Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళు ఆ చెట్ల నీడలో నడుస్తోంటే, చల్లచల్లని గాలి వీచింది. పూలు కురిశాయి. పచ్చిక మేస్తోన్న జింక పిల్లలు పరుగుపరుగున వారి వద్దకేతెంచాయి. నెమళ్ళు పురులు విప్పి ఆనంద తాండవం చేశాయి.
మునికన్యలు వారికెదురు వచ్చి, వాళ్ళ కాళ్ళు కడిగి, మెత్తని పొడి వస్త్రాలతో తుడిచారు. కర్పూర హారతులతో ఆహ్వానం పలికారు. మధురమైన ఫలాలనీ, పానీయాల్నీ అందించారు.
ఆ వాతావరణం ఆనందంగా, ఆహ్లాదంగా, ఆశ్చర్యకరంగా ఉంది. అచట పులులూ, మేకలూ సహజీవనం చేస్తున్నాయి. కుక్కా, పిల్లీ కలిసి ఒకే పాత్రలోని పాలు త్రాగుతున్నాయి. కుక్కలపై పిల్లులూ, పిల్లులపై ఎలుకలూ గంతులేస్తూ ఆడుకుంటున్నాయి. అక్కడ ఏ కోశానా మృగత్వ ఛాయలు లేవు.
యజ్ఞకుండాల ముందు కూర్చొని, కాషాయ వస్తధ్రారులైన కొందరు మునులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. అగ్నిహోత్రుడే తన జ్వాలికల నాలికల్ని చాచి వేదమంత్రాలతో హోమంగావిస్తున్నట్లుగా ఉందా దృశ్యం. అక్కడి హోమకుండాలు నక్షత్ర రాశుల్లా వెలిగిపోతున్నాయ. అటునిటు తిరిగే కాషాయ వస్త్రాల్లోని మునులు తిరిగే అగ్నిజ్వాలల్లా ఉన్నారు. మండే కాగడాల్లా వెలిగిపోతున్నారు.
చుక్కలా తెగిపడిన మునినీ, ఆతని వెంట కొదమసింహాల్లా వచ్చిన రాకుమారుల్నీ చూచి, సజల నేత్రాలతోడి మేఘాలవలె, ఆతని శిష్యులు గుమిగూడారు. కుశల ప్రశ్నల్నివేశారు. సాష్టాంగ దండప్రణామాలతో వారి భక్తిప్రపత్తుల్ని ప్రదర్శించారు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087