Others

కేతుగ్రస్త అర్ధ్ధాక గ్రాస చంద్ర గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖలో ఉన్నపుడు చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణ కాలం చంద్రుని స్థాన కక్ష్య్యా బిందువులపై ఆధార పడి ఉంటుంది. భూమిపై ఉండే వారికి చంద్రగ్రహణం కనపడితే, చంద్రుని పైనుండి వీక్షిస్తే సూర్య గ్రహణం కనపడుతుంది. ఇది ‘పౌర్ణమి’నాడే కలుగుతుంది. సూర్యుని కాంతి భూమిపై పడినపుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగం ‘్ఛయ’. సూర్య కాంతికి కొద్ద్భిగం భూమిచే అడ్డగించ బడిన ప్రాంతం ‘ప్రచ్ఛాయ’. కనుక ఛాయ, ప్రచ్ఛాయల వల్ల పాక్షిక, సంపూర్ణ చంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. ఒక సౌర లేదా చంద్ర గ్రహణం సంభవింపనున్నపుడు ఇతర రకాల గ్రహణాలు రెండు వారాల ముందు లేదా తర్వాత రావడం జరుగుతాయి. అంటే నెలలోపు 3 గ్రహణాలు నెలకొంటాయి. సాధారణంగా సంవత్సరానికి 7 గ్రహణాలు ఏర్పడతాయి. 5 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు లేక 4 సూర్య, 3 చంద్ర గ్రహణాలు ఉండవచ్చు. ప్రతి 10 సంవత్సరాల క్రితం గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఎర్పడినాయో, అదే వరుస క్రమంలో పునరావృతం అవుతాయి. భూమి చంద్రుల మధ్య సరాసరి దూరం 3,84,440 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుండడం వల్ల కొన్ని సందరార్భలలో దగ్గరగా రావడం జరుగుతుంది. ఆ పరిస్థితిని ‘‘పెరిగి’’ అంటారు. ఆ సమయాన దూరం 3,56,509 కి.మీ.ఉంటుంది. భూమి, చంద్రుని మధ్య దూరం పెరిగి నపుడు 4,06,662 కి.మీ. ఉండగా, ఆ స్థితిని ‘‘అపోగి’’ అంటారు. అలా చంద్రుడు భూమి దగ్గరకు వచ్చినపుడు ఏర్పడే పూర్ణమి నాటి చంద్రుడిని ‘‘సూపర్‌మూన్ అంటారు. సూపర్ మూన్ సందర్భంగా, చంద్రుడు మామూలు కన్నా 14 రెట్లు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశ వంతంగా, కొంగ్రొత్త రంగులలో కనిపిస్తాడు. ఇక ఈసారి వికారి నామ సంవత్సర ఆషాఢ శుక్ల పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రం నందు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. జూలై 16/17న ఆషాఢ శుక్ల పూర్ణిమ మంగళవారం రాత్రి 01.32 నిమిషాల నుండి తెల్లవారు జామున 4.29 నిమిషాల వరకు చంద్రగ్రహణం. ఉత్తరాషాఢ నక్షత్ర ద్వితీయ చరణం మకర రాశి యందు సమాప్తమగు చున్నది. ఇది కేతు గ్రస్త అర్థ్ధాకగ్రాస, కృష్ణవర్ణ అపసవ్య చంద్ర గ్రహణం సంభవించనుంది. మంగళవారం రాత్రి 1.32 గంటలకు గ్రహణ స్పర్శకాలం, రాత్రి 3.01 గంటలకు మధ్యకాలం, బుధవారం ఉదయాత్పూర్వం 4.29 గంటలకు మోక్షకాలం అంటే మొత్తం గ్రహణకాలం 2.57 గంటలు. భారతావనిలోని అన్ని ప్రాంతాలు, మొత్తం ఆసియా ఖండము, యూరప్ ఖండంలోని అన్ని ప్రాంతాలు; ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దక్షిణ రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్, హిందూ , అట్లాంటిక్ మహా సముద్రాల ప్రాంతాలలో గ్రహణం గోచరమగుచున్నది. గ్రహణ స్పర్శ మొదలుకుని, మోక్ష పర్యంతం గ్రహణ పుణ్యకాలం. ఈ గ్రహణం రోజున రాత్రి 8.40 గంటల నుండి గ్రహణ వేధ ప్రారంభమై, గ్రహణ మోక్ష కాలం వరకు ఉండును. కనుక నిత్య భోజనాలు, పౌర్ణమీ ప్రయుక్త ప్రత్యాబ్దికములు నిర్దేశిత సమయంలోపుగా పూర్తి చేసుకోవడం ఉత్తమం. సూర్య గ్రహణమైతే గ్రహణానికి 4 జాములు అంటే 12 గంటల ముందు, చంద్రగ్రహణమైతే 3 జాములు ముందు అనగా 9 గంటల ముందు పూజలు, వ్రతాలు, శ్రాద్దములు, నిత్య భోజనాదులు పూర్తి చేయాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణిలు, అనారోగ్యంతో ఉన్నవారు రాత్రి 9.15 గంటల వరకు భోజనాలు ముగించడం, కనీస పక్షంలో గ్రహణ స్పర్శ, మోక్ష కాలం మధ్యన నియమాలు పాటించడం మంచిది. ధనుర్, మకర రాశుల వారు, గర్భిణులు చంద్ర గ్రహణాన్ని వీక్షించ కూడదు. మూల, పూర్వాషాఢ, శ్రవణం నక్షత్రాల వారు శాంతులను చేసుకోవాలి. నదీ స్నానం చేసి, జప పారాయణ దానధర్మాలు ఆచరించాలి. ఉదయాత్పూర్వం 3గంటల అనంతరం గ్రహణ మోక్ష కాలంలో పితృ దేవతలకు తర్పణాలు వదలాలి. మంగళవారమే శ్రాద్ధము ఆచరించాలి. గ్రహణారంభ, అంత్య స్నానాలు చేయాలి. గ్రహణ స్వర్శ కాలాన్ని అనుసరించి...కుంభం, మీనం, కర్కాటకం, తుల వారికి శుభఫలం; మేష, మిధున, సింస, వృశ్చిక వారికి మధ్యమం; ధనుస్సు, మకరం, వృషభం, కన్య వారికి అశుభ ఫలితాలు. అలాగే గ్రహణ మోక్ష కాలాన్ని అనుసరించి ...మీనం, మేషం, సింహం వృశ్చిక రాశులకు శుభం; వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు వారికి మధ్యమం; మిధునం, తుల, మకరం, కుంభల వారికి అశుభంగా ఉంటుంది. బియ్యం, ఉలవలు, రాహు కేతు నాగ పడగలు, రాగి పళ్ళెము, ఆవు నెయ్యి దక్షిణా సమేతడంగా దానాలు చేయాలి. గ్రహణం అయ్యా లేదా తెల్లవారి స్నానం చేసేప్పుడు ముందుగా చంద్రగ్రహ ధ్యానం చేయాలి. ‘‘దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం, నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం’’. త్వాత కేతుగ్రహ ధ్యానం చేయాలి. ‘‘్ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం’’...మమ జన్మరాశి (దానం ఇచ్చేవారి పేరు చెప్పాలి) వశాత్, జన్మనక్షత్ర వశాత్ (జన్మ నక్షత్రం చెప్పాలి) ఉత్తరాషాడ నక్షత్రస్థిత, కేతుగ్రస్త చంద్రగ్రహణ సూచిత, సర్వారిష్ట ప్రశమణార్థం, ఏకాదశ స్థాన ఫలిత శుభ ఫలిత ప్రాప్త్యర్థం గ్రహణ సూచిత దానం అహం కరిష్యే....తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా! హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ!! విధుంతుద నమసుస్త్భ్యం, సింహికానందనాచ్యుత, దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్’’...అను మంత్రం పఠించి గ్రహణ సూచిత అరిష్ట వినాశార్థం మమ శుభ ఫలావాప్త్యర్థం ఇదం కేతుబింబ చంద్ర బింబదానం ఘృత పూర్ణ కాంస్య పాత్ర సహితం యథాశక్తి తిల వస్త్ర దక్షిణా సహితం తుభ్య మహం సంప్రదదే నమ: అంటూ స్నాదానాదులు ఆచరించాలి...

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494