Others

గుడ్డుతో గుండె భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలోని రెండవ శుక్రవారం రోజును ప్రపం చ గుడ్డు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో గుడ్డు, కోడిమాంసం తలసరి వినియోగం బాగా తక్కువగా వుందని చెప్పవచ్చు. కోడిగుడ్డు పౌష్టికాహారంగా గుర్తిం చారు. దేశ జనాభాలో 25 శాతంగా ఉన్న పట్టణ ప్రాంత ప్రజలు ఏటా సగటున 100 కోడిగుడ్లను వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఏటా సగటున 20 గుడ్లను మాత్రమే వినియోగిస్తున్నారు. పౌల్ట్రీ రంగంలో దేశంలో మన తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నా తలసరి వినియోగం లో మన రాష్ట్రం కూడా వెనుకబడే ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కోడిగుడ్డు, కోడిమాంసం ఉత్పత్తి గణనీయంగానే ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఒక గుడ్డులో 300 మైక్రోగ్రాముల కొలైన్
చౌకగా లభించే పౌష్టికాహారంలో గుడ్డు ఒకటి. గుడ్డు తినటం వల్ల ఉపయోగాలు అనేకం. ముఖ్యంగా ఒక గుడ్డు తినటం వల్ల శరీరానికి ఉపయోగపడే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తనాళాలు, గుండె జబ్బులు దరిచేరవు. కంటి సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది. ఒక గుడ్డులో 300 మైక్రోగ్రాముల కొలైన్ లభిస్తుంది. ఇది మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటానికి దోహదం చేస్తోంది. వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్షయ వ్యాధిగ్రస్తులు, బాలింతలు, గర్భిణులు, కాలేయ వ్యాధిగ్రస్తులు రోజూ గుడ్డు తింటే మంచిది. ఒక గుడ్డులోని తెల్లసొనను కప్పు పాలలో కలిపి, దీనికి రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే శరీరంలోని విష పదార్థాలకు విరుగుడు లభిస్తోంది. ఇలా ప్రతిరోజూ తీసుకోవటం వల్ల శారీరక బలం పెరిగి టానిక్ వలే ఉపయోగపడుతుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క రూ నిత్యం కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవాలి. ఎదిగే పిల్లలకు శక్తిని ఇస్తుంది. నేటి కాలంలో కూడా కోడిగుడ్డును తీసుకోనివారు ఉన్నా రు. కోడిగుడ్లను విరివిగా తీసుకుందాం. ఆరోగ్యం వుందాం.