Others

భక్తి మార్గంలో ధర్మమీమాంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీతలో నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు. ఫలితాన్ని గురించి ఆలోచించకు. కర్మచేసేవాడిని, చేయంచేవాడిని కూడా నేనే నని విశ్వసించు. నీవు ఏపని చేసినా అది ఈశ్వరార్పితముగా చేస్తే చాలు నీ యోగక్షేమాలను నేను చూస్తుంటాను. ఎక్కడ ధర్మహాని కలుగుతుందో అక్కడ నేను అవతరిస్తాను అని చెప్పాడు.
అందుకే మన పెద్దలు ఏది చేసిన భగవంతుని తలుచుకుని చేయమని చెప్తారు. పండితులైతే కేవలం సుకర్మలు చేయమని చెబుతారు. వారు చేస్తుంటారు. కానీ మంచికర్మలు అనేవి ధర్మానికి ఒదిగి ఉండాలి. ధర్మసూక్ష్మం చాలా జటిలంగా ఉంటుంది. సామాన్యులు తెలుసుకోవడానికి కష్టతరం అవుతుం ది. ఒక్కోసారి ఏది ధర్మమో తెలుసుకోవాలంటే ధర్మశాస్తజ్ఞ్రులకే సమస్యగా ఉంటుంది. అందుకే హిందూ ధర్మం భక్తి మార్గాన్ని బోధిస్తుంది. భక్తి మార్గం లో భగవంతుడు భక్తుడు ఉంటారు. భక్తుడికి అన్నీ భగవంతుని రూపాల్లాగే కనిపిస్తాయ. ఏది చేసినా అది భగవంతుడు ఆదేశించినందువల్లే చేస్తున్నాన్న భావనతో ఉంటాడు. సర్వమూ సర్వవ్యాపి అయన భగవంతుని ఆధీనంలోనే జరుగుతాయనే నిశ్చింత ఉంటుంది కనుక ఏది చేసినా మంచి యైనా చెడు యైనా భగవంతుడే చేయంచేవాడు కనుక అక్కడ ధర్మమీమాంస ఏర్పడదు. ఏది ధర్మమన్న సందేహం రానేరాదు. అందుకే మొట్టమొదట ఈశ్వరునిపై భక్తి ఏర్పరుచుకోవాలి. భక్తి అంటే ప్రేమనే. భగవంతునిపై ప్రేమ మొలకెత్తితే అన్నీ ధర్మానికి అనుగుణమైన పనులే చేస్తుంటాము.
ఒక్కోసారి భక్తులు చేసే పనులు ఇతరులకు పాపభూయష్టాలుగా కనిపించినా అది భగవంతుని దృష్టిలో ధర్మసూక్ష్మప్రకారం చూస్తే అది మంచి కర్మనే అయ ఉంటుంది. ఓసారి నారదునికి తానే గొప్ప భక్తుడినన్న అహం ఏర్పడింది. ఈభక్తి సామ్రాజ్యంలో భక్తుడు ఒకవేళ అంధుడు అవుతుంటే కూడా భగవంతుడే వానికి సరియైన దృష్టి ఇస్తుంటాడు. భక్తాగ్రేసరుడైన నారదునికే అహం ఏర్పడితే ఎలా అందుకే భగవంతుడు నారదునికోసం ఓపని చేశాడు.
కృష్ణుడు ఓరోజు తనకు భరింపరాని శిరోభారంగా ఉందని చెప్తాడు. రాజవైద్యులు ఎందరూ ప్రయత్నించానా ఆ తలనొప్పిని పోగొట్టలేకపోతారు. మంత్రవేత్తలు వచ్చి ఏ భక్తుని పాదధూళియైనా కృష్ణుని నుదిటిన రాస్తే తలనొప్పి మటు మాయం అవుతుంది అని చెప్తారు. ఈ సమాచారాన్ని భక్తాగ్రగణ్యుడైన నారదునికి చేరవేస్తారు. హుటా హుటిన పరుగులిడుతూ నారదుడు వచ్చి తనకు తెలిసిన వైద్యం మంతా కృష్ణునికి చేస్తాడు. కాని ఆయన శిరోభారం కాస్త కూడా తగ్గలేదు. అక్కడున్న వారు మంత్రవేత్తలు చెప్పిన విషయం చెప్తారు. నారదుడు ఆ మాటలు విని అయ్యెఅయ్యో అపచారం అపచారం అని లెంపలు వాయంచుకుంటాడు. కానీ ఆ వార్త విన్న గోపికలు పరుగెత్తుతూ వచ్చి తమ తమ పాదధూళినంతా తీసి కృష్ణుడిని నుదిటిన అద్దేస్తారు.
ఈపని మీకు పాపాన్ని ఇస్తుంది అని వారికి చెప్పినా ఫరవాలేదు. పాపాన్ని మేము మోయగలం కానీ మా అభిమాన ప్రియాతిప్రియమైన కృష్ణుడు బాధపడు తుంటే చూడలేం అంటారు. ఈ మాటల్లోనే శిరోభారం తగ్గిపోయందంటాడు కృష్ణుడు ఏమిటీ మాయ అంటే మానవుల్లో మంచితనం మానవత్వమే దైవత్వం అని నారదునికి చెప్తాడు కృష్ణుడు. అట్లాంటి మానవత్వం ఉంటే అదే భగవంతుడు కదా. భగవంతునికి చేసే పనులు అంటే మానవత్వంతో చేసే పనులు ఎప్పటికీ పుణకర్మలే సుకర్మలే అవుతాయ కదా. పాపచింతన ఉండాలి కాని మానవత్వంతో ఆలోచించే చేయాలనేది అసలు విషయం భగవం తుని భక్తులు అంటే భగవంతునికి మారురూపులే.
నిత్య, నైమిత్తిక కర్మలు, ఆగామి కర్మలు అంటూ ఎన్ని రకాల కర్మలున్నాయని అన్నా అవి అన్నీ భగవంతుని ప్రేమ ముందు నిష్ఫలమైనవే. కర్తకర్మక్రియ అన్నీ భగవంతుడే అయతే ఇక ఏ కర్మనూ అంటదు. అసలు అంటడానికి ఎవరు ఉన్నారు? ఉన్నదే భగవంతుడు. ఆయన నిర్గుణుడు, నిస్సంగుడు, నిర్వికారుడు అయనపుడు కర్మ ఏమున్నది కర్మఫలమేమున్నది కనుక అందరూ భక్తి సామ్రాజ్యంలోకి అడుగులు వేద్దాం. ధర్మమార్గంలో పయనిద్దాం.

- కూచిభట్ల వెంకటలక్ష్మి