Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మండపాలపై అల్లుకొని పూలతో నిండి సువాసనలను వెదజల్లుచున్న లతలతో,
మేను పులకరింపజేస్తున్న మలయమారుతం,
ఉద్యానవనము యొక్క శోభను ఇనుమడింప చేస్తున్నాయి.
తన సఖీజనమయిన లావణ్య, మధుమతి, మృదుభాషిణి, మనసిజ, సుకుమారి, స్రవంతి, శశిముఖి, సురాంగన, చంద్రవదన, చారుదేష్ణి, చంద్రముఖి, మితభాషిణి, జలజ, సునయన, కలకంఠి, సత్యవాణి, శారిక, వాణి మొదలగు వందమంది నఖీజనంతో. నూర్గురు దాసదాసీజనంతో కలిసి వచ్చి రాజకుమారి, కన్యకామణి అయిన ఆ దమయంతి రాజప్రాసాదంలోని ఉద్యానవనంలో స్వేచ్ఛగా చాలా సమయంవరకు విహరించింది. అలసిపోయి ఒక శిలావేదికపై చెలికత్తెలతో కూర్చొని సరస సల్లాపాలాడుచుండగా
వినీలాకాశంలో మెడలో మణిహారాన్ని పోలి విహరిస్తున్న అంచపిండుతో కలిసి నిషధ దేశం నుండి రాయబారం నెరపగల తెలివిగల్గిన రాజహంస వచ్చింది. చెలికత్తెలతో ఉన్న దమయంతి చెంతన రెక్కల శబ్దం చేయగా చెవివద్ద భేరీవాయించినట్లయింది. కలవరపడిన దమయంతి ఆ బంగారు హంసను చూచింది. తమ ఎదుట ఉద్యానవనంలో వాలియున్న హంసలగుంపును కూడా చూచింది. వెంటనే
‘‘మధూ! చూడుము చూడుము! ఆ హంసల గుంపును చూడుము! తెల్లగా, అందంగా ఉన్నఅవి ఎగురుతూ వచ్చి మన వనంలో దిగాయి. నా చెంతకు వచ్చిన బంగారు హంసను నేను పట్టుకొనబోగా తప్పించుకున్నది’’ అని అనగా
‘‘అవును రాజకుమారీ! మనమందరం కలిసి ఒక్కొక్కరం ఒక్క రాజహంసను పట్టుకొందాము.’’ అని లావణ్య అనగా.
చెలికత్తెలందరూ ఒకరినొకరు మీరి పరుగెత్తి ఒక్కొక్కరు ఒక్క రాజహంసను పట్టుకొన్నారు.
అందులో ముందు నలుని చేత విడువబడిన ఆ కలహంస మరలా వయ్యారంగా నడయాడుచూ దమయంతి చెంతకువచ్చి చిక్కినట్లే చిక్కి తప్పించుకొన్నది. దమయంతి కూడా విడువకుండా వెంబడించగా అది మెల్లగా నడుస్తూ కావాలనే దమయంతి చేతికి చిక్కింది.
దమయంతి సంతోషంతో ఆ హంసను పట్టుకొని ఆనందించింది.
***
దమయంతికి నలుడికి సంయోగం సమకూర్చటానికై విధిచే నిర్ణయించబడిన దూత అయిన ఆ కలహంస మనోహరమైన మనుజ భాషలో దమయంతికి సంతోషం అతిశయించేటట్లు పలికింది.
‘‘దమయంతీ! నీకు నేను ఒక సందేశాన్ని తెచ్చాను’’అని మనుజ భాషలో పలుకుచున్న ఆ హంసను చూచి ఆశ్చర్యపడింది.
‘‘నీవెవ్వరవు? ఎక్కడినుండి ఇక్కడకు ఏతెంచితివి? ఏ లోకంనుండి ఇందు ప్రవేశించితివి? మనుజ భాషలో పలుకుచున్న నీ వెవ్వరవు? దేవతలలో ఏ తెగకు చెందినదానవు?’’అని దమయంతి అనగా ఆ కలహంస.
‘‘కలువ వంటి నేత్రాలుగల దమయంతీ! బ్రహ్మతబేలాలోని గుఱ్ఱాలు (హంసలు) మాకు వంశకర్తలు. పువ్వువంటి మేనుగలయో దమయంతీ! ఆకాశగంగ పసిడి తామరల నాళములు మాకు మేనులు ఓ కమలముఖీ! బ్రహ్మ నివాసమైన సత్యలోకము, చతుర్థశ భువనాలు మా విహారస్థానాలు. సాటిలేని మేనుగలదానా! తియ్యని అక్షరములుగలవి అమృతాహారులైన దేవతల మాటలు అమృతం వంటివి. వాగీశ్వర (సరస్వతీదేవి) వాహనములు కావున వాక్పటిమగలవి. మదపుటేనుగు వంటి నడకగల నడకగలదానా! సరస్వతీదేవి సహధ్యాయి మాకు. ఓ జవరాలా! వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల రాజమార్గము మాకు. నేను అబద్దం ఆడను. ఏ త్రాళ్ళకు లొంగను. సుగుణాలనే త్రాళ్ళకు లొంగుతాను భూలోకంలో నృపముఖ్యులలో కొందరితో స్నేహం ఉంది.

- ఇంకాఉంది