Others

ఆనంద స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరవధిక ఆనందమే శ్రీకృష్ణుని స్వరూపమని భాగవతం ఉపదేశించిన సత్యసూక్తి. కృష్ణ్భక్తులైన గోపభామినులు శ్రీకృష్ణుని స్వరూప స్వభావాదులను బాగా తెలుసుకొనియే ప్రేమించారు.
సాంసారిక నియమాల్లో సుఖాన్న అనుభవించువాడు ఇష్టమున్నా లేకపోయినా దుఃఖమును కూడా అనుభవించవలసిందే. కానీ ఆనందాన్ని అనుభవించేవాడు ఎన్నటికీ దుఃఖాన్ని పొందడు. శ్రీకృష్ణుడు దుఃఖాన్నివ్వడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు కనుక ఆనందానే్న ప్రసాదిస్తాడు.
ఉపనిషత్తుల్లో
ఆనందో బ్రహ్మేతి వ్యజానత్
ఆనందాత్ ఏవ ఖల్విమాని భూతానిజాయనే్త
ఆనందేనైవ జీతాని జీవన్తి అంటూ ఆనందం అంటే శ్రీకృష్ణుడే అని వర్తించాయి. శ్రీకృష్ణుడు ఉదార స్వభావం గల వాడు. ఆయన ఇవ్వడం ప్రారంభిస్తే ఏమాత్రం సంకోచం లేకుండా ఇస్తాడు. సుఖాపేక్ష కల్గినవాడు ఒకానొక స్ర్తి వద్దకుగానీ పురుషుని చెంతకు గానీ వెళతాడు. సుఖముగాక ఆనందమే కోరే వాడు భార్య భర్తనుమనస్సుతో త్యజించి పరమాత్ముని చరణముల చెంతకు వెళ్లి శరణాగతుడు అవుతాడు.
గోపికలబుద్ధి పరమాత్మ తో బంధింపబడి ఉన్నది. ఏకమై పోయింది. వియోగ వేళల్లో కూడావారి బుద్ధి బంధింపబడి ఏకరూపాన్ని పొందింది. సంయోగములో ఒక్కోసారి భావం మార్పు చెందినా చెందవచ్చును. కానీ వియోగమునందు అందరి భావములు ఒక్కటే.
గోపికలు కృష్ణునే భర్తగా దలిచారు కాన ‘నాథా! దయితో మమ్ములను అనుగ్రహించి శిరస్సున ఈ హస్తమును నుంచు’మన్నారు. అనగా శిరస్సులోపల ఉన్న మా బుద్ధి మీకు అర్పింపబడింది. దీనిని స్వీకరించండి అని వేడుకున్నారు వారు.
భగవంతుని అభయహస్తమే ఆయన అనుగ్రహానికి ప్రతీక. ఆయన కరుణాలనిలయమైన ఆ హస్తము శిరస్సుపైన నిల్చినపుడు మాత్రమే బుద్ధి బాగుపడుతుంది. దాన ధర్మాలు, తీర్థయాత్రలు పరోపకారాలు చేసినందువల్ల బుద్ధి బాగుపడుతుంది అనుకోవడం వెర్రి.
యజ్ఞయాగాదులు చేసినా బుద్ధి కుదుటపడదు. ముఖ్యంగా మహాపురుషులెవరైనా శిరస్సున హస్తముంచినపుడు బుద్ధి బాగుపడుతుంది. సద్గురువు అనుగ్రహించినపుడు మంచి శిష్యుని తలపై హస్తముంచి ఆశీర్వదిస్తాడు. సకల శ్రేయాలు అతనికి సిద్ధిస్తాయి. సద్గురువు శ్రీకృష్ణుడే. ఆయనే జగద్గురువు. ఆయన కనికరించినపుడే మాయ అనే యవనిక తొలిగిపోతుంది.
కావున జప, తప, సత్కర్మల ద్వారా మనస్సులో ఇంద్రియాలలో ఉన్న కామాన్ని నశింపచేసి సద్గురు చరణములను జీవుడు ఆశ్రయింప వలసి ఉంటుంది. నిష్కామ పురుషుడు శిరస్సును తన హస్తముతో స్పర్శించినపుడే మన బుదిధ నుండి కామ భావన తొలిగిపోతుంది. భగవంతుని సహ్తం నాలుగు పురుషార్థములను ప్రసాదిస్తుంది. ఈ కారణం చేతనే గోపిక ఒకటే ఆయన హస్తమునకు నాల్గు విశేషణములనుతెల్పుతుంది.
విరచితాభయమ్‌అనగగా ధర్మపురుషార్థమును అనుగ్రహించే శక్తి శ్రీకృష్ణుని హస్తమున కలదు.
శ్రీకరగ్రహమ్ అంటే భగవంతుని హస్తము ధనాన్ని లేదా అర్థాన్ని కూడా ప్రసాదిస్తుంది.
కామదమ్- అంటే పరమాత్ముని వరదహస్తము కామమును కూడా అందిస్తుంది.
కరసరోరుహమ్ అంటే మోక్షపురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షములను శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడు.
గోపిక పరమాత్ముని తో నాథా! నాకు మరే కోరిక లేదు. నేను మీకు శ్రమ కల్గించాలని కూడా అనుకోవడం లేదు మిమ్ములనే ఆశ్రయించాను. నా బుద్ధి బాగుపడుటకు నా శిరస్సున మీ హస్తమును ఉంచమని కోరుకున్నది.

- పి.వి. సీతారామమూర్తి 9490386015