Others

భవిత పూలబాట !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిత్రాణాయ సాధూనాం
వినాశయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే
శ్రీకృష్ణుడు పుట్టీపుట్టగానే ఎన్నో లీలలను ఆవిష్కరింపచేశాడు. ఆయనే స్వయంగా నేనే భగవానుడిని. ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడల్లా నేను అవతరించి అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని చెప్పారు. ద్వాపరయుగంలోనే ఎన్నో అకృత్యాలు జరిగాయి. ఎందరో రాక్షసులు మితిమీరి ప్రవర్తించారు. అపుడే స్వామినే కృష్ణయ్యగా పుట్టాడు. ఎందరికో ఆరాధ్యదైవంగా నిలిచాడు. పుట్టిన నాటి నుంచి మాయలు పన్ని భగవంతుడినే మట్టుపెట్టాలనుకొనే వారి మదం అణిచి వారి కుత్తులకు కత్తిరించివేశాడు.ఇలా అధర్మాన్ని కాలరాయడానికి ఎన్నో పద్ధతులు సూచించాడు. కొందరికి మాటలు చెప్పి, మరికొందరితో యుద్ధం చేసి, మరికొందరితో ఇంకొందరికి యుద్ధం కల్పించి ఇలా ఎన్నో మాయలు చేసి వారిని సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించాడు. నాడు రాక్షసులు వేరుగా ఉండేవారు. వారిని చూడగానే దానవులు వీరు అని తెలుసుకొనేలా వారి ప్రవర్తన, రూపవిశేషాలు కలిగి ఉండేవారు. నేడు కలియుగం. రాక్షసులు అని వేరుగా ఎక్కడో లేరు. మనుషుల మనసుల్లోనే దాగి ఉన్నారు. అక్కడినుంచే ఇతరులకు కీడు చేస్తున్నారు. ఎదుటివారిని నాశనం చేయడానికి పథక రచనలు చేస్తున్నారు. అందుకే భగవంతుడు కూడా మనుష్యుల మనస్సుల్లోనే తిష్ఠవేసుకుని కూర్చుని ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. అధర్మం పెచ్చుమీరినపుడే భగవంతుడు తాను స్వయంగా చేతల్లోకి దిగుతాడు. అపుడు ఆ దుర్మార్గుల పని పడుతాడు. ఇపుడు భగవంతుడే మన మనసులో కూర్చుని ఉన్నాడు కదా. మనం సదా ఆ భగవానుని గురించి తలుచుకుంటూ మనలో మంచి ఆలోచనలు కలగాలని కోరుకుంటూ ఎదుటివారిలోను పరమాత్మ అంశను చూడగలిగే నేర్పును సాధిస్తే మనమే భగవంతుని రూపంగా మారిపోతాము. కాని భగవంతుని చేతిలో శలభంగా మాడిపోము. ఈ ఆలోచన కూడా మనలనే చేయమని భగవంతుడు మంచి చెడు వివేకాన్ని మనిషికి ఇచ్చాడు. మంచి చేస్తే కీర్తియశస్సు కలుగుతాయి. చెడుదోవన నడిస్తే శలభంలాగా మాడిపోతాం. ఇక మనదే తీర్పు. మనం ఏ దారిన నడవాలోవిచక్షణతో ఆలోచించుకుంటే భవిత అంతా పూలబాటనే అవుతుంది.

- మానస