Others

మృత్తికాప్రసాదం ... వ్యాధులు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ దేవాలయాల్లో కట్టెపొంగలి, చక్కెర పొంగలి, ఆఖరికి చక్కెర గుళికల లాంటివి ప్రసాదంగా పెడుతుంటారు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్లో అందునా కుక్కే సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దగ్గర ఉడిపి సమీపంలో ఉన్ననాగబనగహళ్లి లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోను మృత్తికాప్రసాదం ఇస్తుంటారు. అంటే వారు అక్కడికి వచ్చిన భక్తులకు పుట్టమన్నును ప్రసాదంగా ఇస్తుంటారు.
సాధారణంగా కార్తీకంలోనైనా, శ్రావణంలోనైనా నాగుల చవితి వస్తే పుట్టలో పాలు పోసి నాగుపాము పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేటపుడు ‘నూక నీవు తీసుకొని మాకు మూకను ప్రసాదించుము స్వామీ’ అంటూ పుట్టపై నూకను చల్లుతారు. ఆపై ఆ పుట్టమన్నును తీసుకొని వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదంగా చెవులకు, పొట్టకు పూసుకొంటారు. చిన్నపిల్లలకు మరీ ప్రత్యేకంగా ఈమట్టిని పూస్తారు. పెద్దవారు కూడా ఈ మట్టిని చెవులకు, పొట్టకు పూసుకొంటుంటారు. ఇలా చేయడం వల్ల వినికిడి శక్తి కలుగుతుందని, వినికిడి శక్తి ఉన్నవారికి చెవికి సంబంధించిన ఏ వ్యాధులు కలుగ కుండా ఉంటాయని , ఉదరానికి పూసుకోవడం వల్ల ఉదర సంబంధ వ్యాధులు కానీ లేక పాము వల్ల కానీ మరేఇతర విషప్రభావాలు మృత్తికా ప్రసాదం తీసుకొన్నవారిపై పని చేయవని సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ భక్తులు అంటుంటారు.
అట్లానే ఈ సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో కూడా మృత్తికాప్రసాదం ఇస్తుంటారు. ఈ ప్రసాదాన్ని తీసుకొన్నవారికి ఏ రకమైన విషప్రభావాలు పని చేయవు. నాగ జాతి వల్ల ఏ ప్రమాదమూ వాటిల్లదు. ఎవరికైనా కలలో పాములు కనబడి భయపడుతుంటే వారికి అటువంటి దుస్వప్నాలు కలుగవు..
మృత్తికాప్రసాదానికి అంతే మోతాదులో పసుపు చేర్చి దానిని స్నానం చేసేటపుడు శరీరానికి రాసుకుంటే వివాహం ఆలస్యమయ్యేవారికి తొందరగా వివాహ యోగ్యత కలుగుతుంది. అతిగాను, అర్థం పర్థం లేకుండా మాట్లాడేవారికి ఆ అతివాగుడు తగ్గి వారు మంచి బుద్ధిమంతులు అయ్యేటట్లు చేసే శక్తిని కూడా ఈమృత్తికా ప్రసాదాన్ని కొబ్బరి నూనె లో కలిపి ఆ నూనెను తలకు పెట్టుకుంటే కలుగుతుంది.
పిల్లలకు వంటికి పూయడమో లేక కాసిని నీళ్లల్లో వేసి ఆ నీటిని తేర్చి ఆనీటిని తీసుకోవడం లాంటి పనులు చేస్తే బాలారిష్టదోషాలు తగ్గిపోతాయి.
ఋతుశూల కూడా ఈ మృత్తికాప్రసాదం పూసుకోవడం వల్ల తగ్గిపోతుంది. ఎవరికైనా జ్ఞాపకశక్తి పెరగాలంటే మృత్తికాప్రసాదాన్ని కాసిని నీళ్లల్లో కలుపుకుని ఆ నీటిని తేర్చుకుంటూ అపుడపుడు తాగుతూ ఉంటే వారికి జ్ఞాపకశక్తి బాగా వృద్ధి అవుతుంది. నాగఫణి రోగాన్ని కూడా ఈ మృత్తికా ప్రసాదం వల్ల దూరం చేసుకోవచ్చు. కనుక ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్లినపుడు కోరి మృత్తికాప్రాసాదాన్ని తీసుకొని కష్టాలను దూరం చేసుకోండి.

- ఆర్. పురందర్