Others

సంతానాన్నిచ్చే సిద్ధి వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఏ విధమైన ఆదరణ ఉన్నదో, మహరాష్టల్రో ముంబయి సిద్ధి వినాయకుడి ఆలయానికి అంత ఆదరణ ఉంది. తన భక్తులు కోరికలు కోరుకున్నదే తడవుగా తీర్చడమే కాదు ఏ కోరిక కాదనకుండా వినాయకుడు వాటిని ఈడేరుస్తాడని ప్రతీతి. అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ.
వినాయకుని పూజించని వారు ఎవరూ ఉండరు. ప్రతి పనికీ ముందు విఘ్నేశ్వర పూజ చేయడం మన అందరికీ అలవాటే.
ముందుగా పూజించే వినాయకుడికే తన బాధ తీర్చుమని ఓ భక్తురాలు మొరపెట్టుకుంది. కానీ ఆ భక్తురాలి కోరిక విఘ్నాల కే అధిపతి అయన దేవుడు తీర్చలేదు. వెంటనే ఆమెనే మరో కోరిక కోరింది. వెనువెంటనే ఆమే కోరికను ఆయన మన్నించాడు. ఇదేమిటి అనుకొంటున్నారాః ఇదిగో ఈ కథ చదవండి మీకే తెలుస్తుంది. అందుకే ఈ కథను ఈ గుడిలో కూర్చుని స్మరించుకున్న వారికి వినాయకుడు వేగంగా కోర్కెలను తీరుస్తాడని కూడా అంటారు.
ఈ ఆలయాన్ని నిర్మింపజేసిన ఓ భక్తురాలి కథే ఇక్కడి స్థల పురాణంగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయానికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మొట్టమొదట 1801 నవంబర్ 19న (విక్రమార్క శక సంవత్సరం 1723 దుర్ముఖ నామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్దశి) మూడు మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల పొడవుతో అతి చిన్న దేవాలయాన్ని దేవుభాయ్ పాటిల్ అనే భక్తురాలు నిర్మించారు. పాత కాలం నాటి గుమ్మటంతో దళసరి ఇటుకలతో ఈ ఆలయం ఇవాళ్టికీ ప్రధాన ఆలయం పక్కన కనిపిస్తుంది. దేవుభాయ్ పాటిల్ తన సంతాన లేమిని తొలగించాలని స్వామి వారిని వేడుకుంటూ తనకున్న సంపదలో అధికభాగాన్ని విఘ్నేశ్వరుని సేవకు ఖర్చు చేస్తుండేవారు. దురదృష్టవశాత్తూ ఆమె భర్త చనిపోవడం వల్ల ఆమె కోరిక నెరవేర లేదు. అట్లాగనీ ఆమె వినాయకుడి సేవను విడిచిపెట్టలేదు. తనకు కలిగిన కష్టం మరొకరికి కలుగకుండా చూడాలని ఆమె వినాయకుడిని కోరుకునేది. అదిగో అదే ఈ సిద్ధి వినాయకుని ప్రత్యేకత. ఆమె కోరిక ఒకటి తీర్చలేదు. కానీ అందరికోసం కోరుకున్న కోరికమాత్రం కాదనలేకపోయాడు ఆ వినాయకుడు. ఆ రోజుటి నుంచి ఎవరు వచ్చి బిడ్డలు కావాలని కోరుకున్నా ఆలస్యం చేయకుండా వారికి సంతానాన్ని కలుగచేస్తున్నాడీ వినాయకుడు. మహరాష్ట్ర ప్రజలు ఈ వినాయకుడిని నవసాచ గణపతి అని పిలుస్తుంటారు. గర్భాలయంలో ప్రతిష్ఠించిన మూలవిరాట్ పెద్ద నల్లని ఏకశిలపై 750 మిల్లీ మీటర్ల ఎత్తు, 600 మిల్లీ మీటర్ల వెడల్పుతో కూడుకున్న చిన్నని అర్చారూపంలో వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఈస్వామి స్వరూపంలోనూ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. విగ్రహాన్ని రూపొందింపజేసిన భక్తురాలు దేవుబా పాటిల్ అప్పుడు తన ఇంట్లో ఉన్న ఓ క్యాలెండర్‌లోని వినాయకుడి రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా తయారు చేయాలని శిల్పులను అడిగిందట. ఆ క్యాలెండర్‌లోని గణేశుడు ముంబయిలోనే వాల్కేశ్వర్ ప్రాంతంలోని బన్గంగ ఆలయంలోని స్వామిరూపమది. ఈ ఆలయానికి అయిదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం ఇప్పటికీ ఉంది. ఇందులోని స్వామి కి ప్రతిరూపంగానే సిద్ధి వినాయకుడి అర్చామూర్తిని వీరు తయారు చేశారు. అయితే దేశంలోని మిగతా వినాయకుల కంటే ఈ వినాయకుడు ఒకింత భిన్నంగా కనిపిస్తాడు. చతుర్బాహుడైన ఈ వినాయకుడు పై రెండు చేతుల్లో కమలము, పరశువును పట్టుకుంటే కింది రెండు చేతుల్లో జపపాల, మోదకమును ధరించి ఉంటాడు. ఆయన ఎడమ భుజం నుంచి కుడివైపుకు సర్పరాజం ఉంటుంది. గణేశుడికి ఇరువైపులా విజయానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి అధిదేవతలు గా సిద్ధి, బుద్ధి దేవతలు ఉంటారు.
ఈ ఇద్దరు నూట ఇరవై అయిదు సంవత్సరాల క్రితం అక్కల్‌కోట్ స్వామి, రామకృష్ణ జంభేకర్‌లు ఈ స్వామిని దర్శించి ఇక్కడే గాయత్రి ఉపాసన చేసినట్లు చరిత్ర చెప్తుంది. జంభేకర్ మహరాజ్ మఠం ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు సాధారణంగా ఈ మఠాన్ని కూడా దర్శిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే అద్భుతమైన ధర్మశాల ఉంది. ఇందులో రాతితో నిర్మించిన దీపమాలలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా హనుమం తుడు ఉన్నాడు. ఆలయంలోనే ఒక పక్క హనుమంతుడి ఆలయాన్ని నిర్మించారు.

- జి. వెంకట్రావు 8885622196