Others

కరుణావల్లి కామేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తలచిన వారలుఁ బిచి నంతట ఁ బల్కు
కలిమి బలముల బంగారు దుర్గ
దారిద్య్ర నాశినీ దయగల మాతల్లి
యమృత వర్షిణి వి నేవమ్మా దుర్గ

నమ్మిన వారికి నవవిధులొసగంగఁ
దలుపుఁ దట్టెద వీవు తల్లి దుర్గ
చింతలెన్ని యునున్నఁ జిడికెలో ఁ జలార్పఁ
గదలి వచ్చెడి తల్లి కనక దుర్గ

కొలిచిన వారికి ఁ గొంగుబంగారమై
వెన్నంటి యుందువే విజయ దుర్గ
చీడపీడలఁ బాపి సిరివెనె్నలలు విర
బూయించు కల్యాణి పూజ్యదుర్గ

గీ. నిన్ను నమ్మిన నిలువవు నిత్య కష్ట
తతులు పరుగిడు వేగానఁ దాకుచుండు
సంబరమ్మును సంబరాలనుదినంబు
దూపదీప నైవేద్యాలు దోరముగనుఁ
గొనుచు ఁ గృపజూడుమో యమ్మ కువలయాక్షి

కె. సూర్యసుబ్రహ్మణ్యం, 9492457262