Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళారవపు మంజుల గీతా
భంగరంగ ద విభక్త విహం గో
త్సంగ రంగ విలసన్మధు సాంగో
పాంగ మయ్యె సకలావని నెమ్మిన్...’’
మొగ్గ పూవై పోతున్న సౌందర్య పరాకాష్ఠలో
నిశ్శబ్ద విరావాన్ని
సూక్ష్మ నేత్రం వినగలిగినప్పటి పారవశ్యానికి
భాష- భాష్యం వుంటాయా...?
అనుభూతులు క్రిక్కిరిసిన ఆలాపనలో
గీతోదయ భావ స్పర్శ
పల్లవిత కుసుమాల మీద పాట నల్లుకుంటుంది
దాని పేరు, గాలి రెక్కలమీద గంతులేసే తావి
గమనించావో లేదో
నా పాటకు ఈ జగమే ఒక రూపాంతర చేతన
స్వాప్నిక యాతనలోని దృశ్యం
గొంతు విప్పుకుంటుంది
నిశ్శబ్ద హృదయాన్ని
రాగ రంజితం చేస్తుంది
ఆకుల నీడలో అందం మడతలు విప్పుకుంటున్నట్లు
ప్రేమ అనే రంగుల్లో మునిగి
ఆమ్రవనాన్ని ఆత్మీయంగా
వసంత భాషలోకి అనువాదం చేస్తున్నట్లు..
ఈ స్థితి ఇలానే కొనసాగుతూ వుంటుంది
ఎల్లలుదాటి హంస ఏటికోళ్ళు చెప్పుకుంటుంది
పరిధిమీదకొచ్చి ఉనికి ఉలుపనిస్తుంది
తెలియని దానికి తెరతీసి
తెలిసిన అవస్థని తెలివి తెప్పదాటిస్తుంది
మనసుపడ్డ గాయానికి
మమత కట్టుకడుతుంది
ఏదో ఒక కల
ప్రపంచమై పలకరిస్తుంది. ప్రేమిస్తుంది. ద్వేషిస్తుంది
చిన్న నక్షత్రాన్ని చేతికిచ్చి
అంతరాత్మ సందుల్లోని అసలు రహస్యాన్ని
వెతుక్కోమంటుంది
దాటి వచ్చేవాడ్ని దాటిపోయేవాడ్ని
ఒకే ఆటస్థలంలో ఆయువుకర్పిస్తుంది...
నేను నా చుట్టూ తిరుగుతూ వుంటాను
వెలుతురుగా. చీకటిగా. చీకటిగా. వెలుతురుగా!!
ఇది సుకవి జన విధేయ సాంధ్యశ్రీ నామధేయ ప్రణీతంబైన
‘‘సుస్థిల’’ ఆధునిక ఇతిహాస ద్వితీయా శ్వాసము.

ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404