Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పూట సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించి, మునుల మధ్య మునుల వలె ఉండిపోయారా సోదరులు.
ఆ దినమే శుభదినమని యజ్ఞదీక్షను గ్రహించి, వౌనవ్రతంలో మునిగాడు మహర్షి.
పూలు రాలిన వేదికపై పూలలా ముడుచుకొని, ఆ రాత్రి అక్కడే విశ్రమించారు ఆ రామలక్ష్మణులు.
మహాస్వప్నం

వచనం: ఆ రాత్రి ఆ ఆశ్రమంలో ఆరుబయట, విశాలమైన వేదికపైన, సన్నజాజి పందిరి క్రింద పడుకున్నారు రామలక్ష్మణులు.
రామునికి నిద్రపట్టడం లేదు. మెత్తని దర్భశయ్యమీద దొర్లుతున్నాడు.
మరునాడే విశ్వామిత్రుడు చేయనున్న యజ్ఞం! ఆ యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి రానున్న రాకాసి మూకలు! వాటితో తమ యుద్ధం! యజ్ఞ సంరక్షణం!...అన్న విషయాలే ఆతని మస్తిష్కంలో కదలాడుతున్నాయి.
గాలి వీచినప్పుడల్లా సన్నజాజులు రాలిపడుతున్నాయి. అలా, అవి రాత్రంతా వారిని అభిషేకిస్తూనే ఉన్నాయి!... ఆ ఆకుల మధ్యలోంచి ఆ పూల సందుల్లోంచి ఆకసం వంక తన దృష్టిని సారించాడు రాముడు.
పైన ఆకసంలో చంద్రుడు. నిద్రపోని చంద్రుడు!
క్షీరధారల్లాంటి వెనె్నల వెలుగుల్ని తనపై గ్రుమ్మరిస్తున్నాడు. తనని అభిషేకిస్తున్నాడు! సువిశాలమైన ఆకాశం! లెక్కలేనన్ని నక్షత్రాలు!.. మేషాది ద్వాదశ నక్షత్ర రాశులు!...మధ్యలో సప్తర్షి మండలం!...అనేకమైన పాలపుంతలు!...ఉల్కలు!... గ్రహోపగ్రహాలు!... గ్రహశకలాలు!... ఎంత విచిత్రమీ సృష్టి?...

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087