Others

అనంతావై వేదాః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిథిమ్’
వేదమంటే జ్ఞానం. జ్ఞానానికి ఆద్యంతములు లేవు. జ్ఞానార్జనే మానవునికి ప్రధానమైనది. మానవ శరీరంనుండి శ్వాస బయటికి వచ్చి మరలా శరీరంలో ప్రవేశించినట్లే పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసలనుండి వేదం ఉద్భవించింది. అందుచే వేదాన్ని అపౌరుషేం అన్నారు. వేదం అనంతమైనది. అందుకే దీనిని ‘అనంతావై వేదాః’ అన్నారు. హిందువులు దీనిని అత్యంత ప్రామాణికంగా గుర్తిస్తారు. వేదాన్ని అధ్యయనం చేయడానికి భరద్వాజుడు బ్రహ్మద్వారా మూడుసార్లు ఆయుర్దాయం పొందాడు. అపుడు బ్రహ్మ మూడు పర్వతాలనుండి మూడు గుప్పిళ్ళు తీసి ఇంతవరకు వేదంలో నీవు నేర్చుకున్నది ఈ మూడు గుప్పిళ్ళు మాత్రమే, ఇంకా మూడు పర్వతాల వేదం ఉంది అన్నారు. అందుకే నీవు నేర్చుకున్నది అందరికీ పంచమన్నాడు. సనాతనమైన, మార్పులేనిది ఇటువంటి అనంతమైన వేదాన్ని వ్యాసులవారు నాలుగు విధాలుగా విభజించారు. అవి 1.ఋగ్వేదం 2.యజుర్వేదం 3.సామవేదం 4.అధర్వణ వేదం. వ్యాస మహర్షి ఈ నాలుగు వేదాలను తన నలుగురు శిష్యులకు ఉపదేశించారు. ఇందు ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయనునికి, సామవేదాన్ని జైమినికి, అధర్వణవేదాన్ని సుమంతునికి ఉపదేశించాడు. ప్రస్తుతం యజుర్వేదం రెండు భాగాలుగా ఉంది. అవి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. ఇంకనూ ఋగ్వేందలో 21 శాఖలు, యజుర్వేదంలో 101 శాఖలు, సామవేదంలో 1065 శాఖలు, అధర్వణ వేదంలో 50 శాఖలు ఉన్నాయి. వేదానికి ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు సమకూర్చారు. మంత్రం యొక్క అర్థంలో స్వరంలో ఇమిడి యుంటుంది. అందుచే స్వర ఉచ్ఛారణ చాలా ముఖ్యం. అందుచే గురుముఖత నేర్చుకొనే విద్య వేదం.
వేదపఠనం, శ్రవణము జన్మాంతర పాప కర్మలనుండి విముక్తి ప్రసాదిస్తుంది. వేదం మానవ కల్యాణము కొరకు ఉద్దేశించబడినది. పురుషసూక్తంలో ‘శన్నో అస్తు ద్విపదే, శం చతుష్పదే’ అని ఉంటుంది. అంటే రెండు కాళ్ళతో వుండే మానవులు అలాగే నాలుగు కాళ్ళతో సంచరించే పశువులు సుఖంగా ఉండాలని చెబుతోంది. ఇంతకంటే వేదం గొప్పతనం ఏమని చెప్పాలి.
అలాగే రామాయణాన్ని ఇలా అంటారు- వేద ప్రతిపాద్యుడుగు పరమపురుషుడు దశరథ పుత్రుడై శ్రీరాముడిగా ఆవిర్భవించగా వేదం ప్రాచీసుడగు వాల్మీకి వలన రామాయణంగా ఆవిర్భవించింది. భారతాన్ని పంచమవేదం అంటారు. ధర్మార్థ కామమోక్షాలనే చుతుర్విధ పురుషార్థాలలో మానవుడికేది కావలసినా ఎంత కావలసినా అదంతా ఇందులోనే దొరుకుతుంది. ఇందులో లేనిది మరెక్కడా ఉండదు. వేదం అపౌరుషేయమైతే ఇది పౌరుషేయం. అర్థకామాలు ఇహమైతే ధర్మమోక్షాలు పరమైనవి. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రద్రష్ట రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలు నేర్పాడు. అట్లే భాగవతం నిగమ కల్పతరోర్గళితం ఫలం- వేదమనే కల్పవృక్షము నుండి బాగా పండి రాలిన మహాఫలమే భాగవతం అన్నారు. వేదాలు జ్ఞానభాండాగారాలు, విశ్వజనీనమైన ప్రేమ సందేశాలు, జాతి, మత, వర్ణ, వర్గ, లింగ భేదాల కతీతంగా మానవులందరికి శ్రేయస్సు ప్రసాదించేది వేదం. ఋగ్వేదంలో దేవతలను ఆహ్వానించే మంత్రాలు వుంటే యజుర్వేదంలో యజ్ఞ విభాగానికి సంబంధించిన మంత్రాలు, సామవేదంలో సంగీతంతో కూడి దేవతలు ఆనందించే మంత్రాలు ఉంటాయి. అధర్వణవేదంలో బ్రహ్మజ్ఞానానికి అనేక లౌకిక విషయాలకు సంబంధించిన మంత్ర, తంత్ర, యంత్ర విషయాలు ఉంటాయి. మన ఉత్తర భారతదేశంలో చతుర్వేది, ద్వివేది అనే పేర్లు ఉంటాయి. వారి పేరుకి తగినట్లుగా వేద పరిజ్ఞానం ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం వేద పండితులకు నిలయం. అందు బ్రహ్మశ్రీ తంగిరాల బాల గంగాధర శర్మ ఘనాపాటి గారు త్రివేది అనగా మూడు వేదములను అధ్యయనం చేసినవారు. బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి ఆంజనేయ ఘనాపాఠిగారు ద్వివేది. అనగా రెండు వేదములలో పాండిత్యముగలవారు.
సర్వ ప్రపంచానికి భారతదేశం పంచిపెట్టిన మహాసంపద వేదవాఙ్మయం. దీన్ని హిందూ ధర్మ విశ్వాసులు తప్పక ఆచరించాలి. వైదిక వాఙ్మయాన్ని వేద సాహిత్యాన్ని నాలుగు సంహిత భాగాలుగా విభజించారు. 1.సంహితలు 2.బ్రాహ్మణాలు 3.ఆరణ్యకాలు 4.ఉపనిషత్తులు. వేదమునకు ఆరు వేదాంగాలు కలవు. 1.శిక్షా 2.వ్యాకరణము 3.కల్పము 4.నిరుక్తము 5.్ఛందస్సు 6.జ్యోతిషము. ఉపవేదాలు 4 ఉన్నాయి. 1.ఆయుర్వేదము 2.్ధనుర్వేదము 3.గాంధర్వవేదము 4.అర్థవేదము. ఉపాంగాలు ఆరు ఉన్నాయి. 1.పూర్వ మీమాసంస 2.వైశేషికము 3.న్యాయశాస్తమ్రు 4.యోగశాస్తమ్రు 5.సాంఖ్య శాస్తమ్రు 6.వేదాంతశాస్తమ్రు.
ఈవిధంగా వేదశాస్తమ్రు అనంతమైనది. అందుచే దీనిని ‘అనంతావై వేదాః’ అన్నారు.

-యామిజాల సుశర్మ 9848355806