Others

విశ్వాత్మా! వీక్షించుమా వీరి పోకడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేత ఢమరుక మ్రోగంగఁ జెలువ మీర
సకల భయములు దొలగిపోసాగునయ్య
అభయమిచ్చెడి సంకట హర హర భవ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నీ చేతియందు అందంగా ఢమ
రుక మ్రోగితే మాలోని భయాలన్నీ తొల
గిపోతాయి. అభయమిచ్చెడి వాడవే కాదు
సకల పాపాలను హరించే వాడవు నీవే హరహరా!
శివశివా! యనఁజిత్తాన ఁచింత తొలగు
హరహరా! యన హర్షాన నడ్డుదొలగు
భవభవా! యన మనసున బాధతొలగు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: చిత్తమందు శివశివా! అంటే చింత తొలగిపోతుంది. హరహరా! అని ఆనందంగా పలికితే అడ్డుతొలగిపోతుంది. మనసులో భవభవా! అంటే బాధ తొలగిపోతుంది.నన్నుగావుమయ్య హరా!

నేటి కాలాన నిత్యమ్ము నిన్ను ఁగొల్వ
సాధ్యపడకుండెనో శివా! స్మరణఁజేతు
మననమున కీవు మురిసెదవని ఁ దలంతు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: పరమేశ్వరా! నేటికాలంలో యాంత్రిక జీవనమందు నిత్యం నిన్ను కొలవడం సాధ్యపడడం లేదయ్య మనసులో నిన్ను స్మరిస్తే మురిసిపోతావనే భావంతో నినే్న స్మరిస్తున్నాను స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262