Others

అందానికి అడ్డం.. చిన్ని గడ్డం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి ఒక ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు నా దగ్గరికి సలహా గురించి వచ్చాడు. చిన్ని మీసం, పొడుగైన గడ్డం. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గడ్డం తీరు వున్న అతడ్ని చూసి ‘చెప్పండి’ అని నేనడిగాను. ‘నా మీసం గడ్డం తీయించేసుకుందామనుకుంటున్నా’ అని అన్నాడు. ‘మాది మంగలి కొట్టు కాదు, కోతల కొట్టు’ అని నేను చెప్పా. ‘నాకా విషయం తెలుసు డాక్టర్. నేను ఇంత పెద్ద గడ్డం పెంచుకోవడానికి దాన్ని తీయించుకోలేక పోవడానికి వెనక ఒక రహస్యం ఉంది’ అని తన జేబులోంచి ఓ ఫోటో తీసి నాకు చూపించాడు. ఆ ఫోటోలో తనకి మీసం, ఇంకా గడ్డం లేవు. ఆ ఫోటో చూడగానే నాకు అర్ధమైంది ఆ రహస్యం ఏమిటో, తన ప్రాబ్లమ్ ఏంటో. తన ప్రాబ్లమ్ తన చిన్ని గడ్డం (ఎముక భాగం). తన గడ్డం ఎముక చాలా వెనక్కి ఉంది. దానివల్ల తన మొహం అందంగా లేదు. ఆ చిన్ని గడ్డాన్ని కప్పిపుచ్చుకోవడానికి తను ఆ జట్టు గడ్డాన్ని పెంచాల్సివచ్చింది. ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఆంగ్లంలో ష్ఘశ్యఖఔ్ఘ్ళ అంటారు.
మరోసారి ఓ 18 ఏళ్ల అమ్మాయిని వాళ్లక్క తీసుకొఛ్చింది. వాళ్లక్క ముందు ఈ అమ్మాయి చాలా వౌనంగా కూర్చుంది. పెదవి విప్పలే! ఇది గ్రహించి వాళ్లక్కని కొంచెం సేపు బయట కూర్చోమన్నా. వాళ్లక్క బయటికి వెళ్లగానే ‘ఏంటమ్మా నీ దిగులు’ అని నేనడిగా. అడిగిన అయిదు నిముషాలకి ఆ అమ్మాయి తల పైకెత్తి ఇటు అటు కెమెరాలు ఉన్నాయేమో అని చూసింది. ఇది గ్రహించిన నేను ‘్భయపడకు! ఇక్కడ ఏ కెమెరాలు లేవు’ అని చెప్పా. అప్పుడా అమ్మాయి ‘నేను సరిగ్గా చదవలేక పోతున్నా డాక్టర్. అందుకే మొన్నటి పరీక్షల్లో తప్పా’ అంది. ‘ఎందుకు చదవలేకపోతున్నావని’ నేనడిగిన ప్రశ్నకి ఆ అమ్మాయి ‘నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకొక్కదానికే లేరు. నా మొహం వింతగా, వికారంగా ఉంటుంది అందుకే ఏ ఆబ్బాయి నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నా స్నేహితులంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు’ అని చెప్తూ బోరున ఏడ్చేసింది.
ఈ అమ్మాయి పరీక్ష తప్పడానికి కారణం చదువురాక కాదు. చదవలేక. దానికి కారణణం తన చిన్ని గడ్డం. దానివల్ల తన ముఖం బాగా లేదని తన బాధ. ఈ మానసిక బాధ వల్ల ఆమె చదువుపై ఏకాగ్రత చూపలేకపోతున్నది. గోడమీదున్న స్విచ్ వేస్తే రూఫ్‌కి తగిలించిన ఫ్యాన్ తిరిగినట్టు అందంగా లేనని ఈ అమ్మాయ పడుతున్న బాధ, ఇంకెక్కడో దాని ప్రభావం చూపుతోంది. అది ఆమె చదువుమీద. చాలాసార్లు మనం సమస్యకి మూలం కనిపెట్టలేకో, తప్పుగా కనిపెట్టో తప్పుడు సూచనల్ని, తప్పుడు ప్రయత్నాల్నీ చేస్తుంటాం. దానివల్ల మనకు ఫలితం దొరకదు. మూలం దొరికితే పరిష్కారం దక్కినట్టే. ఈ అమ్మాయి మానసిక బాధకి మూలం తాను అందంగా లేనన్న ఆమె ఫీలింగ్. ఈ అమ్మాయి అందానికి అడ్డం ఆమె చిన్ని గడ్డం. ఈ అమ్మాయ గడ్డానికి ఆపరేషన్ చేస్తే ఆమె గ్రాడ్యుయేషన్ డిస్టింక్షన్‌లో పాసైంది.
