Others

సులభ బ్రహ్మజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా చేతల ద్వారానే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాడు. అందరూ చాలా సులభంగా తత్త్వబోధను అర్థం అయ్యేట్టు చేస్తారనేవారు అంతేకాక ఆ వార్త శిరిడీలోనే కాక చుట్టు పక్కల గ్రామాలకు కూడా పాకింది. దానితో ఒక మంచి షావుకారు నేను తపస్సులు, దానధర్మాలు లాంటివి ఏవీ చేయకుండానే బ్రహ్మజ్ఞానం తెలుసుకొంటే ఇటు సంపాదన అటు పరలోక సంపద రెండింటినీ సంపాదించుకోవచ్చు కదా. ఇక చనిపోయనా అక్కడ మనకు కష్టమేమీ ఉండదు. ముందు జ్ఞానం పొందితే చాలు అనుకొన్నాడు. వెంటనే బాబా దగ్గరకు ప్రయాణం కట్టాడు. అక్కడికి చేరగానే మసీదులో కూర్చుని ఉన్న బాబాను చూసి మంచి సమయానికి వచ్చాననుకొన్నాడు. టాంగావానితో ఇపుడే వస్తాను అని చెప్పి బాబా దగ్గరకు వెళ్లాడు. బాబా షిరిడీకి టాంగాను రానూ పోనూ మాట్లాడి మరీ మీ వద్దకి వచ్చితిని. ఆలస్యం చేయకుండా మీరు నాకు బ్రహ్మజ్ఞానము నేర్పించండి. ఆలస్యం అయితే ఆ టాంగాకి ఎక్కువ డబ్బులు అడుగుతాడు. అందుకే బాబా మీరు త్వరగా నేర్పిస్తే నేర్చుకొని వేగంగా వెళ్లిపోతాను అనిచెప్పాడు. బాబా చిరునవ్వు నవ్వాడు. బాబా అక్కడే ఉన్న ఒక పిల్లవాడిని పిలిచి ఒరేయ్ నాయనా, నువ్వు తక్షణమే నందూ ఇంటికి వెళ్లి బాబాకి ఐదు రూపాయలు కావాలని అడిగిరా పో అంటూ ఆజ్ఞవేయడం, ఆ పిల్లవాడు తిరిగి వచ్చి నందూ ఇంటి వద్ద లేడని చెప్పినంతనే, బాబా ఈసారి బాల ఇంటికి వెళ్లి అడిగిరాపో అంటూ మరలా పంపడం- ఇలా ప్రతి ఒక్కరింటికి ఐదు రూపాయల కోసం బాబా పంపటం గమనించిన వర్తకుడు బాబాతో- నేను మీకు బ్రహ్మజ్ఞానం బోధించమని ప్రాధేయపూర్వకంగా వేడుకొంటున్నా, నన్ను ప్రక్కకి ఉంచి ఇలా చేయడం భావ్యమా బాబా అంటూ ప్రశ్నించిన అతని అమాయకత్వాన్ని చూసితిరిగి బాబా నవ్వాడు. వ్యాపారికి ఏం అర్థం కాక మళ్లీ తన భాధను వ్యక్తం చేశాడు. ఇపుడు చేస్తున్నదంతా బ్రహ్మజ్ఞానము యొక్క సారాంశమే. నీకర్థం కాలేదా, - నాక్కావలసిన ఐదు రూపాయలు నీ వద్ద 50 రెట్లు నోట్ల రూపంలో ఉన్నా నువ్వు నా గురించి ఆలోచించకుండా నీ గురించే ఆలోచించావు చూడు, అనగానే నిజంగా తన వద్ద 25 పది రూపాయల నోట్లున్నాయన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యచకితుడై బాబాకి నమస్కారం చేశాడు. చూడు బాబు- నీతి, లోభము అనేది ఎప్పుడైతే విడిచిపెడతావో ఆ క్షణమే నీకు బ్రహ్మజ్ఞానం బోధపడుతుందని హితోపదేశం చేశాడు. బాబా బ్రహ్మజ్ఞానమంటే ఎదుటివారి గురించి ఆలోచించటం. వారి బాధలో మన వంతు సాయం చేసినప్పుడే మనం నిజమైన బ్రహ్మజ్ఞానం పొందేవాళ్ళవౌతామని నిరూపించేలా చేశాడు బాబా.

- ఆర్ పురందర్