Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీవృత్తంలో
ప్రభాతం పసిదిగా వున్నపుడు
నేను
సనాతన గంగలో మునుక స్నానం చేస్తున్నాను..
సంధ్యాకాల సౌందర్యంలో భూమి
మునిగిపోతున్న క్షణాల్ని
ఏరుకుపోవటానికొచ్చింది
నీలినీడలు మెదిలే తన విశాల నేత్రాలు విప్పి
రాత్రి...
నిశి నిశ్శబ్దము పెనవేసుకున్న పరిసరాలలో
నక్షత్రాలను కప్పేసిన చెట్లు
పొడవాటి పొగనీడలై మిణగురుల్ని పూస్తున్నాయి
పక్షులు రేపటి ఉదయాద్రి శిఖరంమీద
ప్రతిష్ఠ చేయాల్సిన గుండ్రని పాటని
రెక్కల్లో దాచుకుంటుంటే
అధరాలమీద వౌనం విధించుకున్న
ఆయుష్మంతులు
స్వప్న కుటీరాలల్లుకుంటున్నారు..

ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404