Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సరియె కాని సలిపిరండు వాహ్యాళిని మీరొకింత
అంతదాక హాయిగాను విశ్రమింతు నేనొకింత’’.

అనవారలు ‘‘అటులె’’యంచు వనమందున తిరిగిరి
పూలవోలె పూదోటల యందు సంచరించిరి.

తోట మురిసె వారిజూచి, వారు దానమురిసిరి
మురిపెమ్ముల మురిపెమ్ములు కలగలుపుకు పోయెననగ.

‘‘రారమ్మ’’ని వారినొక్క పూవు స్వాగతించె!
ఒక వృక్షం తన ఫలమ్ము చేతికినందించె!

పరిమళమ్ము పూసెగాలి! ఒత్తె గరిక పాదమ్ముల
సీతాకోకాచిలుకలు విసరె రంగు కోకల!

విశ్రమించినారు వారలొక్క లతామండపమున
పూలయందు పూలవోలె లతల వోలె లతలందున.

ఆకులు వారిని గప్పెను! లతలు వారిపై ప్రాకెను!
పూవులంచు భ్రమనందుచు భ్రమరమ్ములు తిరిగెను!

నీలి నీలి పూవువోలె రాముని ముఖబింబము!
ఎర్రని మందారమ్మన ఆ లక్ష్మణుమోము!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087