Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వాంతర్యామి చ సర్వత్రను వ్యాపించెను
ఆదియు, మధ్యము, నంతము అంతయు తానాయెను.

అతనినంటి ఆదిత్యుడు మిణుగురు పురుగును బోలెను
ఆతని నంటిన చుక్కలు చెమట చుక్కలను బోలెను.

పెరుగసాగె పెరుగసాగె వటుడు పెరుగసాగెను
ఆకాశమె అతని పాదమంజీరమ్మై మ్రోగెను.

ఎదుగసాగె ఎదుగసాగె ఎదుగుటయే ఎరుగనంగ
చుక్కలతని చరణమ్ముల నఖములట్లు మెరియంగ.

పాదమ్ములె కనిపించును కనిపింపవు నీ గాళ్ళు
నడుమేదో? వక్షమేదొ? తలయేదో తెలియదు.

కళ్ళు ప్రయాణించు మేర పదములొకటె కనిపించెను
ఆ పైనను ఏముండెనొ ఎవడెరుగును? ఎవడెరుగును?

పదమే బ్రహ్మమ్మనంగ బ్రహ్మమె పాదమ్మనంగ
బ్రహ్మాండమ్మెల్ల నొక్క పదమందే యిమిడెననగ.

అది యెంతటి చిత్రమ్మో? అది యెంతటి లీలయొ?
ఆతండగుపించబోడు- మాట యొకటె వినిపించును.

పద్మమ్మున కేసరమన పద్మబాంధువుడు నొప్పెను
పద్మమ్మున నీటి చుక్కలనను మించి చుక్కలును.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087