Others

కలియుగ ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారికి సానుభూతి చూపించడానికి, వారిలో ఒకడిగా ఉండటానికి గాంధీ కుర్తావేసుకొని, ధోతీని లుంగిలా ధరించడం ప్రారంభించాడు. వాకింగ్ స్టిక్‌ను వాడడం మాని చేతికర్రను పట్టుకోవడం ప్రారంభించాడు. చేతి సంచీని ధరించడం మొదలుపెట్టాడు.
సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ, సామూహిక శాసనలోల్లంఘనలను ప్రభుత్వ వ్యవస్థీకృత సాయుధశక్తిని ఎదుర్కొనే శక్తివంతమైన ఆయుధాలుగా గాంధీ అభివృద్ధి చేశాడు. చెడుకు, మూర్ఖపు బలానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణకు ఉదాహరణలుగా ఆయన ప్రహ్లాదుడిని, విభీషణుడినీ చూపేవాడు. అవి తన సొంత ఆలోచనలని చెప్పుకొనేవాడు కాదు. అయితే ఆ విధానాలను సామూహిక స్థాయిలో రాజకీయ పోరాటాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచన, ధైర్యంగా దాన్ని ఆచరించి విజయం సాధించిన ఘనత గాంధీకే దక్కుతాయి. వాటి విజయం కూడా అద్భుతమైనది.
‘‘అహింసమీద మీకున్న విశ్వాసాన్ని ఆటంబాంబు కూలదోసిందా?’’ అని ఒక విదేశీ విలేఖరి గాంధీని అడిగాడు. ‘‘లేదు. సత్యం, అహింస కలసికట్టుగా నిలబడినప్పుడు వాటి అత్యున్నత శక్తి ముందు ఆటంబాంబు ప్రభావం పెద్దగా ఉండదు. ఆటంబాబు కూడా నాశనం చేయలేని శక్తి అహింస ఒక్కటే’’ అని గాంధీ బదులిచ్చాడు. భారతదేశంలోని అపార జన సమూహ శక్తిని ఐకమత్యంగా ఒక ఉన్నత లక్ష్యం వైపునకు మళ్లించడంలో గాంధీ నిర్వహించిన పాత్ర అనితరసాధ్యమైనది, అద్వితీయమైనది.
గాంధీ నాయకత్వంలో భారతదేశం అహింసాయుతంగా స్వాతంత్య్రాన్ని సంపాదించుకుంది. ఆసియా, ఆఫ్రికా, అమెరికాలో దోపిడీకి గురవుతున్న జాతులన్నింటికీ భారతదేశం ఒక స్ఫూర్తిప్రదాతగా ఉండాలని ఆయన భావించేవాడు. ‘‘్భరతదేశపు పోరాటం అహింసాయుతమైనదే కాదు, బలమైన శక్తులకు వ్యతిరేకంగా అణచివేయబడుతున్న జాతులు తమ స్వేచ్ఛకై చేసిన పోరాటం’’ అనేవాడాయన. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత అనేక వలస పాలిత దేశాలు రక్తపాతం లేకుండా స్వాతంత్య్రాన్ని పొందాయి. అమెరికాలో నీగ్రోలకు మానవ హక్కులు కల్పించాలనే ఉద్యమం విజయవంతంగా విస్తరించడం ప్రారంభించింది.
ప్రత్యర్థుల మనసులో మార్పు తీసుకురావడానికి ఆయనచేసిన ప్రయోగంతో పాటు, ఆయన దుస్తులు కూడా చెప్పుకోదగిన మార్పులకు గురయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి ఆఖరిసారి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ ఒక కుర్తా, ధోతీ, పొడవాటి కోటు, భారీ కథియావాడీ తలపాగా ధరించేవాడు. ఆ దుస్తులు వేడి వాతావరణంలో అసౌకర్యంగా ఉంటాయని ఆయనకు త్వరలోనే అర్థమయ్యింది. పైగా గజాల కొద్దీ బట్ట వృధా అవుతోంది. దానితో ఆయన ధోతీ, కుర్తా, టోపీ ధరించడం ప్రారంభించాడు. ఆయన అదే దుస్తులతో ముఖ్యమైన సమావేశాలకు, బహిరంగ సభలకు హాజరుకావడం చూసి పెద్దమనుషులు విస్తుబోయారు. నూలు వడకడం, నేయడం నేర్చుకోగానే గాంధీ అన్నీ ఖాదీ దుస్తులే ధరించడం ప్రారంభించాడు. ఎంబ్రాయిడరీ లేని కశ్మీరీ టోపీలా గాంధీ టోపీ ఉంటుంది. తెల్ల టోపీనే ధరించాలని గాంధీ పట్టుబట్టాడు. తెల్లటోపీ తొందరగా మాసిపోతోందని అనుచరులు పిర్యాదు చేసినపుడు ఆయన ‘పరిశుభ్రతకు అత్యున్నత ప్రమాణంగా తెల్లటోపీని ఎంపిక చేశాను. ఆ పలుచటి టోపీని ఉతుక్కోవటం సులభం, అది చాలా త్వరగా ఆరిపోతుంది కూడా. ముదురు రంగు టోపీలు కూడా అదే స్థాయిలో మురికిపడతాయి. కాకపోతే అవి మురికిని పైకి కనబడకుండా దాస్తాయి’’ అన్నాడు. ఖాదీ పంచె లేదా పైజమా, కుర్తా గాంధీ టోపీలు బాగా ప్రాచుర్యం పొంది జాతీయ దుస్తులుగా పరిగణించసాగారు.
చాలామంది బీహారీలు, మార్వాడీలు, గుజరాతీలు తమ పెద్ద పెద్ద తలపాగాలను వదలిపెట్టి గాంధీ టోపీలను ధరించడం ప్రారంభించారు. ముస్లింలు వారి ఫిజ్ (టోపీ)ను వదిలేశారు. మామూలుగా తలమీద ఏమీ ధరించడం అలవాటులేని బెంగాలీలు, దక్షిణ భారతీయులు గాంధీ టోపీ ధరించడం ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమం రోజుల్లో బుసలు కొట్టే ఎద్దు ముందు ఎర్రబట్టలా గాంధీ టోపీ పనిచేసింది.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614