Others

అక్షర సేవలో రైల్వే పోలీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ పిల్లలతో కనిపిస్తున్న ఇతని పేరు ప్రవీణ్ కుమార్. బీహార్‌లోని గయా రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసుగా విధులు నిర్వహిస్తాడు. పోలీసు అంటే కరకు గుండె అని అనుకుంటారు. కాని ఈ యువ రైల్వే పోలీసు అలాంటి కోవకు చెందినవాడు కాదు. రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే అక్కడ ఫ్లాట్‌ఫామ్స్ మీద ప్లాస్టిక్ సీసాలు, చిత్తుకాగితాలు సేకరించే పిల్లలకు అక్షరాలు నేర్పిస్తూ టీచర్ అవతారమెత్తాడు. ఈ పిల్లలంతా గయాలోని మురికివాడల్లో నివశిస్తుంటా రు. వీరు స్టేషన్‌లోని పట్టాలపై వేసే ప్లాస్టిక్ సీసాలను, కాగితాలను సేకరించి అమ్ముకుని బతుకుతుంటారు. చిత్తు కాగితాలు ఏరు కుంటారు గానీ అందులో ఉండే అక్షరాల గురించి వారికి తెలి యదు. వీరిని రోజూ గమనించే ప్రవీణ్ కుమార్ ఓరోజు వారిని దగ్గరకు పిలిచి పలక, బలపం ఇచ్చి కొంతసేపు అక్షరాలు నేర్పించటం ప్రారంభించాడు. పిల్లలు కూడా రోజూ ఉత్సాహంగా రావటం ఆరంభించారు. ప్రవీణ్ కుమార్ పిల్లలకు చదువు చెప్పటానికి ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తంచేయలేదు. డిఎస్‌పీ, ఇన్‌స్పెక్టర్ వంటి ఉన్నతాధికారులు కూడా ప్రవీణ్ కుమార్‌ను ప్రోత్సహించటంతో ఇపుడు చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలందరూ ఇక్కడకు చదువుకోవటానికి వస్తున్నారు. వీరిలో సుమన్ అనే బాలుడు మాట్లాడుతూ.. మేమంతా చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్లం. ఇపుడు చదువుకోగలుగుతున్నాం. నేను కూడా పోలీసునవుతాను అని అంటున్నాడు.
***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03