Others

మనుచరిత్ర ప్రబంధ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారదర్శక విమర్శ
*
ఆమె ఆయనను తనతో సుఖించమంది. వాదాల వల్ల లాభం లేదని వరూధిని ఆయనని ఆక్రమించబోతే ఆయన తప్పించుకొని అగ్నిస్తుతిచేసి ఇంటికి చేరుకొన్నాడు. అదంతా గమనిస్తూ వరూధినిని ఆశించి ఉన్న గంధర్వుడు ఇప్పుడా ప్రవర శరీరాగ్ని తేజాన్ని శాంబరీ విద్యచే సంగ్రహించి వరూధిని మరులు తీర్చి, చూలు నిల్చిన తర్వాత మెల్లగా తప్పుకున్నాడు. అలా వరూధిని విప్ర-గంధర్వ ప్రవరుల వెలుగొందిన ఆ అగ్నితేజమే కుమారుడై పుట్టిన తర్వాత, అతనిని అక్కడే వదలి ఆ తల్లీ తనదారిని పోయింది. మునులు ఆ బాలునికి స్వరోచిగా నామకరణా ది సంస్కారాలన్నీ జరిపించి విద్యలు నేర్పించగా ఆటవిక జన ప్రభువై విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన నగరం ఏలుకుంటూ వేటకు వెళ్లి అనంతరం మనోరమను కలవటం గా మొదలైన కథ మనం తెలుసుకొనే ఉన్నాం. ఆ మహారాజు మహత్తుకి విప్ర - గంధర్వ ప్రవరుల్లో విప్రుడు గుణశీల ఔదార్యాది సంపత్తితో ఆరాధించి అగ్నితేజుడై వెలుగొందితే (శాంబరీ విద్యవల్ల) రూపాంత రాన గంధర్వుడదే అగ్నితేజాన్ని సంగ్రహించి అదే వరూధినీ గర్భాన కుమారుడై పుట్టటానికి కారకుడయ్యాడు. అంతగా అగ్నిదేవుని సన్నిహితం చేసుకోగలిగిన బ్రాహ్మణ ప్రవరాఖ్యుని మచ్చలేని జీవనక్రమం మనలో ముద్రపడి పోవాలని (అందుకు తగ్గట్లు) తన ప్రబంధాన్ని ఆ మహనీయుని వైశిష్ట్య ప్రభా ప్రాభాతారుణో పాసనారంభంగా చేసి పెద్దనార్యుడు అనుకొన్నది నూటికి నూరుపాళ్లూ నెఱవేర్చాడు. ఆ స్వరోచి మాహాత్మ్యానికి అగ్నితేజం మూలం అయితే, నిత్యాగ్నిహుత్రీ వనంలోనే యజ్వా అయిన ప్రవరాఖ్యుని గుణసంపత్తితోటి నిష్ఠాగరిష్ఠమైన అగ్న్యుపాసనా యోగ్యత చేత తాదాత్మ్యం పొందినందుకా బ్రాహ్మణుని యందు నిలిచిందా ‘తేజం’. ప్రవరాఖ్యుని యోగ్యత ఏపాటిదేమిటి అనవచ్చు. అవటానికి వైదిక మార్గ సామాజిక నియమాల గాడిన పోతున్న సామాన్య బాపన గేస్తే. కనుక మనం ఆ క్రమంలో పరిశీలిద్దాం.
1.ఏమైనా ఆయుర్వేద (ఔషధ) విద్యాపారీణుడా? కాకపోవచ్చు. కాని, తన విద్యాగర్వంతో (్ధనమదాంధుడనే వర్గ్భేదాన్ని పాటించి) విద్యనర్థించి వచ్చిన వాళ్లని నిందా లాపాలాడీ, శపించీ అధ్యయన తత్త్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడు కాడు. హిమాద్రికి పోయిన ఒక్క ప్రొద్దుకే విద్యార్థులని తలచి ‘‘గెడదోడు నీడలై క్రీడించుసచ్ఛాత్రు లింతకు నెంత చింతింతురొక్కొ’’ అని బాధపడ్డ సదుపాధ్యాయుడు. స్వాధ్యయన తత్పరుడు.
2. ఏమైనా మహాతపస్వియా! అంటే బూచిగాడిలా గడ్డాలూ మీసాలు పెంచుకొని ఒక ‘బాల’ స్పర్శకే ఘోరంగా శపించీ దండించీ ఇంకా శాంతి పొందక చెలులని సైతం శపించే క్రోధనుడు మాత్రం కాదు.
‘శమంబు దమముంజెల్వంబులు గలిగి తలిదండ్రుల దేవియుం దేవరవోలె’ చూసుకుంటూన్న అభ్యాగత సేవాపరతంత్ర సకల జీవనుడైన తరుణాగ్నిహుత్రి. సిద్ధాప దేశంబున మంచుకొండకు వెళ్లి తన బుద్ధి జాడ్యజనితోన్మాదాన్ని తిట్టు కున్నాడే గాని పాదలేపనానికి ఇలా కరిగిపోయే గుణం ఉందని చెప్పకపోయిన సిద్ధుని నిందింపడు. ప్రయోజనం ఉండదని తెలిసినా నోటి దురుసుతనం అంటూ ఉంటే ఊరుకోనీయదు గదా! చివరికి హేతు పూర్వకంగా తన నిరాసక్తతని ఎంతసూటిగా చెప్పినా అంతా తుంగలో ద్రొక్కి మీదపడి ఆక్రమింప బోయిన వరూధినినైనా నిందించటం కాదుగదా ఆమె పరంగా అసలు నోరు మెదపక ‘హా శ్రీహరీ’ అంటూ తను మాత్రం తప్పించుకు పోయిన ధీరశాంతుడు.
ఇంకాఉంది

- జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ 9440037258