Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుచేత నీ దౌత్యాన్ని మేము కోరుచున్నది. ఇది దేవతల మేలుకొరకైన కార్యం. నీవు దీనిని తప్పక నెరవేర్చితీరాలి!’’ అని దేవతలు పలుకగా
‘‘ఆయుధాలు ధరించిన భటులు బాగా కాపాడుచున్న రాజుగారి అంతఃపురం ఎలా ప్రవేశించటానికి వీలవుతుంది.’’అని నలుడు ప్రశ్నించాడు.
‘‘అంతఃపురంలో ప్రవేశించటానికి ఎలా వీలవుతుందని నీవు శంకించవద్దు. దమయంతీ మందిరంలో నీవు ప్రవేశించేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డుబెట్టజాలరు’అని ఇంద్రుడు నలునికి అభయమిచ్చాడు.
దేవేంద్రుడు అలా చెప్పగా అతడి మాట ప్రకారం నలమహారాజు అప్పుడే బయలుదేరి విదర్భ రాజధాని అయిన కుండిన నగరానికి పయనమయ్యాడు. వెంటనే దమయంతి మందిరంలోనికి తానొక్కడే ప్రవేశించాడు. అక్కడ దమయంతిని తొలిసారి చూచాడు. అలనాడు కలహంస తనతో చెప్పిన దానికంటే ఆమె సౌందర్య సంపద అధికంగా తోచింది.
దేవకన్యలతో సౌందర్యంలో తులతూగే నూరుమంది చెలికత్తెలు ఆమెను కొలుస్తూ ఉన్నారు. హృదయేశ్వరుడైన నలుని గురించి సదావింటున్నందున దమయంతి అలసిపోక ఊరట చెందుచున్నది. అట్టి దమయంతిని చూచిన నలుడు మన్మధబాణ పీడితుడయ్యాడు.
నలమహారాజును చూచినంతనే ఆ లలితాంగులందరూ అదిరిపడి పీఠాలు దిగి నిలబడ్డారు గానీ నలునితో సంభాషించలేకపోయారు. కానీ మనస్సులలో మాత్రం గౌరవించారు.
అతడి సౌందర్యాన్ని చూచిన చెలికత్తెలు ‘ఏమీ ఈతని తేజస్సు! ఏమీ ఈతని ధైర్యం! ఈ అపూర్వ మనుజుడెవరు? ఎచటినుండి ఇచటికి వచ్చాడు? దేవతా పురుషుడా? యక్షుడో లేక గంధర్వుడో అయి ఉంటాడు’’ అని ఆశ్చర్య చకితులై, సంతోషంతో మనసులు బెదరగా సిగ్గుపడి ఏమీ మాట్లాడలేకపోయారు. అలా లేచి నిలబడిన చెలికత్తెలందిరనీ చూచింది దమయంతి. తానుగూడా ఎదురుగా మన్మథుడితో సమానుడు, దేవేంద్ర సదృశుడు, సూర్యతేజస్వి, చంద్ర సముడు, వరుణనిభుడు, కుబేరాభుడు నిషధరాజు అయిన నలమహారాజును కనులారా గాంచింది. దమయంతి కూడా మన్మథుడిచేత ప్రేరేపింపబడింది. సిగ్గును ఆవలికి త్రోసి, జంకుగొంకు లేకుండా దివ్యసుందర విగ్రహుడు, రాజకుమారుడు అయిన నలునితో మెల్లని, మెత్తని మాటలతో...
‘‘ఓ స్వామీ! నీవు మహానుభావుడిలా కనిపిస్తున్నావు! ఓ సుందరాంగా! నాలోని కోరికలను వృద్ధిపొందిస్తున్న నీవు ఎవరవు? ఎచటినుండి ఇచటికి వచ్చావు? ఏ కారణంగా వచ్చావు? అమరుని వలె ఈ అంతఃపురం చేరావు! ఎవరికీ కనిపించకుండా ఎలా ఉన్నావు? ఇది చండశాసనుడైన మా తండ్రిగారి చేత సురక్షితంగా ఉన్నది. అనేక రాజభటుల చేత రక్షింపబడే ఈ అంతఃపురంలోనికి నీవు ఎలా ప్రవేశింపగలిగావు? ఇలా ఎవ్వరూ ఇచటికి రాలేరు! నాకు మన్మథతాపాన్ని హెచ్చిస్తున్న నీ తీరుతెన్నులు వివరంగా తెల్పుము!’’ అని దమయంతి అనగా నలుడు.
‘‘ఓ లలనామణీ! నా పేరు ‘నలుడు’అని అంటారు. నేను నిషధ దేశాధిపతిని. దేవతల దూతగా నీవద్దకు వచ్చాను. స్వర్గ్ధాపతి అయిన దేవేంద్రుడు, లోక పాలురైన అగ్ని, యముడు, వరుణుడు నిన్ను పొందటానికి ఉబలాటపడుచున్నారు. నీ స్వయంవరాన్ని చూడటానికై వచ్చి ముందుగా నన్ను నీవద్దకు పంపారు. ఇంద్రాగ్నియమవరుణులు తమలో ఒకరిని భర్తగా ఎన్నుకొనమని నిన్ను కోరుచూ నన్ను దూతగా నీ కడకు పంపారు.
కళ్యాణీ! దేవతల దయవలన ఇతరుల కంటపడకుండా నేను ఈ అంతఃపురంలోనికి ప్రవేశింపగలిగాను. నన్ను ఎవరూ అడ్డుబెట్టలేదు.
కావున నీవు ఆ దేవతలకు ప్రియము చేయవలసినది. నీ బుద్ధికి తోచినట్లు చేయుము’’ అని దమయంతికి వివరించి చెప్పాడు.
- ఇంకాఉంది