Others

కోరిన కోర్కెలు తీర్చే గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానం
ఏకదంతముపాస్మహే!
మనం ఏ శుభకార్యం చేయాలన్నా మనందరికి గణపతి అనుగ్రహం కావాలి. హిందువులందరి తొలి పూజలందుకునే దేవుడుగా వినాయకుడు ప్రసిద్ధి పొందాడు. గణపతి ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము, మిగిలిన రెండు చేతులు అభయ ముద్రలను ప్రదర్శిస్తూ ఆటంకాలనే చీకట్లను పోగొడుతూ, శాంతమై, పావనమై ఊహాతీతమై ఎలుక వాహనుడై పెద్ద పొట్ట కలవాడై, చేటల వంటి చెవులు కలవాడై, జగత్ పుట్టుటకు కారణమైనవాడై, భక్తులపై కరుణ కలవాడై, పరబ్రహ్మ స్వరూపుడైన గణపతిని పూజిస్తే యోగసిద్ధులౌతారు.
‘‘నమో వ్రాతపతయే, నమో గణపతియే, నమో ప్రమధ పతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ, విఘ్న వినాశికే శివ సుతాయ వరద మూర్తయే నమో నమః’’ అని ఆ లంబోదరునికి, ఏకదంతునికి, విఘ్ననా శకునికి ప్రతిరోజు నమస్కారం చేస్తే ఆయన అభయాన్నిచ్చి తన భక్తులను సదా కాపాడుతూనే ఉంటాడు.
ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ యధీమహి
తన్నో బుద్ధి ప్రచోదయాత్!
అనే గణపతి గాయత్రిని రోజూ 18 సార్లు పఠించి 10 గుంజీలు తీసి ఏ పని ప్రారంభించినా ఆ పని నిర్విఘ్నంగా జరగుతుంది. విద్యార్థులు చేస్తే విద్యలో ముందు వుంటారు. వ్యాపారస్తులు చేస్తే వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.
గణపతిని గరికతో పూజిస్తే కుబేరుడంతటి వారవుతారు. గణపతిని ఉండ్రాళ్లతో పూజిస్తే వారి కోరికలు తీరుతాయి. ఏ పని తలపెట్టినా సరే విఘ్ననాయకుని పూజిస్తే ఆ పని ఫలవంతం అవుతుందని మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు ఉద్ఘోషిస్తున్నాయ.
పెళ్లికాని పిల్లలకి (ఆడ మగ ఎవరైనా సరే) ఏకాదశి రోజున కానీ, బుధవారం చవితి కలిసిన రోజున కానీ తలస్నానం చేయించి వారిని గడపమీద కూర్చోబెట్టి చలివిడి వుండ్రాళ్లు వాళ్ళ తలమీద పోసి హారతి ఇవ్వాలి. ఈ ప్రకారం చేస్తే వారికి త్వరగా వివాహం అవుతుంది.
ఇలా సర్వానికి అధిపతియైన గణపతిని అందరూ పూజిస్తారు. గణాధ్యక్షుడైన గణపతి ని పూజించిన వారికి ఆయురా రోగ్యాలు సమకూరుతాయ. ఐశ్వర్యాభివృథ్ధి కూడా జరుగుతుంది.

- వాణీమూర్తి