Others

నిశ్శబ్ద హంతకి రక్తపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం
*
ప్రతి సంవత్సరం మే 17 రోజున ప్రజలలో అధిక రక్తపోటుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ సంస్థ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కృషిచేస్తోంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ‘రక్తపోటు గురించి తెలుసుకోండి’ అనే లక్ష్యంతో పిలుపునివ్వడం జరిగింది. మొట్టమొదటగా 14 మే 2005 రోజున వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ సంస్థ అధిక బ్లడ్‌ప్రెషర్‌పై ప్రజలను చైతన్యం కలిగించుటకు ఆవిర్భవించి మే 17, 2006 రోజున అంకితం చేయబడింది.
నలభై సంవత్సరాలు పైబడిన చాలామంది వ్యక్తులు అధిక రక్తపీడనంతో (బిపి) బాధపడే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఏ కారణంతోనైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా బిపి చూసిన తర్వాతనే వైద్యం ప్రారంభిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరు అధిక రక్తపోటువలన బాధపడుతున్నారని సర్వే రిపోర్టుల్లో తేలింది. అంతేకాకుండా, వైద్య నిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలలో ఇది ఇపుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. కానీ సమస్య, చర్చలతో పాటూ, కాలానికి అనుగుణంగా ఈ వ్యాధిపైన ఏదో జరుగుతుందనే అపోహలు కూడా పెరుగుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.
రక్తపోటు అనేది కొన్ని సంవత్సరాల కిందట చాలా అరుదుగా ఉండేదనే చెప్పవచ్చు. కానీ సాంకేతికంగా పరుగులు తీస్తున్న ప్రస్తుత కాలంలో ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈ వ్యాధికి గురయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతకాలంలో మనం గడిపే ఒత్తిడులతో కూడిన జీవన విధానంవల్ల చాలామంది అధిక రక్తపీడనముతో బాధపడుతున్నారు. దీనినే హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్‌ప్రెసర్ అంటారు.
ఒత్తిడితో అధిక రక్తపోటు
ఒత్తిడితో కూడిన భావోద్వేగ అసౌకర్యం కలిగినపుడు ఏర్పడిన పరిస్థితి మూలంగా హృదయ స్పందన రేటు పెరగడం అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. కారణాలు ఏవైనా మనం తీసుకొనే జాగ్రత్తలు, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడంవల్ల అధిక రక్తపోటును అదుపు చేసుకోవచ్చు అని గుర్తుంచుకోవాలి.
జీవనశైలి
క్రమంగా మందులను వాడటంవలన రక్తపోటును నియంత్రించగలం కానీ, జీవనశైలిలో మార్పులుకూడా తప్పనిసరి అని చెప్పవచ్చు. నిజానికి మందుల వాడకంకన్నా జీవనశైలిలో మార్పులవలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలలో ఎక్కువమంది పొట్టపెరగడం, అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనేవుంది. శరీర బరువు తగ్గుదలపైనే అధిక రక్తపోటు ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గించుకోవడంవలన అధిక రక్తపోటు నియంత్రణలో వుంటుంది. శరీర బరువు తగ్గాలంటే నడక బ్రహ్మాండంగా, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. నడకతోపాటు ధ్యానం, యోగాసనాలను పాటించడంవలన రక్తపీడనంతోపాటూ, మానసిక ఒత్తిడులు కూడా తగ్గుతాయి. మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవడం, అవసరమైన వ్యాయామాలను చేయడంవలన మందుల వాడకం తగ్గించటమే కాకుండా అన్ని రకాలుగా శారీరక మానసిక ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది.
జీవితాంతం మందుల వాడకం
సాధారణంగా చాలామంది జ్వరం, దగ్గు వంటి వ్యాధులకు మందుల వాడిన తరువాత, దగ్గు, జ్వరం తీవ్రతలు తగ్గితే, తరువాతనుండి మందుల వాడకం అవసరం లేదు. కానీ ఇలాంటి పరిస్థితి అధిక రక్తపోటుకు పూర్తిగా వ్యతిరేకం అనే చెప్పాలి. ఒక్కసారి అధిక రక్తపోటుకు గురైతే జీవితాంతం మందులను వాడాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మందుల వాడకంలో ఎలాంటి అశ్రద్ధ చేస్తే వ్యాధి తీవ్రతలు పెరిగి ప్రాణాంతక స్థాయికి చేరుతాయని మరువకండి. మందుల వాడకంతోపాటు జీవనశైలిలో మార్పులు (ఆహార అలవాట్లు మరియు వ్యాయామాలు) అనుసరించటంవలన అధిక రక్తపోటు నియంత్రణలో వుంటుంది. అంతేకాకుండా, క్రమంగా వ్యాధి తీవ్రతని చెక్ చేయించుకోవడం, క్రమంగా వైద్యుడి సూచనలను పాటించటం వంటివి మరువకండి.
నివారణ
ఆరోగ్యకరమైన అలవాట్లతో ఒత్తిడిని ఎదుర్కోవాలి. మాటే బంగారం అయిందన్న చందంగా తయారైంది ప్రస్తుత జీవన విధానం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడడం ఎక్కువగా చేయాలి. ఒత్తిడిని తగ్గించటానికి టైమ్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకరోజులో పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను ప్రాధాన్యత వారీగా జాబితాను తయారుచేసుకోవాలి. ఏ సమయంలో ఎంత సమయంలో పూర్తిచేయగలమో రాసుకోవాలి. శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలను నిర్థారించుకోవాలి. ఊహకందని లక్ష్యాలను నిర్దేశించుకోవడం తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి (మూడ్)ను పాజిటివ్ దిశలో ఆలోచన చేసే విధంగా స్థిరీకరించుకోవాలి. దైనందిన జీవితంలో నవ్వును మరచిపోకూడదు. నవ్వుకు మించిన మందు లేదు. నలుగురితో నవ్వును పంచుకోవాలి. తీరికలేని జీవితం అనుభవిస్తున్నప్పటికీ రోజు 15 నిమిషాలు నుండి 20 నిమిషాలవరకు ప్రశాంతంగా కూర్చుని బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి.
మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. మానవత్వ విలువలు పెంపొందించుకోవాలి. శారీరక వ్యాయామం, ఈత, నడక, ఆటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తీరిక సమయాలలో, సెలవు రోజుల్లో హాయిగా గడపడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పాటుచేసుకోవాలి. ప్రేరణ కలిగించే మాటలు / పాటలు వినండి.
‘అడుసు తొక్కనేల కాలు కడగనేల’- రక్తపోటు వచ్చిన తర్వాత జాగ్రత్తలు పాటించే కంటే రక్తపోటు రాకుండా కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321