Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదియె విష్ణుపదము నాకు! ఇదియె బ్రహ్మపదమును!
నేనే బ్రహ్మమ్మునౌచు- వెలుగుదునే నిచటను!’’

అనుచు రాజు సంతసించె
పాతాళము నేలుకొనుచు.

సిద్ధాశ్రమం
వచనం: ‘‘ఆ విధంగా బలిచక్రవర్తి మాట తప్పకుండా, భూమ్యాకాశాల్ని దానం చేసి, తననుతాను సమర్పించుకొని, చిరకాలం చంద్రునిలా పాతాళాన్ని ఏలుకొని, షట్చక్రవర్తుల్లో ఒకడై, ఆశేష కీర్తిసంపన్నుడైనాడు. విష్ణువు ఆ విధంగా ఆతని నుండి దానంగా గ్రహించిన త్రిలోకాలను దేవతలకు తిరిగి అప్పగించాడు.
ఈ ఆశ్రమం అప్పటినుండి ‘సిద్ధాశ్రమం’అని పిలువబడుతోంది. ప్రస్తుతం ఇది నా ఆశ్రమం. మీరు రక్షకులుగా ఇక్కడే నేను యజ్ఞం చేయబోతున్నాను’’ అన్నాడు కౌశికుడు.
ఆ ఆశ్రమంలోకి వారు ప్రవేశించారు. ఆ వాతావరణం రామలక్ష్మణులను ముగ్ధులను గావించింది. అక్కడి చెట్లన్నీ విరగబూసి, విరగగాసి ఉన్నాయి. ఫలాల బరువుతో కొమ్మలు నేలనానుతున్నాయి.
వారు కాలుమోపగానే వారి పాదాలను పచ్చపచ్చని పచ్చల పచ్చిక ముద్దెట్టుకుంది. తుషార బిందువులు కాళ్ళు కడిగాయి! ‘కువకువ’లాడే పావురాలు వారి భుజాలపై వ్రాలాయి. చిలకలూ, కోయిలలూ, గోరువంకలూ ‘స్వాగత వచనాలు’ పలికాయి.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087