Others

ఓర్పు నేర్పుల కూరిమి ఈ కాంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అందమై ఆనందకందమై అమృతని
ష్యండమై మిగల నింపొందునెద్ది?
తల్లియై గారాల చెల్లియై రాగాల
వల్లియై తానుల్లసిల్లునెద్ది?
మహితయై వైదుష్యసహితయై అభిమాన
విహితయై మహిలోన వెలయు నెద్ది?
శక్తియై వ్రతకృతాసక్తయై త్యాగాను
రక్తయై ఎనలేక గ్రాలు నెద్ది?
నారిలేనట్టి విల్లును నారిలేని
ఇల్లు వ్యర్థంబనంగ రాజిల్లు నెద్ది?
ఓర్పు నేర్పుల కూర్పుతో నొప్పు నెద్ది?
అద్ద్భిరత శుభకాంతి అది పడతి?

- రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287