Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమి కాంతి? ఏమి కాంతి? ఏమి కాంతియో అయ్యది?
ఏమి రాగమేమి రాగ? మేమి రాగమో అయ్యది?

తొడవులు మెరసిన యట్టుల ఒడలెల్లను మెరిసెను
తానే హరిపదములందు తొడవై భాసిల్లెను.

ఒక విద్యుత్ప్రవాహమ్ము- అణువణువున ప్రాకెను
ప్రత్యణువును పులకించుచు- వరదలెత్తి పోయెను.

కరముల పాదముల కడుగుకానీ రుూ లోకము
తలతో పాదమును కడుగు భాగ్యము బలికబ్బెను.

అది ఏమిటి? విచిత్రమ్ము? తానెటకో పయనం?
తన గుండెను తానె దిగెనొ? భూమి గుండె లోననో?

ఒక భ్రమరం కమలగర్భమందు జేరుకొనినట్టుల
భూగర్భంలోకి తాను జారుకొంచు చేరినటుల.

ఆకాశమ్మంటు తలయె- పాతాళమ్మంట జేరె!
తలతో తలపులు జేరెను! తలతో తను జేరె!

బలితలపై ధరణియుండె తలపై మకుటమ్మట్టుల
మకుటమ్మున వటుని పాదమొప్పె నొక్క మణియట్టుల.

ఒక చంద్రుడు గగనమ్మున రేరాజై వెలిగినట్లు
వెలిగినాడు బలియున్నంత
ఎదురులేని ఒక నియంత

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087