Others

పఠాన్‌కోట జైల్లో పడ్డ గువ్వ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్ పఠాన్‌కోట ఉదంతం తెల్సుగా? అక్కడ సరిహద్దులలో ఈనెల ఒకటవ తారీఖున ఒక పావురం మన భద్రతాదళాలను ముప్పుతిప్పలు పెట్టింది కానీ చివరికి దొరికిపోయింది. అది తెచ్చిన కపోత సందేశం చాలా ఆందోళనాకరంగానే వుంది. దాని కాలికో చిన్న గొట్టాం, అందులో ఒక ‘వార్నింగ్ మెస్సేజ్’ వున్నాయి.
ఆ చీటీ ఉర్దూ లిపిలో వుంది. ఈ భాష కేవలం పాకిస్తాన్‌లకే వచ్చును. అది యివ్విధంబగానున్నది-
‘‘అబ్బీ, మోడీ! మేము ’71 నాటి శాల్తీలం గాము, ఖబర్‌దార్! ఇట్లు జైషే మొహమ్మద్’’ అని వుంది. మన భద్రతా దళాలు పోలీసు స్టేషన్‌లో యిచ్చేశారు ఆ పావురాన్ని. వాళ్లు కేసు రాసుకుని పావురాన్ని లాకప్‌లో వేశారు. అక్కడి ఇన్స్‌పెక్టర్ పేరు దిలీప్‌కుమార్. దీనికోసం పాపం బజారుకుపోయి- మూడొందలు పెట్టి ఒక పంజరం కొనుక్కొచ్చాడు. అదృష్టం బాగుంది. జీవకారుణ్య సంఘంవాళ్లకి తెలియనివ్వలేదు.
పోయిన శుక్రవారం నమాజ్ తర్వాత మన పావురాన్ని బాల్మియా పోలీస్ స్టేషన్‌నుంచి ముప్ఫయి అదు కిలోమీటర్ల దూరంలో వున్న పశువుల ఆసుపత్రికి తీసుకుపోయి క్షుణ్ణంగా పరీక్షలు చేయించారు. ఏమో? లోపల ఎక్కడైనా సిమ్‌కార్డో, వైర్‌లెస్ మైక్రోఫోనో, మరోటో మరోటో వుండొచ్చునుగా? టెర్రరిస్టులతో చాలా జాగ్రత్తగా వుండాలి కదా!ఇప్పుడీ కపోతం అక్కడ అందరికీ ఓ వింత అయిపోయింది. తెగ ఎగబడుతున్నారు సందర్శకులు- క్యూలు కట్టి మరీ. దర్యాప్తు అయితే గానీ రుూ పిట్టకి మోక్షం లేదు. అందాకా సర్కారీ అతిథిగా వుండాల్సిందే. ‘పిట్ట’లని అంత తేలికగా తీసుకోకండి- అన్నది నీతివాక్యం!