Others

వన్ సైడ్ లవ్వే వద్దు గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు..’ అని మన తాతల కాలంనాడే పాడుకున్నారంటే ప్రేమ మైకం ఎంతటిదో అర్థవౌతుంది. తొలిచూపుతోనే, టైమ్ అడిగితేనో, రోడ్డుమీద అందంగా కనిపిస్తేనో వెంటబడిపోవటం ప్రేమ కాదు. కేవలం లస్ట్ అంతే. టైంపాస్ కోసం చేసే ప్రేమలు అప్పటికి బాగానే ఉన్నా సమయం చూసి దెబ్బ కొడతాయని నేటి యువత గ్రహించాలి.
మనిషి అంటేనే ఆశాజీవి అని అందరికీ తెలుసు. అందునా ఆకర్షణకు లొంగే నైజం కూడా ఎక్కువే వుంటుంది కాబట్టి వ్యాపార ప్రపంచం సమాజం నాడిని ఆ విధంగా సొమ్ము చేసుకోవాలని యత్నిస్తుంది. అది వారి సహజ నైజం. అందుకే కొత్త వస్తువులు, ఉత్పత్తులు ఏవైనా పదే పదే ప్రకటనల్లో గుప్పించి కొనిపించేదాకా నిద్రపోనివ్వవు. అదేవిధంగానే సినిమాలు, సీరియళ్ళు మొదలైనవి.
సినిమా తీసేవాడికి లాభం కావాలి. నటీనటులకు డబ్బ, అభిమానులు కావాలి. దర్శకునికి మరిన్ని సినిమాలు తీసే ఛాన్స్ కావాలి. అలాగే, ప్రేక్షకుడు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కోసం మాత్రమే సినిమా చూసి అక్కడే దాన్ని మరిచిపోతే గొడవ ఉండదు. అందులోని పాత్రల్ని తనకు అన్వయించుకున్నపుడే అసలు తంటా మొదలౌతుంది. కాలేజీ కుర్రాడు తననో హరోగా అనుకుంటాడు. అమ్మాయి హీరోయిన్ అయిపోతుంది. ఇంకేముంది! ప్రేమ కథలే కదా ఎక్కువ శాతం సినిమాల్లో చూపించబడేది. టీనేజ్ నుంచే ప్రేమ ఒక ఆకర్షణీయ, అత్యవసర విషయంగా అనిపిస్తుంది. సినిమాలో హీరో ప్రేమ విఫలమై తాగుబోతైతే యువత మందుబాటిళ్ళు లేపుతుంది. త్యాగం కోరినట్లు చూపితే వైరాగ్యంతో నీరసించి తల్లిదండ్రుల్ని బంధువుల్ని కాదని తమదారి చూసుకునేలా పిచ్చితనం ఆవహిస్తుంది.
ఇక ఇప్పుడేమో కొత్త ట్రెండు.. నేను ఇష్టపడింది చచ్చినట్లు ననే్న ఇష్టపడాలి. లేదంటే యాసిడ్‌తోనో మరే మారణాయుధాలతోనో పాశవికంగా దాడిచేసి ఆమె కుటుంబాన్ని బాధించి, తానెల్లి ఉరికంబమెక్కి తన కుటుంబాన్ని బాధించి ముగించాలి అనుకోవటం ఎక్కువైంది. ఒకప్పుడంటే చదువులేని అమాయకులు ఎక్కువ. అయినా.. వాళ్ళే భయం భక్తి, గౌరవ మర్యాదలైనా కలిగి మనసుని కట్టడి చేసుకుని బ్రతకగలిగారు. ఇపుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. పెద్దవాళ్ళు ఉద్యోగాల్లో బిజీ. ఇక ఒంటరితనానికి తోడు ఇంటర్నెట్, టచ్ స్క్రీన్లు అయ్యాయి.
సినిమా జీవితం కాదు, ప్రేమంటే పెళ్లితో ముగిసిపోదు. తురవాతే మూడొంతుల జీవితమన్న ఇంగితజ్ఞానంతో ఆలోచించాలి. కని పెంచిన అమ్మా నాన్నలే మనల్ని కోప్పడితే నచ్చదు. తోడబుట్టిన సోదరులే కొట్లాడుకోని రోజుండదు. మరి ముక్కూ ముఖం తెలియని మనిషిని ప్రేమించు, నాతోనే బ్రతుకు అని వెంటాడి వేధించడం ఎంత సిల్లీ? అని తమలో తాము తర్కించుకోరు.
అలా తర్కించుకోగలిగితే ఇన్నిప్రేమ వైఫల్యాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు వుండనే వుండవు. తాను మెచ్చిన వాళ్ళ గురించి తమ ఇంట్లో చెప్పి, వాళ్ళు ఒప్పుకుని అవతలివాళ్ళ అభిప్రాయం తెలుసుకుని అభిరుచులు కలిసి, అన్ని విధాలా సరైన అవగాహనతో ఏడడుగులేయగలమని భావిస్తే పెళ్లి గురించి ఆలోచించాలి. అటువంటి పెళ్లికోసం ముందు ఆర్థికంగా, మానసికంగా సొద్దపడితే పరస్పర అవగాహనతో ఏర్పడే బంధం పదికాలాలు నిలుస్తుంది. అప్పుడప్పుడూ అలకలు, కోపతాపాలు వచ్చినా తొందరగా సర్దుకుని మరింతగా ప్రేమ ఇనుమడిస్తుంది.
సినిమాలు సమాజంలోని మంచిని ప్రభావితం చేస్తే మారటంలో తప్పులేదు. కానీ చెడు సందేశాలిస్తే సమాజమే వాటిని బహిష్కరించి సమాజ శ్రేయస్కర సినిమాలు రావడానికి దోహదపడాలి. ఇలా తీస్తేనే యువత మెచ్చుతుందని అర్థమయ్యేలా ప్రవర్తించాలి. అప్పుడే ‘ప్రేమ ఎంత మధురం!’ అనిపిస్తుంది.

- డేగల అనితాసూరి