య్రాన్ని, ఉపాధి ఉద్యోగాల పేరుతో ఆడపిల్లలను అక్రమ రవాణాతో వ్యభిచార ఊబిలోకి దింపి డబ్బులు దండుకొంటున్న ముఠాలకు కొదువలేదు. ఇలాంటి కేసుల్లో ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి, పోలీసులకు పట్టుబడ్డా న్యాయస్థానాల్లో తగినంత సాక్ష్యాలతో నిరూపణ కాకపోవడంతో శిక్షనుండి తప్పించుకొని తిరిగి యధేచ్చగా కొనసాగించడం బాలికల, మహిళల దుస్థితికి అద్దంపడుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన నేరాల్లో 17శాతానికి పైబడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి, నేరాల విషయంలో 800 కేసులతో అత్యధికంగా మహారాష్ట్ర కేంద్రంగా కాగా, 224 కేసులతో తెలంగాణ, 209 కేసులతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అనాయాచితంగా సంపాదించి తమ రోజువారీ వినోదాలకు, విలాసాలకు మరిగి అదే వృత్తిగా ఎంచుకుని అమాయకుల్ని పీడనలకు గురిచేస్తున్న ఈ దోపిడీ వ్యవస్థ కేవలం దేశంలో ఏదో ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా సంచరిస్తూ నేరమయ జీవితాలకు అంకితమవుతున్నారు. పోలీసులకు, జాగిలాలకు, ఇతర సాంకేతిక సాధనలకు కూడా అంతుచిక్కకుండా నేరాలు చేయడంలో ఆరితేరినవారిని పట్టుకోవడంలో పోలీసు వ్యవస్థ సైతం తలలు పట్టుకొంటున్నాయి.
వ్యవస్థ కూడా గమనించాలి
పాఠశాలల్లో సైతం విద్యార్థులకు రుజువర్తన, సామాజిక బాధ్యత, చెడు సావాసాలకు అలవాటు కాకుండా ప్రాథమిక స్థాయి నుండి ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణాయుతంగా బోధనగరిపేందుకు తగు ప్రణాళికలను రచించి పాఠ్యాంశాలతోపాటు వ్యక్తిగతజీవితాన్ని వికసింపజేసే పాఠాలకు నాంది పలకాలి. నేర ప్రవృత్తి జీవిత పరమార్థం కాని సౌభాతృత్వ సమాజానికి నాంది పలకాలి.

- దాసరి కృష్ణారెడ్డి