పర్యాటకం

జ్యోతి స్వరూపుడు స్వామి అయ్యప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగ దైవంగా పేరొందిన కేరళ రాష్ట్రంలోని శబరిమలలో హరిహరసుతుడు కొలువై భక్తులకోరికలను ఈడేరుస్తున్నాడు. నేటికీ వయోభేదం లేకుండా చాలామంది అయ్యప్పమాలాధారణ పట్ల ఎక్కువ ఆకర్షితులై, దీక్షమాలను ధరిస్తున్నారు. కార్తికమాసంలో కుల, మత, జాతి, బేదాలు లేకుండా మాలధారణ చేసినవారు నల్లవస్త్రాలు ధరించి నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో దర్శనమిస్తున్నారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఎలుగెత్తి ఆ స్వామి నామాలు ఉచ్చరిస్తూ స్వామి పూజలను, భజనలను తనువు మరిచి భక్తి పారవశ్యంతో నిర్వహిస్తున్నారు. ఆంధ్రపదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లోనేవారే కాక ఇతరరా ష్ట్రాల వారు, పాశ్చాత్యులు కూడా ఈ మాలధారణ పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. విదేశాల్లోను అయ్యప్ప మందిరాలను బహుసుందరంగా నిర్మిస్తూ వారి భక్తిని చాటుతున్నారు.
క్రి.శ.10వ శతాబ్ధంలో తమిళభాషలోరచించబడిన పింగళ నిఘంటు అను గ్రంథం నుండి హరిహరపుత్రన్, అయ్యన్, అర్యన్, పూరణైకళ్వన్, పుట్కళైమణాళన్, అరతె్తైక్కాప్పోన్, శాతవాహన్, కోయికొడియోన్, శాత్తన్, వెల్లైయానైవాహనన్, కారి, చెండాయుధన్, యోగి, కడల్‌నిరవణ్ణన్ అను నామాలు అయ్యప్పనామాలుగా ప్రసిద్ధం అయ్యాయ.
క్రి.శ.1081కి పిదప కొందరు పాండ్యరాజుల వళ్లియూర్ నందును, తెన్‌కాశియందు సామంతరాజులై పాలించుచున్న సమయంలో వారి వంశావళికి చెందిన రాజకుటుంబీకులు కేరళ దేశమునకు వలస వెళ్లి పందళ రాజ్యమును స్థాపించారు. పందళరాజుకు అడవిలో మణిహారముతో అయ్యప్ప దొరికాడు. ఆ పసిపిల్లవాడ్ని తీసుకొని తన రాజమందిరానికి వెళ్లి ఎంతో అపురూపంగా పెంచుకోసాగాడు ఆ పందళరాజు. తరువాత పెంపుడు తల్లికి శిరోభారం వచ్చి పులిపాలకోసం అడవికి మణికంఠుడు వెళ్లి పులిపై ఎక్కివచ్చి పులి పాలను తేవడంతో ప్రజలందరికీ అయ్యప్పలోని సాటిలేని పరాక్రమాలు తేటతెల్లమయనాయ.
కొన్నాళ్లతరువాత తన తండ్రి అనుమతి తీసుకొన్న అయ్యప్ప జ్యోతిస్వరూపం అయనాడు. ప్రతిఏట తనను చూడాలనుకొనేవారికి సంక్రాంతినాడు జ్యోతిస్వరూపుడై దర్శనం ఇస్తానని మాట ఇచ్చాడట ఆ అయ్యప్ప. అప్పటి నుంచే మకర సంక్రాంతి నాడు స్వామి అయ్యప్ప జ్యోతి దర్శనం కోసం మాలధారులంతా శబరిమలై వెళ్తారు.
భక్తుల కోరికలను ఈడేర్చడానికి తాను ఆలయంలో కొలువు తీరుతానని చెప్పిన తన మాట నమ్మి శబరిమలకు వచ్చిన భక్తులకు ఇప్పటికీ జ్యోతిస్వరూపంతో స్వామి దర్శనం ఇస్తాడు. ఈ దర్శనం కోసమే మండలం రోజుల నుంచి నియమనిష్ఠలతో భక్తులు ఎదురుచూస్తారు.
