Others

వ్యర్థాలతో క్విల్లింగ్ డాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషిలోను అంతర్లీనంగా ఏదో ఒక కళ దాగి వుంటుంది. ఆ కళను వెలికితీసి తను మేధాశక్తిని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని శారదామణి నిరూపించారు. నిత్య జీవితంలో ఎన్నో వ్యర్థ పదార్థాలను చూస్తుంటాము. వాటిల్ని చెత్తకుప్పల్లో పడేస్తాము. కానీ ఆ వ్యర్థ పదార్థాలతో కూడా ఎన్నో అద్భుత కళాకృతులు తయారుచేయవచ్చు. ఖాళీ వాటర్ బాటిల్స్, రాళ్లు, కొబ్బరిచిప్పలు, సీసా మూతలు, కొయ్యపొట్టు తదితర పనికిరాని వ్యర్థపదార్థాలతో సుమారు మూడువేలకుపైగా విభిన్న రకాల బొమ్మలు తయారుచేసి ఆరు అంతర్జాతీయ బహుమతులను పొందిన శారదామణి విశ్రాంత సమయాన్ని కళాకృతుల తయారీకి కేటాయిస్తున్నారు.
1979 జనవరి 10వ తేదీన ప్రకాశం జిల్లా పామూరు గ్రామంలో రమాదేవి, సుబ్బారావు దంపతులకు జన్మించిన శారదామణి బి.కాం (కంప్యూటర్స్) పూర్తిచేసి ప్రస్తుతం కొత్త కళాఖండాలను సృష్టించాలని నిత్య అనే్వషణలో వున్నారు. ఈమె భర్త విద్యావేత్త, పాబోలు వెంకట సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతోనే తాను అద్భుతాలను సాధించగలుగుతున్నానని చెప్పారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తోపాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించింది. మహిళా లోకానికి వనె్నతెచ్చే స్ర్తిమూర్తిగా అనేక సత్కారాలు పొందారు. ఎంతోమంది మహిళలకు, చిన్నారులకు ఈ కళను నేర్పిస్తూ ప్రాచుర్యం తెస్తోంది. ప్రస్తుత నవనాగరిక సమాజంలో యువతీ యువకులకు అందమైన జ్యుయలరీని కూడా తయారుచేస్తున్నారు. చెవి దిద్దులు, కమ్మలు, ముక్కుపుడకలు చాలా ఆకర్షణీయంగా వున్నాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం తనకు తెలియకుండానే వరించిందని ఆమె చెప్పారు. కృషి వుంటే మనుషులు ఋషులవుతారని ఒక మహాకవి తన పాటలో వ్రాసినట్లు శారదామణి కృషి అంతర్జాతీయ ఖ్యాతి చెందిందని నాట్యాచార్యులు, కళాదీప్తి నృత్య కళాశాల నిర్వాహకులు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. తాను చేస్తున్న కళాకృతుల గురించి వివరణ ఇస్తూ ఒక బొమ్మ పూర్తి ఆకారం పొందడానికి మూడు రోజులు పడుతుందని శారదామణి చెప్పారు. తాను చెయ్యాలనుకున్న బొమ్మ ఆకారాన్ని ఊహించుకున్న తరువాత తన దగ్గర వున్న వ్యర్థ పదార్థాన్ని బొమ్మ రూపంలో మరల్చడానికి చాలా ఏకాగ్రత వుండాలని, అందుకే పిల్లల్ని స్కూల్‌కు పంపిన తరువాత భర్త ఆఫీసుకు వెళ్లిన తరువాత విశ్రమించే సమయంలో తాను చెయ్యాలనుకున్న కళాకృతి గురించి ఆలోచించి దానిని ఏ విధంగా మరల్చాలో ప్లాన్ తయారుచేసుకుంటానని, ఆ తరువాత తన ఆలోచనలకు రూపం కల్పిస్తానని ఆమె చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలు దాటగానే పిల్లలు స్కూళ్లు నుండి రావడంతో గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తుంటానని ఆమె చెప్పారు. ఏ విషయంలోను రాజీపడకుండా తన కుటుంబ సభ్యులందరికి తన బాధ్యత నిర్వహిస్తూ కళాకృతుల తయారీలో తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ కళాకృతుల తయారీలో, క్విల్లింగ్ డాల్స్‌ను ఖండాంతరాలకు వ్యాపింపజేస్తూ ప్రపంచం గర్వించదగ్గ అద్భుత రికార్డ్ సృష్టించి తాను మహిళా లోకానికి గర్వకారణంగా నిలవాలనేదే జీవితాశయమని శారదామణి అన్నారు.

- కురువాడ మురళీధర్