Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరపుల కొరడాల్ని ఝుళిపిస్తున్నాయి!... పిడుగుల్నీ, వడగళ్ళనీ, వర్షధారల శరపరంపరల్ని కురిపిస్తున్నాయి. ఒక యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రుధిరాన్ని క్రుమ్మరించినట్లుగా, కుండపోతగా వర్షిస్తున్నాయి!... యజ్ఞానికి విఘ్నం కల్పింప జూస్తున్నాయి!
అప్రయత్నంగా తన చేయి ధనుర్బాణాలపై బడింది. లక్ష్మణున్ని నిద్రలేపాడు.
తానొక నక్షత్రంలా, ఒక ప్రజ్వలించే సూర్యబింబంలా, ఆకసంలోకి ఎగిరిపోతున్నాడు. ఆ నక్షత్రాల మధ్యకి చేరుకుంటున్నాడు! తనని తన లక్ష్మణుడు ఒక ఛాయలా అనుసరిస్తున్నాడు.
ఆ మేఘాలపై శరపరంపరల్ని కురిపిస్తున్నారు వారిద్దరూ కలిసి! ఆ మేఘాలు చెదిరిపోతున్నాయి! అనంత దూరతీరాల్లోకి పారిపోతున్నాయి! మహార్ణవంలో కురుస్తూ, మహార్ణవాలైపోతూ, ఒక సాగర ఘోషని సృష్టిస్తున్నాయి!
విశ్వామిత్ర మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగిపోతోంది. తాను మీసం మెలేస్తున్నాడు.
విశ్వామిత్ర మహర్షి యజ్ఞంగావించి, మహదానందంతో లేచి వచ్చి తననీ, తన సోదరున్నీ కౌగలించుకున్నాడు. ఆశీస్సుల్ని కురిపించాడు. తమ కళ్ళు ఆనంద బాష్పాల్ని రాలుస్తున్నాయి!...
అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ స్వప్నంలోకి జారుకున్నాడు రాముడు.
సూర్యోదయానికి ముందరే మేల్కొల్పులు! స్వయంగా విశ్వామిత్ర మహర్షే తనని నిద్రలేపుతున్నాడు.
ఇంకా వుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087