Others

అంతా బ్రహ్మమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ ఏమిటో తెలుసుకోవాలన్న తపన కొందరికి వుంటుంది. వారిని జిజ్ఞాసు అంటారు. బ్రహ్మను గురించి తెలుసుకోవటాన్ని బ్రహ్మ జిజ్ఞాస అంటారు. బృహత్ నుంచి బ్రహ్మ వచ్చింది. బృహత్ అంటే గొప్పది అని అర్థం. అంతకుమించినది ఏదీ లేదని చెప్పవచ్చు. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’నన్న అన్నమయ్య కీర్తన అందరికీ తెలిసిందే.
బ్రహ్మకు నానార్థాలున్నాయి. పరమాత్మ, వేదం, సత్యం, తపం. అసలు ఈ బ్రహ్మమేమిటో అర్థం చేసుకోవటానికి పూర్వపక్షంగా ‘అథాతో’ అన్న ప్రయోగం చేశాడు సూత్రధారుడు. బ్రహ్మసూత్ర రచనను ‘అథాతో బ్రహ్మజిజ్ఞాసా’ అని మొదలుపెట్టాడు సూత్రకారుడు వేదవ్యాసుడు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను కలిపి ప్రస్థానత్రయి అంటారు. ఇవి వేదార్థాలను తమదైన బాణిలో తెలియజేస్తాయి.
‘అథాతో’ అంటే ఆపైన లేక ఒక అర్హత కలిగాక బ్రహ్మ గురించి ఆలోచించటం మంచిది. పిజికి పూర్వం డిగ్రీ అయినా కనీసం కావాలి కదా! సాధనా సంపత్తి కలిగి వుండాలి. వివేకం, వైరాగ్యం, షట్కం (శ్రమం, దమం, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధి), ముముక్షత్వం- ఈ నాలుగింటిని కలిపి సాధనా చతుష్టయం అంటారు. వివేకం అంటే ఆత్మ- అనాత్మల మధ్యనవున్న భేదాన్ని తెలుసుకోవటం; ఇది మొదటి మెట్టు. వైరాగ్యం అంటే తాత్కాలికమైన విషయాలపట్ల నిరాసక్తత. ఇది రెండవ మెట్టు. షట్కం ద్వారా బాహ్య, అభ్యంతర ఇంద్రియాలపైన పట్టు బిగించటం మూడవ మెట్టు. చిట్టచివరిగా, మోక్షం పొందాలన్న కోరిక కలగటం ముముక్షత్వం.
ఉపనిషత్తులు బ్రహ్మాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అంటున్నాయి. శ్రుతుల ద్వారా బ్రహ్మజ్ఞానం పొందటానికి బ్రహ్మసూత్రాలు వ్యాసులవారే వ్రాశారు. ఆత్మాబ్రహ్మమే; దాని చైతన్య స్వరూపమే ఈ విశ్వమంతా. బ్రహ్మ ఒక్కడే అంటున్న అద్వైతవాదానికి ఈ ఏక సూత్రమే పునాది. ఈ విశ్వమంతా ఈశ్వరమయం కాబట్టి అదీ బ్రహ్మమే కదా అంటారు వేదాంతులు. కంటిలోనూ బ్రహ్మ, మింటిలోని సూర్యుడిలోను బ్రహ్మమేమన్నా, వాటికి ఆ జ్ఞానం లేదు.
