Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారవశ్యమున దేలుచు వారు కనులు మూసినారు
తోటయెల్ల కనురెప్పల మాటుదాగె నన్నట్టుల!

అపుడు సీత ఆడుకొంచు అంచవోలె వచ్చెను
ఆమె పూల జడవోలెను ఆమె యిష్టసఖియలును.

శ్రీ చక్రమె వచ్చెననగ వచ్చెను సీతమ్మ
శ్రీకారమె చుట్టె ననగ చుట్టెను సీతమ్మ

శ్రీ చందన పరిమళమ్ము విరిసెనంత తోటను
విరులన్నియు ఆ తావిని పులుముకొంచు మురిసెను.

ఆమె తాక మొగ్గ విరిసె! అందమ్మే కురిసె!
ఆమె సోక లత చిగిర్చె! లాలిత్యమె విరిసె!

ఆమె పదము సోకగానె అవనియె వికసించె!
ఆమె పాద పూజసేయ పూలెన్నో కురిసె!

తుహినమ్ములు పోటీపడె కడుగుటకై ఆ కాళ్ళను
ఒడలెల్లను కళ్ళతోడ వీక్షించెను వనమెల్లను.

వనకన్నియ ఆడినట్లు! వనకినె్నర పాడినట్లు!
ఆమె నడిచె ఆమెతోడ అందమ్ములె నడిచె!

పూవే పూవుల కొరకై పూదోటను తిరిగెననగ
పూజలందు పుష్పమ్మే పూలకొరకు వెదకెననగ.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087