పర్యాటకం

ఆరోగ్యప్రదాత లలితాపరమేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లోకాన తీత్య లాలతే లలితాతేన సోచ్యతే’’ - లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి- లలితా పరమేశ్వరి. లోకోత్తర లావణ్య భావంతో చిన్మయ చైతన్యంతో ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్య లీలలకు లలాటం లలనాస్థలి. ఈ తల్లినే హయగ్రీవుడు ‘శ్రీమాతా’ అన్నాడు. సృష్టికి మూలకారణం ఆదిపరాశక్తి. పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు. అఖిల లోకాలను పాలించే తల్లి లలితాపరమేశ్వరి.
నామం-్భవ ప్రపంచం అయితే, రూపం వస్తు ప్రపంచం. ఈ రెండింటి మధ్య నడచేదంతా క్రియారూపం. నామ, రూప, క్రియలనే ఈ మూడూ త్రిపురములు. త్రిపురములను సృష్టించి, ఆనందమయంగా విహరించే మహోదాత్త ‘శక్తి’ శ్రీ లలితా త్రిపురసుందరి. ఆ లలితాపరమేశ్వరి దేవినే రాజరాజేశ్వరిగాను కీర్తించబడుతోంది. ఆ తల్లి నేడు ఖమ్మంజిల్లా ఎర్రుపాలెంలోని తక్కెళ్లపాడు గ్రామంలో ఆవిర్భవించింది.
ఆ తల్లి గుంటపల్లి అచ్చయ్య కుమారుడు సత్యనారాయణుడుని ఆదేశించి తనకోసం ఓ ఆలయాన్ని ఇక్కడ నిర్మింపచేసుకొంది.1983లో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి చేతుల మీదుగా ఈ ఆలయంలో అమ్మప్రతిష్ఠాపన జరిగింది. నాటి నుంచి ఈ తల్లిని ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వచ్చి సేవిస్తుంటారు. ప్రతిరోజు తల్లికి నిత్యార్చనలు, ప్రతి శుక్రవారం విశేష అర్చనలు, ప్రత్యేక కుంకుమార్చనలు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా సాగుతుంటాయి.
ఈ తల్లి కొలువైన ఈ దేవాలయం ఖమ్మంజిల్లా ఎర్రుపాలెంలోని తక్కెళ్ల పాడు గ్రామానికే కాదు తెలంగాణా రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన అరుదైన ఆలయంగా ఖ్యాతి గడించింది.
ప్రతిరోజు ఇక్కడ లలితాసహస్రనామావళిని భక్తులంతా పఠిస్తుంటారు. ఆ తల్లి సహస్రనామంలోని ప్రతి నామము విఖ్యాతమైనదే. అశేషసంపదలినిచ్చేది. అంతేకాదు ‘మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా’ అనే శ్లోకాన్ని మూల బీజ మంత్రంలో ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థితాయై నమః అని ఉచ్ఛరిస్తూ తీర్థం తీసుకొంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రస గంధములనే అయిదు ముఖములతో భాసిల్లే ‘సాకినీ’ దేవతగా పరిపూర్ణమైన పృథ్వీతత్త్వంతో, అన్నింటికీ మూలాధారమైన మూలాధార చక్రంలో వసించే లలితా పరమేశ్వరీ ‘శక్తి’యే మనకు ఆరోగ్యాన్నిచ్చేది. లలితా పరమేశ్వరీ శక్తిని ఉపాసన చేస్తే కుండలినీయోగసిద్ధుడై స్వస్వరూప సంధానము కలిగి అమృతధారలు వర్షిస్తాయ.ఇక్కడి పూజారులు లలితాసహ్రసనామావళిని భక్తులందరిచేత పారాయణ చేయస్తుంటారు. సహస్రనామావళిలోని కొన్ని కొన్ని నామాలు మాత్రమే పఠించినా అమ్మ దయను ఎలా పొందవచ్చో కూడా వివరిస్తుంటారు. భక్తుల్లో కొందరు తమకు సమస్యలున్నాయని వాటిని దూరం చేసుకోవాలంటే అమ్మ అనుగ్రహం సులభంగా పొందే వీలును చెప్పమని అడుగుతుంటారు. అలాంటివారికి ఆర్తితో అమ్మా అనిపిలిస్తేనే చాలు అమ్మ పలుకుతుంది అయనా ఫలానా నామాలను రోజు అనుసంధానించు కుంటూ ఉండండి అమ్మ అపారమైన కరుణ మీమీద ప్రసరిస్తుంది అని కూడా చెప్తుంటారు. ఈతిబాధలు, గ్రహ బాధలు, తీరడానికి అమ్మ సహస్రనామావళిని పఠించే భక్తులు నిత్యమూ దేవాలయానికి వచ్చి అమ్మను దర్శించుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. అమ్మను దర్శించుకుని ఆలయంలో సహస్రనామావళిని పఠిస్తే కష్టాలు దూరమవుతాయని ఇక్కడి భక్తుల కథనం. అసలు విశ్వమంతా తల్లిరూపమే. కదిలే ప్రతి కణంలో ప్రసరించే ప్రతి కిరణంలో, జీవించిన ఉన్న ప్రతి ప్రాణిలో లలితా పరమేశ్వరీ రూపమే తొణికిసలాడుతుందనే భక్తులు ఉన్నారు.
ఎర్రుపాలెంలోని ఈ లలితాపరమేశ్వరి దేవాల యంలో వినాయకుడు, వీరాంజనేయుడు, శ్రీకృష్ణుడు కూడా కొలువుదీరి ఉన్నారు. నవగ్రహ మండపం, కల్యాణ మండపాలు కూడా ఉన్నాయ. గ్రహపీడ నివారణార్థం ఇక్కడ భక్తులు నవగ్రహపూజలు అధికంగా చేయంచుకుంటూ ఉంటారు.
శంకరి, శంకరి కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి, పరాత్పరి గౌరి, అంబ... పరమ పావని, భవాని, సదాశివ కుటుంబిని.’’ అని శివశక్తి సామరస్యంగా కల్యాణి రాగంలో లయబ్రహ్మ కామాక్షీ వరప్రసాదుడు- శ్యామశాస్ర్తీ మనకందించిన కీర్తనల్లాంటి వాటిని కూడా సాయంసంధ్యాసమయంలో ఇక్కడ ఆలపించి అమ్మను కొలుస్తుంటారు.
ఎర్రుపాలెంలోని తక్కెళ్లపాడు గ్రామానికి రావడానికి బస్సు సౌకర్యం ఉంది. మధిరకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ తక్కెళ్లపాడు గ్రామం ఉంది.

- జి. కల్యాణి