ఆకాశం బ్రహ్మ; ఆనందం బ్రహ్మ. కాని అందుబాటులో లేదు. పంచభూతాలలో ఒకటి అయిన ఆకాశం కాదు. బ్రహ్మ అంటే దహర (సూక్ష్మ). ఆకాశం అంటారు ఆత్మవిదులు. బ్రహ్మజ్ఞానులకు చాలా సూక్ష్మమైన దృష్టి వుంటుంది. ప్రాణం అంటే మనం పీల్చే ప్రాణవాయువు కాదు; ముఖప్రాణ. వైశ్వానరుడు అంటే అగ్నిహోత్రుడు కాదు; అన్ని జీవరాశులను వెలిగించే కాంతి. లోపల, బయట సంచరించే అంతర్యామి. దీపాన్ని జ్యోతి అని, గాయత్రిని మంత్రం అని చెప్పుకుంటున్నాం. నిజానికి జ్యోతిహరం జోతి; గాయత్రి- సూర్య సవితి. బ్రహ్మ కడిగిన పాదమూ అని ఆలపించాడు అన్నమయ్య. ఒక పాదం విశ్వభూతాలకు, మూడు పాదాలు దేవతలకు ఇచ్చిన ఆ బ్రహ్మను ‘చతుష్పాద్’ అంటారు. బ్రహ్మను గురించి తెలుసుకోవాలన్న తీవ్రమైన ఆరాటానికి వెనుకటి జన్మలో మనం సాధించిన కర్మఫలం కారణం. సత్ సంస్కారబలంవల్ల పూర్ణత్వం వైపు సాగాలని, పరిపూర్ణమైన బ్రహ్మను ఉపాసించాలని ఆకాంక్ష మనలో రగులుతుంది. ఆధ్యాత్మిక విద్యపట్ల ఆసక్తి మెండు అవుతుంది. కంటితోని సూర్యుణ్ణి చూడగలగటం అక్షిపురుష విద్య, ఆజ్ఞాచక్రంలో ధ్యానావస్థలో అవిముక్త బ్రహ్మను దర్శించటం యోగవిద్య. అవిముక్త బ్రహ్మ ప్రదేశమాత్రుడై కనిపిస్తాడట. అందుకే, బ్రహ్మాది దేవతలకు సాధ్యంకాని బహ్మానుభూతి ధ్యానయోగికి కలుగుతుందని గీతామాత చెబుతున్నది. ఆ ఆనందానుభూతే బ్రహ్మం! అంతా బ్రహ్మమయం అన్న ఎరుకే నిశ్చలానందానికి మూలాధారం! హితాత్మ (మనిషి) ప్రజ్ఞాత్మను (బ్రహ్మను) ఉపాసన ద్వారా తెలుసుకోవాలని ఇంద్ర-ప్రతర్థన సంవాదం తెలియజేస్తున్నది.
బ్రహ్మసత్యం- జగత్తు మాయ అన్న మహావాక్యం చివరికి లౌకికసత్యం కూడా అంగీకరించింది. మిథ్యావాదం మాయామంత్రంతో సంధి కుదుర్చుకున్నది. నాణేనికి బొమ్మా బొరుసు లాంటివే సగుణ నిర్గుణాలు. సగుణోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మను సాధించటం సులభం. బాటసారికి నది దాటేవరకే నావతో పని. క్రమంగా వస్తు ప్రాధాన్యత తొలగించుకుంటే అంతా బ్రహ్మమే అవుతుంది. అస్తిత్వం, ఆకలి జీవ ధర్మాలు. భూమాన్ (బ్రహ్మ)కు దివ్యదృష్టి అమృతరూపం ధర్మాలు అటారు అస్మరాథ్యాచార్యులవారు.
వేదాంత సూత్రాలు శ్రుతిసమ్మతాలు. తుది నిర్ణయం వాటికే వదిలేయాలి. మట్టి ఒకటే కానీ కుండలు వేరు వేరు రూపాలలో తయారవుతాయి. బంగారం ఒకటే అయినా నగలు నానావిధాలుగా కళ్లు జిగేల్ అనిపిస్తాయి. కంటిముందున్న రూపరేఖా విలాసాలు కాదని కాలదన్నలేం కదా!
భేదా భేదవాదం అవరోధాన్ని సూచిస్తున్నది. స్వస్వరూపభేదం కాదనలేనిది. సముద్రంలో చెలరేగే అలలు, తేలాడే నీటి బుడగలు. వెండి అంచులా ఆవరించే నురగను కలిపి సముద్రం అంటున్నాం. జగమంతా జగన్నాథుడి లీలావిలాసం కాదనలేనిది. కారణం లేనిది కార్యం జరగదు. సర్వజ్ఞత, సర్వశక్తులు ఆ బ్రహ్మకే చెందుతాయి. సమన్వయం సాధించి జ్ఞాననేత్రం తెరిపించటానికే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వున్నాయి. త్రరుూసతి (వేదమాతకు) ప్రస్థానత్రయికి అవినాభావ సంబంధం వుందన్నమాట నిజం!

-నిరామయ 040-24554653