Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు ఇంద్రాది దేవతలు కలిసియే నా స్వయంవర ప్రదేశానికి విచ్చేయండి.
‘‘ఓ మనుజేశ్వరా! ఆ స్వయంవరములోనే, ఇంద్రాదిదేవతల సమక్షంలోనే పురుషశ్రేష్ఠుడవైన నిన్నునేను వరిస్తాను. అలాంటప్పుడు ఏ దోషము ఉండదుగదా? కాబట్టి నీవు ఏమాత్రము సంకోచించకుండా తిరిగి వెళ్ళగలవు అని నా ప్రార్థన’’అని పలికింది దమయంతి.
దమయంతి మాటలను విన్న నలమహారాజు వెంటనే ఇంద్రిదాదేవతల వద్దకు తిరిగి వచ్చాడు. మరలివచ్చిన నలమహారాజును చూచిన లోకపాలురు దమయంతి సమక్షంలో జరిగిన వృత్తాంతాన్ని అంతా వివరంగా తెలుపవలసినదని కోరారు.
‘‘నలమహారాజా! యశస్విని, అతిలోక సౌందర్యవతి, శుచిస్మిత అయిన ఆ దమయంతిని చూచావా? ఆమెకు మేము చెప్పిన సందేశాన్ని వినిపించావా! దమయంతి సంతోషంతో విన్నదా? మా సందేశానికి దమయంతి ఎలా స్పందించింది. ఏమని సమాధానము చెప్పింది?
పుణ్యాత్మా! అన్ని విషయాలను వివరంగా వినిపింపుము’’అని అన్నారు. అప్పుడు నలుడు
‘‘దేవేంద్రా! లోకపాలకులారా! మీ ఆదేశం ప్రకారం నేను దమయంతి వద్దకు వెళ్ళాను భటులచే కాపలాకాయబడుచున్న ఆ దమయంతి అంతఃపుర మందిరాన్ని ఎట్టి అడ్డంకులులేకుండా ప్రవేశించగలిగాను. మీ ప్రభావంవలన దమయంతి అంతఃపురంలోనికి ప్రవేశించే నేను మనుషుల కెవ్వరికినీ కనిపించలేదు. దమయంతికి మాత్రమే కనిపించాను. అంతఃపురంలోనికి ప్రవేశించిన తరువాత మాత్రమే దమయంతి చెలికత్తెలు కనిపించారు. దమయంతితోపాటు వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అంత దమయంతి చెలికత్తెలు కొంచెం ప్రక్కకి దూరంగా తొలిగిపోయారు.
‘‘సురశ్రేష్ఠులారా! నేను మీ గురించి సవిస్తారంగా దమయంతికి వర్ణించి చెప్పాను. అయినప్పటికీ దమయంతి మాత్రము ననే్న వరిస్తున్నది. ఆ దమయంతి నాతో...
‘‘పురుష శ్రేష్ఠుడవైన నీవూ, దేవతలూ కలిసియే స్వయంవరం జరిగేచోటికి రండి’’ అని చెప్పి మళ్ళీ.
ఆ దేవతల సన్నిధిలోనే ‘‘నిన్ను నేను వరిస్తాను’’అని కూడా అన్నది. పైగా ఈ విధంగా వరిస్తే ‘‘నీపై దోషం ఏమాత్రము ఉండదు’’అని కూడా పల్కింది.
‘‘దేవతలారా! దమయంతి చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు విన్నవించాను. ఇకముందు జరుగబోయే దానికి త్రిదసులైన మీరే ప్రమాణము’’ అని విన్నవించాడు.
తదపరి ఒక శుభముహూర్తంలో తిథినక్షత్ర బలంగల లగ్నంలో దమయంతి స్వయంవరం నిశ్చయింపబడటం జరిగింది.
***
భూమండలలో ఉన్నగొప్ప పట్టణాలలో ఉత్కృష్టమైనది కుండిన నగరం.
ఆ నగరంలో సువిశాలమైన ప్రధాన నగర వీధులతో అందమైన నగరంగా, శోభిల్లుచున్నది.
వీధులకిరుప్రక్కలా నింగినంటే పెద్దపెద్ద హర్మ్యాలతో ప్రకాశిస్తున్నది.
వీధులకు అటునిటు పాదచారులు తిరగటానికి మార్గములు ఏర్పాటుచేయబడ్డాయి.
రహదారులన్నీ పరిశుభ్రముగా చేయబడి, దుమ్ముధూళి పైకెగరకుండా నీటితో తడపబడ్డాయి.పెద్దపెద్ద రంగవల్లులు వీధులకు ఇరుప్రక్కల చిత్రీకరింపబడ్డాయి.పూలతో అలంకరింపబడిన తోరణాలు ఏర్పాటుచేయబడ్డాయి. నగరమంతా వసంత శోభను సంతరించుకొన్నది. కుండిన నగరము స్వయంవర శోభతో శోభాయమానంగా విరాజిల్లుచున్నది.
స్వయంవరానికి వచ్చిన రాజులకు వారి వారి అర్హతకు తగినట్టుగా విడిచి ఏర్పాట్లు ఘనంగా చేయబడ్డాయి. స్వయంవరం జరుగవలసిన శుభ తిథినాడు విదర్భ దేశాధీశుడైన భీమమహారాజు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ స్వయంవర ప్రదేశానికి ఆహ్వానించాడు.
- ఇంకాఉంది