Others

బానిసత్వం నశించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుపొందిన అహింసా ప్రవక్త చేసిన ఈ హింసాత్మక కార్యం పెద్ద వివాదానికి దారితీసింది. ఒక జైనుడైతే గాంధీ పాపాన్ని ఆయన రక్తంతోనే కడుగుతానని బెదిరించాడు కూడ. గాంధీ ఈ విమర్శల తుఫానును వౌనంగా, ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు.
మరో సందర్భంలో పంటలను, పళ్లను, కూరగాయలను నాశనం చేస్తున్న కోతుల మందను చంపాలనే ప్రతిపాదనతో ఆయన మూర్ఖంగా అహింసను పాటించేవారిని విస్తుపోయేలా చేశాడు. ‘‘నేను కూడా ఒక రైతుని. అతి తక్కువ హింసతో నా పంటలను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించడం నా ధర్మం. ఈ కోతుల గొడవ చాలా తీవ్రంగా వుంది. తుపాకితో గాలిలో కాల్పులు జరిపినా అవి బెదరడంలేదు. చంపకపోతే పంటలను రక్షించుకోలేని పరిస్థితుల్లో వాటిని చంపాల్సి వస్తుందేమో? నేను దీన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను’’’ అని వివరించాడు గాంధీ. అయితే ఆశ్రమంలో కోతులను తుపాకులతో కానీ బాణాలతో కానీ చంపాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.
పేద రైతుల ఆదాయం పెంచడం ఎలా అని గాంధీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. వారు ఏడాదికి నాలుగు నుంచి ఆరు నెలలు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కేవలం వ్యవసాయంతో కుటుంబం గడుపుకొనే పరిస్థితి లేదు. 30 కోట్లమంది రైతుల బలవంతపు నిరుద్యోగానికి పరిష్కారంగా ఆయన రైతు మహిళ చేతుల్లో రాట్నాలనూ, పురుషుల చేతుల్లో చేతి మగ్గాలను ఉంచి వాటిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. సరైన దుస్తులూ, సరైన ఆహారం, సరైన చదువూ లేక బాధపడుతున్న రైతుల జీవన స్థాయిని సంతులిత ఆహారం, గౌరవప్రదమైన ఇల్లు, దుస్తులు, తగిన వైద్య సౌకర్యలు ఉండే స్థాయికి పెంచాలని వారికి సరైన చదువు చెప్పించాలని ఆయన కోరుకున్నాడు. అలాగే వారు పోరాడే తత్వాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి.
రైతు - కూలీ- ప్రజారాజ్యానికి ఆయన మద్దతిచ్చాడు. ‘‘తమ దుస్థితికి కారణం దురదృష్టం కాదని, వ్యవస్థేనని రైతులు గ్రహించి తిరగబోయిన రోజు వాళ్లు రాజ్యాంగబద్ధం కాని మార్గాలను కూడా అనుసరించేందుకు వెనుకాడరు. నిజమైన స్వరాజ్యమంటే ఏమిటో భారతీయ రైతాంగం అర్థం చేసుకున్న రోజు వాళ్లను అడ్డుకొనే ధైర్యం ఎవరూ చేయలేరు’’ అనేవాడాయన.
గాంధీగారి నాయకత్వంలో రైతులు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అధికారుల ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉప్పును తయారుచేశారు. బహిరంగ సభలలో భారత స్వాతంత్య్ర ప్రతిజ్ఞ చేశారు. పన్నులు చెల్లించేందుకు నిరాకరించిన ఉద్యమంలో వారి ఆస్తులు, భూములు వేలం వేయబడ్డాయి. వారు డబ్బు రూపంలో నష్టపోయినా నైతిక స్థైర్యం పెరిగింది.
వేలంపాటగాడు
తనను ఎవరైనా మహాత్మా అని పిలిచి, కాళ్లమీద పడటం నేరంగా పరిగణించేలా ఒక బిల్లు తయారుచేయాలని గాంధీ అనుకున్నాడు. కానీ ఆయన వెళ్లిన నగరాలు, గ్రామాల్లో హీరోలకు లభించే స్వాగతాన్ని మాత్రం తప్పించుకోలేకపోయేవాడు. ఏదో ఒక సమస్యలో వున్నవారికి సహాయం చేయడానికి ఆయన ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తిరుగుతూ ప్రజలతో సంబంధాలు నెరపేవాడు. అన్నిచోట్లా ఆయనకు విపరీతమైన అభిమానం, విధేయతలతోకూడిన స్పందన లభించేది. ఆయనకు పుష్పగుచ్ఛాలు, పూలదండలు, ఖరీదైన చట్రాలలో బిగించిన సన్మాన పత్రాలు, పర్సులు, ఆభరణాలు బహుమతిగా లభించేవి. గాంధీ వారి అభిమానాన్ని మెచ్చుకునేవాడు, కానీ సగటు తలసరి ఆదాయం రోజుకు మూడు పైసలుగా ఉన్న దేశంలో పూలదండలూ, సన్మాన పత్రాలకు డబ్బు దుబారా చేయడం ఆయనకు నచ్చేది కాదు.
ఈ దుబారా ఆపమని, ఆయన ప్రజలకు చేసిన విజ్ఞప్తులు వృధా అయ్యాయి. దీనితో ఆయన ఈ దుబారాను సంపదగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆయనకు డబ్బులు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నపుడు ఆ పని బహిరంగంగా చేసే అవకాశం వారికి ఎందుకు ఇవ్వకూడదు?
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614