Others

భావి రోబో చాంపియన్స్‌కు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశాభివృద్ధి అనే యజ్ఞానికి తాను కూడా ఒక సమిధను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అహుజ అక్షయ్. స్వతహాగా ఇంజనీర్ అయిన 23 సంవత్సరాల అక్షయ్ మురికివాడలలోని పిల్లలు తగిన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, సరైన శిక్షణ లేకపోవడంవలన వారు కూలీ పనులకే పరిమితం అవుతున్నారు. రోబోటిక్స్ ఎడ్యుకేషనల్ వరల్డ్ అనే సంస్థను నిర్వహిస్తున్న అక్షయ్ తమ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో రోబోటిక్స్, టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్‌పై శిక్షణ ఇస్తున్నారు. మురికివాడలలోని పిల్లలకు కూడా రోబోటిక్స్, స్టార్ట్ఫ్‌‌సపై శిక్షణ ఇవ్వడం ద్వారా, వారిని కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచన అక్షయ్‌కు కలిగింది.
చండీఘర్‌లోని పారిశ్రామికవాడలో మురికివాడలలోని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఒక శిక్షణ కేంద్రాన్ని ఆయన ఏర్పాటుచేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అక్షయ్‌కే చెందిన రోబో ఛాంప్స్ అనే సంస్థ నిర్వహిస్తున్నది. శిక్షణ కోసం చంఢీఘర్, మొహాలీ, పంచ్‌కుల నగరాలలోని మురికివాడలలో గల 70 మంది పిల్లలను ఎంపిక చేశారు. ధనిక, పేద అనే తేడాలేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించాలన్నదే తన సంకల్పమని అక్షయ్ చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విస్తరింపజేయడానికి అక్షయ్ సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో ఆర్థికంగా స్థిరపడిన విద్యావంతులు తమ సమయాన్ని పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడానికి అక్షయ్‌లా కేటాయిస్తే, దేశం అభివృద్ధి చెందటమే కాకుండా, పేదరికం కూడా చాలావరకు తగ్గే అవకాశం వుంది. అక్షయ్ పాత్ర మాదిరిగా మురికివాడలలోని పిల్లలను విద్యావంతుల్ని చేసి, వారికి మంచి ఉపాధి కల్పించడానికి అక్షయ్ చేస్తూన్న కృషి ఫలించాలని ఆశిద్దాం.
***

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- పి.్భర్గవరామ్