చాలామంది ఇలా చిన్న గడ్డం ఉన్నవారు పోటోలు దిగినపుడు తమ కింది దవడను ముందుకు తెచ్చి ఫోటో దిగే ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల తమ గడ్డం కొంచెం ముందుకు వచ్చి మొహం ఫోటోలో బాగా పడుతుందని వాళ్ల నమ్మకం. అలా కీలక సన్నివేశాల్లో చేసి చేసి అది ఓ వ్యసనంలా మారుతుంది. వారికి తెలియకుండానే వారి కింది దవడ కీలక సందర్భాల్లో ముందుకు వచ్చేస్తుంటుంది. వారి జ్ఞానం లేకుండానే వారి ముఖం రూపురేఖలు ఇలా మారి మారి కొంతకాలానికి వారి అసలు ముఖం ఎలా ఉంటుందో వారు మరిచిపోతారు. పవన్ కల్యాణ్ జల్సా సినిమాలో సిరివెనె్నల రాసినట్టు ‘రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం’ అన్నట్లుగా తయారవుతారు. కొంతమందిలో ఇలా కింది దవడ ముందుకొస్తే ఎత్తుపళ్లున్న వారిలో పెదాలు దగ్గరగా వచ్చి వాళ్ల ఎత్తుపళ్లు కనపడకుండా కప్పేస్తాయి. మన అందానికి అడ్డంగా వున్న కారణాల్ని మన మనస్సు మనకి తెలియకుండానే కప్పిపుచ్చే ప్రయత్నమే ఇది.
చిన్ని గడ్డం లేక దవడ ఎందు వస్తాయి? గడ్డం లేక దవడ ఎముక సరైన మోతాదులో పెరగకపోతే ఇలా చిన్ని గడ్డం, వెనుకకి వున్న దవడ వస్తాయి.
ఎవరిలో పెరగవు? ఫోర్‌సెప్స్ డెలివరీ, పెరుగుతున్న సమయంలో గడ్డానికి గాని దవడకి గానీ దెబ్బ తగిలితే, పుట్టుకతో వచ్చే కొన్ని లోపాల్లో పెరగవు.
దీనికి చికిత్స: మొదట గడ్డం మాత్రమే చిన్నదిగా ఉందా లేక కింది దవడ మొత్తం వెనక్కి ఉందా అని నిర్ధారణ చేసుకోవాలి. దీనికి చికిత్స ఆపరేషన్ ఒక్కటే. 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆపరేషన్ చేయకూడదు. అలా కాదని ఆపరేషన్ చేస్తే వారి ఎదుగుదలని మనమే ఆపిన వాళ్లమవుతాం. మొత్తం ఎదుగుదల అయ్యాక గడ్డం లేక దవడ ఎంత వెనక్కి ఉందో మనకి కచ్చితంగా తెలుస్తుంది. దాన్నిబట్టి ఎంత ముందుకు తెస్తే అందంగా వుంటుందో అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు.
గడ్డాన్ని ఎలా ముందుకు తెస్తారు? గడ్డాన్ని కోసి ముందుకు తెచ్చి అక్కడ నిలుపుతారు. అలా వద్దనుకుంటే మన శరీరంలోని వేరే ప్రదేశంలోంచి ఎముకని తీసి గడ్డం మీద అతికిస్తారు. అప్పుడు గడ్డం ఎత్తుగా కనిపిస్తుంది. వేరే చోటినుంచి ఎముకని తీయడం ఇష్టంలేకపోతే మార్కెట్‌లో ఎత్తునిపెంచే ఇంప్లాంట్స్ దొరుకుతాయి. వాటిని వాడతారు.
కింది దవడ మొత్తం వెనక్కి ఉంటే..? అప్పుడు కింది దవడని కోసి మొత్తం ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. పై దవడిని దృష్టిలో పెట్టుకుని కింది దవడని ముందుకు తెస్తారు.
ఆపరేషన్‌వల్ల మొహంమీద గాట్లు వస్తాయా? మొహం మీద ఒక్క గాటు కూడా ఉండదు. ఆపరేషన్ ఆంతా నోట్లోంచి, పంటి చిగుర్లుకింద నుంచి చేస్తారు.
ఆసుపత్రిలో ఎన్నిరోజులుండాలి? ఇది టెస్ట్‌మ్యాచ్ కాదు ఆసుపత్రిలో ఎక్కువ రోజులుండడానికి. ఇది టి20 మ్యాచ్. కొన్ని గంటలుంటే చాలు, పొద్దున్నవచ్చి సాయంత్రం వెళ్లిపోయే ఆపరేషన్ ఇది.
ఆపరేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? రెండునుంచి మూడు గంటలు. మనిషిని మొత్తం మత్తులోకి పంపి చేస్తారు.
దీనివల్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకటే సమస్య ఉంది. ఆపరేషన్ తరువాత మీ ఫ్యాన్స్ ఎక్కువైతే అది మీ ఏకాంతానికి కొంచెం ఇబ్బంది కావచ్చు. అంతకు మించి ఇంకేం లేవు.
తిరిగి సాదా జీవితానికి రావడానికి ఎన్నిరోజులు పడుతుంది? 3నుంచి 5 రోజులు వాపు ఉంటుంది. 4నుంచి 6 వారాలు గట్టిపదార్ధాలు తినకూడదు. దవడ మీద గానీ, గడ్డంమీద కానీ ఎక్కువ బరువు పడనీయకుండా చూసుకోవాలి. ఇంటి పనులు నాలుగోరోజు మొదలెట్టవచ్చు. కాలేజీ లేక ఉద్యోగం వారం తర్వాత.
కొసమెరుపు: ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం బుగ్గలు, పెదాలు, గడ్డం ముందుకు వుంటే వారు మంచి అందం కలవారని నిపుణుల నమ్మకం. దీన్ని శఆజఘషళ ళ్యశషళఔఆ అంటారు. చాలా మంది సినీతారలు ఈ కానె్సప్ట్‌ని ఫాలో అవుతారు.
*

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615