Others

విటమిన్స్ టాబ్లెట్లలో విలువెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్తంత బలహీనంగా ఉన్నా, రక్తహీనత కనిపించినా వైద్యు లు విటమిన్స్ టాబ్లెట్లు రాసేస్తారు. వీటిలో ఉండే విలువెంతో తెలుసుకుంటే దానికన్నా మంచి ఆహారానే్న తీసుకోవటానికి ఇష్టపడతారు. రక్తహీనతతో బాధపడే మహిళలు ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే బదులు రోజూ చౌకగా దొరికే గోంగూర వండుకుని తింటే పుష్కలంగా విటమిన్ లభిస్తుందంటారు. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర పచ్చడి తింటే చాలు ఐరన్ టాబ్లెట్ వేసుకున్నంత మేలు జరుగుతుందని వైద్యులు అంటుంటారు. అలాగే గర్భిణీలకు సైతం పరీక్షల కోసం వెళితే విటమిన్స్ టాబ్లెట్స్‌ను వైద్యులు రాస్తుంటారు.
పని ఒత్తిడి వల్ల పోషకాహారం తీసుకోరనే ఉద్దేశ్యంతో కడుపులో ఉండే బిడ్డ చక్కగా పెరగాలంటే అన్నిరకాల విటమిన్స్ అవసరం కాబట్టి వీటిని రాస్తుంటారు. మందులు అనేసరికి గర్భిణులు క్రమం తప్పకుండా వేసుకుంటారు. కాని గర్భిణులకు మల్టీవిటమన్స్ టాబ్లెట్స్ వల్ల ఉపయోగం లేదని నిపుణులు అంటున్నారు. కొంతమంది తల్లులకు ఈ విటమిన్స్ టాబ్లెట్లు అవసరం లేదని వారు అంటున్నారు.‘ మందులు- చికిత్స’ అనే అంశంపై విడుదలైన ఓ హెల్త్ బులెటన్‌లో పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు. ఈ విటమిన్స్ టాబ్లెట్ల వల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి బలాన్ని ఇవ్వటం లేదని చెబుతున్నారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి టాబ్లెట్లను వైద్యులు తప్పక వేసుకోవల్సిందిగా వైద్యులు సూచిస్తారు. ఇవి వేసుకోవటంతో పాటు పోషకాహారం కూడా తీసుకోమని చెబుతారు. ఫోలిక్ యాసిడ్ 400 మిల్లీ గ్రాములు, విటమిన్-డి 10 మిల్లీగ్రాముల టాబ్లెట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేసుకోమంటారు. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని, విటమిన్-డి టాబ్లెట్ వల్ల తల్లీబిడ్డల ఎముకలు పటిష్టంగా ఉంటాయని వైద్యులు ఈ మందులను రాస్తారు.
పోషకాహార లోపం వల్ల పురిట్లోనే ప్రాణాలు వదులుతున్నారు. వెయ్యిమంది పిల్లలు పుడితే వీరిలో 40మంది చనిపోతున్నారు. ఈ సంఖ్యను కనీసం 29కి తగ్గించేందుకు ప్రభుత్వం ఉచితంగా ఈ టాబ్లెట్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది.
పుట్టబోయో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందనే ఆశతో ప్రతి తల్లి క్రమం తప్పకుండా వీటిని వాడటం సహజం. కాని వీటిని వేసుకోవటం వల్ల తల్లీబిడ్డలకు అనుకున్న మేరకు ఆరోగ్య ఫలితాలు రావటం లేదని పరిశోధకులు అంటున్నారు.
ఈ టాబ్లెట్లు బదులు తాజా కూరగాయలు, పండ్లు తీసుకోమని సలహా ఇస్తుంటామని, దీనివల్ల ఫోలిక్ యాసిడ్ తల్లీబిడ్డలకు అందుతుందని చెబుతుంటామని కొంతమంది ఓ మెడికల్ కాలేజీ నర్సులు తెలియజేస్తున్నారు.
ఈ రెండు టాబ్లెట్ వల్ల గర్భిణీలకు ఎలాంటి ఉపయోగం లేదని తాము కూడా చెబుతుంటామని వారు సైతం వెల్లడించటం గమనార్హం. ఈ రెండు విటమిన్లనూ ఆహారం ద్వారా తీసుకోవటమే మంచిదని పౌష్టికాహార ఉత్పత్తిదారుల అసోసియోషన్ సైతం తెలియజేస్తోంది.