Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాంటి నృపులలో నిషధ దేశాధిపతి నలమహారాజు (నలుడు) ఒకడు.
ఓ చంద్రముఖీ! బ్రహ్మకైనా నలుని భుజశౌర్యాన్ని పొగడటం సాధ్యమా? శత్రు రాజసమూహ సంబంధంగల ప్రాణవాయువు అతడి అమ్ముల వాదరలనెడి పాముకు ఆహారము. వాయువును పాములు మాపినట్లు ఇతని బాణాలు వైరుల ప్రాణమును మాపును. ‘‘రంభ’’అనే అప్సరస నలమహారాజు గుణాలను విని ఆయనపై మరులుగొన్నది. కానీ కోరిక తీర్చుకొనుటకు భూలోకానికి రావడానికి గట్టి కారణం ఏమీ దొరకలేదు. అంతరంభ నలుని మీద కోరికతో నలునిగాక పోయినా శోభమైన పేరుతో సంబంధం కలవాడు ‘నలకూబరుడు’అనే దేవకుమారుని వరించి నలుని మీద తన కోరికను కొంచెము తీర్చుకుంది.
దమయంతీ! ఆ నలమహారాజువద్ద నాకు చాలా చనువు వుంది. మన్మథుడు, వాత్సాయనముని, కూచిమారుడు అనువారు రచించిన శాస్త్రగ్రంథాల మర్మాలను నేర్చినవాడు భార్యాభర్తలకు సరసత్వాలను కలిగిస్తాడు. ఆ రాజు రాణీవాసపు కాంతల సమూహానికి మెల్లమెల్లని నడకలు నేర్పిస్తాడు.
రాణీవాసపు స్ర్తిలకు నాయందు మిక్కిలి నమ్మకము. వారు తమతమ రహస్యాలను నాతో చెప్పుకుంటారు. నన్ను సామాన్యమైన పక్షిగా తలచి, బ్రహ్మముఖ తామరసం నుండి వెలువడిన నానాశాస్త్రాల సంస్కారంతో నిండిన చెవులుగల వాడను. బ్రహ్మదేవుని సృష్టి, శ్రమ పార్వతీపరమేశ్వరుల యెడలను, లక్ష్మీనారాయణుల యెడల సఫల మయినట్లుగానే మీ ఇద్దరి కూటమి చక్కగా ఉంటుంది. బ్రహ్మదేవుడు మీ ఇద్దరు దంపతులు కాగలరని మీకు నుదుట వ్రాశాడు. నిషధనాథుని భార్యగా ఈ భామ దమయంతికి ఒక్కతికే అర్హత ఉంది’’ అని అన్నది.
ఇది శ్రీనాథ మహాకవి విరచిత శృంగార నైషధ గ్రంథములోని హంస దౌత్యము
ఓ దమయంతీ! నేను ఇప్పుడు నీ హృదయేశ్వరుడైన నలమహారాజు వద్దనుండి వచ్చాను. ఒడ్డులేని (దరి) సముద్రంవరకు అంతం లేకుండా విస్తరించిన ఈ అపార భూమండలంలో రాజులెవ్వరూ సౌందర్య సౌశీల్యాలలో నలునికి సాటిరారు.
ఓ దమయంతీ! నీవు నలుడికి దేవేరివి అయితే తప్ప నీకుగల గొప్ప లక్షణాలు, సౌందర్యం లావణ్య సంపద, ఐశ్వర్యం, నిత్య సౌభాగ్యం, అదృష్టం, వంశగౌరవం మున్నగునవి రాణించవు.’’
దమయంతీ! నీవు వధువులలో రత్నానివి. ఆ నలుగురు వరులలో శ్రేష్ఠుడు. మీ విశిష్ఠ గుణ సంపన్నుల ఇరువురి కలయిక మహోన్నత గుణ భూయిష్టమవుతుంది’’ అని చెప్పగా
మిక్కుటమైన ఆనందాన్ని పొందిన దమయంతి ‘‘గొప్ప వాక్పటిమగల ఓ రాజహంస! నినే్నమని పొగడగలను? ఓ మాటకారి! ఆ నలమహారాజు గుణగణాలను నాకెట్లా చెప్పావో అట్లాగే నన్ను గురించి కూడా నిండైన దయాభావంతో ఆ రాజుకు తెలియజెప్పుము.’’అని అన్నది.
దమయంతి కోరినట్లుగానే ఆ హంస తిరిగి నిషధ దేశానికి వెళ్ళింది. నలమహారాజును కలిసి దమయంతి గుణరూప వైభవాల గురించి తెలియచెప్పింది.
ఒకరికొకరు సుదూర దూరంలో ఉండిగూడా నలదమయంతులు మన్మథతాపం చేత బాధింపబడ్డారు. విరహతాపం అతిశయిల్లగా నందనవనాల వంటి క్రొత్త తోటలలో, తామర పూల రేకులలో, మెత్తని తామర తూండ్లలో, కర్పూర పరాగంతో, మంచిగంధపు మైపూతలతో, పన్నీటి జల్లుల యందు, చిగురుటాకుల శయ్యలపై పెక్కు రేయింబవళ్ళు గడిపారు.
హంస చెప్పిన మాటలను విన్ననాటినుండి దమయంతి నలుని గురించే చింతిస్తూ అస్వస్థత పాలైంది. ఆ రాజహంస వెళ్ళిన దిక్కునే సదా చూస్తూ ఉంటుంది. హంస చెప్పిన మాటలనే వల్లెవేస్తూ ఉంటుంది. చెలికత్తెలతో మాట్లాడటం మానివేసింది.

- ఇంకాఉంది