Others

‘మనుచఠిత్ర ప్రబంధ దర్శన’ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ పుస్తకంమీద రాయటానికి నీకు అర్హత ఉందా?
- లేదని నేను అనుకుంటున్నాను. నేను తెలుగులో చదువుకున్నాను గాని తెలుగు చదువుకోలేదు. చిన్నపుడు ప్రబంధాలు చదివాను కాని అధ్యయనం చెయ్యలేదు. అధ్యాపనం చేసే వృత్తి కాదు. నేను పత్రికలలో చూసిన మేరకు- అచ్చుకు ముందరి సాహిత్యం చదివి ఆయా ప్రబంధాలలో, ఇతిహాసాలలో, నాటకాలలో విశేషాలను చర్చించేవారు. ఆయా గ్రంథకారుల ప్రతిభమీద రాసేవారు. వారి కాల నిర్ణయంపై అంతకన్నా ఎక్కువ రాసేవారు. ఆనాటి పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వచ్చేవి. ఇవి నేను పైపైన చూసేవాడిని. కందుకూరి ‘ఆంధ్రకవుల చరిత్రము’ ఈ రకమైన వ్యాసంగానికి నాంది. దానికి ముందు బ్రౌన్ కృషిని మనం మరువరాదు. ఇవన్నీ నేను శ్రద్ధగా చదవలేదు. పద్యగ్రంథాలు రాసాను. కాని పద్య రూప స్వారస్యం నేను గ్రహించలేదు. ఇవన్నీ చేసినవారిని పండితులు అనవచ్చు. నేను కాను. కనక నాకు అర్హత లేదని నా అభిప్రాయం.
* అయితే ఎందుకు రాస్తున్నావు?
- జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారబ్బాయి ‘మనుచరిత్ర ప్రబంధ దర్శనం’ అనే పారదర్శక విమర్శ గ్రంథం నాకు ఇచ్చినపుడు దాని గురించి రాయాలని కోరలేదు. ఆ మీదట వారు కోరినపుడల్లా నేను తాత్సారం చేస్తూ వచ్చాను. పుస్తకమిస్తే చదవటం నా బాధ్యత కనుక పైపైన ఆరంభించాను. తరువాత వారు, ‘మీరు ఆధునిక దృష్టితో రాయండి’ అని ఒకమారు మాటలలో అన్నారు. అది నన్ను కదిపింది. ఆధునిక దృష్టి అంటే ఏమిటి? ఈ ప్రశ్న నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ రకమైన పుస్తకానికీ, దీనిమీద రాయబోయే వ్యాసాలకీ పాఠకులెవరు? మరో ప్రశ్న. మలి ప్రశ్నకి నేను తొందరగానే సమాధానం ఇచ్చుకున్నాను. ‘పుస్తకానికి పాఠకులెవరు? రాయబోయేవారు ఎందుకు రాస్తారా?’ అన్నది నేను వదిలేసాను. నేను నా ఇటీవలి రాతలకు ఇచ్చుకుంటున్న సమాధానం ‘నేను అర్థం చేసుకోవటానికే రాస్తాను’ - అదే నాకు సమాధానం. తొలి ప్రశ్నకి జవాబు వెతుకుతూ ఈ పుస్తకం చదివాను. నోట్సు రాసుకున్నాను. రాయటానికి పూనుకున్నాను.
* ఈ పుస్తకంమీద నీ తొలి సమస్య ఏంటి?
- ఎలా రాయాలి? ఇది భిన్నమైన పుస్తకం. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి వేమన గ్రంథం ఇటీవల మా మిత్రులమధ్య చర్చకోసం చదవటం తటస్థించింది. దేనిమీద చర్చించాలి.. వేమన మీదనా? ఆయన పద్యాలనూ, వాటిలో వ్యక్తమయే అభిప్రాయాలనూ గురించా..? రాళ్లపల్లి వారి రచన గురించా? అన్నది ప్రశ్న. నేను ‘రాళ్లపల్లివారి గురించే! వారి ప్రతిభ గురించే..! వారి ప్రతిపాదనల గురించే..!’ అనుకున్నాను. ఇంచుమించు ఈ పుస్తకం దానిని పోలినది. కాని, దానికన్నా మరింత భిన్నమైనది.
* ఏ విధంగా?
- ఈ పుస్తకం అల్లసాని గురించి ఒక బలమైన ప్రతిపాదన చేస్తుంది. మనుచరిత్ర గురించి విశదీకరిస్తుంది. ఈ రెంటినీ చేయటానికి మనుచరిత్రపై తత్పూర్య గ్రంథాలనూ వ్యాసాలనూ ఆధారం చేసుకుంది. వాటిలో అల్లసానిపై మనుచరిత్రపై చేసిన ప్రశంసనీ, విమర్శనీ, కొండొకచో అభిశంసనూ, జొ.రా.శ వివరించారు, వాదించారు, ఖండించారు. అవసరమైన ఆధారాలు చూపారు. సహేతుకతని పాటించారు. సహనాన్ని ప్రదర్శించారు. ఇలాంటి పుస్తకంపై నేను శర్మగారి గురించి రాయాలా? మను చరిత్ర అల్లసాని పెద్దనల గురించా? పూర్వవాదనల గురించా? వాటిపై వాదనల గురించా?
* నువ్వేం నిశ్చయించుకున్నావు?
- జొ.రా.శ గారు మనుచరిత్రపై లోగడ వచ్చిన వ్యాసాలన్నీ ఒకచోటికి చేర్చి ఒకమారే వాటిని పరిశీలించి ఈ పుస్తకం రాశారా? లేక అపుడపుడు వచ్చిన వ్యాసాలకు ఆయన పత్రికలలో ప్రతిపాదన చేసేవారా? వాటినన్నిటిని ఈ గ్రంథంలో సంకలనం చేసారా? లేక ఈ పుస్తకం ఒక పథకం ప్రకారం రాసారా? ప్రబంధాన్ని వివరిస్తూనే తన ప్రతివాదనలతో వాటిని వినియోగించుకున్నారా? ఈ పుస్తకంలో ఆ సమాచారం లేదు. ఏమైనా ఈ గ్రంథంపై వారు వెచ్చించిన సమయం పెద్దన స్వారోచిష మనుసంభవం లిఖించటానికి పట్టిన సమయం కన్నా ఎక్కువనే నేను అనుకుంటున్నాను.
* అల్లసానివారు తమ గ్రంథానికి ఎంత సమయం వెచ్చించి ఉంటారు?
- కచ్చితంగా చెప్పలేం. అయినా ఉచితమైన ఊహ చెయ్యవచ్చు. నేటి గ్రంథ నిర్మాణం విధానానికీ నాటికీ పోలిక ఉండే అవకాశం లేదు. ఊటకలం వేళ్లతో పట్టుకుంటాం. గంటం చేతిలో బిగించి పట్టుకునేవారు. అక్షరం ఎడతెగకుండా కలంతో రాయవచ్చు. గంటంతో చెక్కవలసి వుంటుంది.

ఇంకాఉంది