1949 సంవత్సరంలో కొన్ని దుష్టశక్తులు నిరీశ్వరవాదులు వలన శమరిమలైలోని అయ్యప్ప దేవాలయం విగ్రహం ధ్వంసం చేశారు. అయ్యప్ప భక్తులుస్వామిని క్షమించ మంటూ స్వామి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు. 1951లో ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
మాలాధారణ చేసిన స్వాములు గురుస్వాములతోనే ఇంట్లోగాని, లేదా ఏదైనా ఆలయంలోగాని స్వామి వారి పీఠాన్ని ప్రతిష్టించుకుంటారు. నిత్యం ఉదయం, సాయంత్రం చన్నిటిస్నానం చేసి రెండు పూటల స్వామివారికి పూజ చే స్తారు. పూజ అనంతరము తీర్థాన్ని ముందుగా మాలాధారణ చేసిన స్వామి స్వీకరించి తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తారు. స్వామివారి జ్యోతి ఐదు వత్తులతో చేస్తారు. ఐదురకాల నూనెలతో దీపారాధన చేయడం మంచిదని అంటారు.
41దినముల దీక్ష అనంతరము గురుస్వామి చేత ఇరుముడి ధరించి, శబరిమాల యాత్రకు బయలుదేరిన స్వాము లు అడవుల గుండా పెద్ద పాదము మొక్కు ఉన్న వారు పెద్దపాదము 68కిలోమీటర్లు కాలినడకన నడవాల్సి ఉంటుంది. అయ్యప్పస్వామి తన దీక్ష బూనిన స్వాములకు శనిశ్వరునిరక్ష కూడా దొరుకుతుంది. అయ్యప్పమాలధారణ చేసి నల్లబట్టలు ధరించిన స్వాములపై శనేశ్వరుని వక్రదృష్టిపడదన్న భక్తులకు నమ్మకానికి ఇదే కారణం. శబరిమలై చేరుకునే ముందు స్వాములు కేరళలోని ఎరుమేళిలో ఆగి అక్కడ రంగులు పులుముకుని పెటైతుళ్లి ఆడుతారు. రంగులు పులుముకున్న శరీరంతోనే ఎరుమెళిలో ఉన్న అయ్యప్పస్వామి మిత్రుడైన వావర్‌స్వామి మసీదుకు వెళ్లి అక్కడ విభూతి పెట్టుకుని పంబానదికి చేరుకుంటారు. పెద్దపాదం నడక కూడా ఇక్కడి నుండి ప్రారంభిస్తారు. ఎరుమేళి నుండి వాహనాల్లో వెళ్లే స్వాములు తమ వాహనాలను శివం వద్ద నిలిపేస్తారు.
అక్కడి నుండి పంబకు వెళ్లి పవిత్రమైన పంబానదిలో స్నానమాచరిస్తారు. అక్కడి నుండి పంబాగణపతి స్వామి దర్శనం చేసుకుని అక్కడ టెంకాయ కొట్టి చిన్నపాదముతో శబరికొండ ఎక్కడ ప్రారంభిస్తారు. మార్గం మధ్యలోశరణ్‌గుత్తివద్ద కనె్నస్వాములు తమ వెంట తెచ్చిన బాణాలు గుచ్చుతుంటారు. శబరిమాలకు చేరిన తరువాత 18మెట్లను నమస్కరిస్తూ ఎక్కి స్వామివారి సన్నిధానికి చేరుకొంటారు.
శబరిమాల యాత్ర పూర్తి చేసుకుని స్వామివారికి ఇరుముడి ఇచ్చిన తరువాత ఇంట్లో తల్లి ఉంటే తల్లితోగాని లేదా, గురుస్వాములు గాని గుడిలోని పూజారితో గాని మాలధారణను విరమణ చేస్తారు.
శబరిమలైకి ఎప్పుడైతే కనె్నస్వాములు రారో అప్పుడు మాళిగై పురొత్తమ్మను వివాహం చేసుకుంటానని అయ్యప్పస్వామి మాళిగై పురొత్తమకు మాట ఇచ్చినట్లు చరిత్ర. అందుకే ఈ కనె్న స్వాములకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది.

- వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్